TE/Prabhupada 0651 - మొత్తం యోగ పద్ధతి అంటే మనస్సును మన స్నేహితుడిగా చేసుకోవడం



Lecture on BG 6.6-12 -- Los Angeles, February 15, 1969


ప్రభుపాద: సమావేశమైన భక్తులందరికీ జయము.

భక్తులు: మీకు అన్ని జయాలు ప్రభుపాద.

ప్రభుపాద: పేజీ?

భక్తుడు: శ్లోకము ఆరు.

భక్తుడు: " తన మనస్సును జయించినవాడికి, అది స్నేహితులలో ఉత్తమమైనది. కానీ అలా చేయడంలో విఫలమైన వ్యక్తికి, అతడి మనస్సు గొప్ప శత్రువుగా వుంటుంది ( BG 6.6) "

ప్రభుపాద: అవును. ఈ మనసు, వారు మనస్సు గురించి మాట్లాడుతున్నారు. మొత్తం యోగ పద్ధతి అంటే మనస్సును మన స్నేహితుడిగా చేసుకోవడం. మనస్సు, భౌతిక సంబంధంలో.... మత్తు పరిస్థితిలో ఉన్న వ్యక్తిలా తన మనస్సు శత్రువు. చైతన్య-చరితామృతంలో మంచి శ్లోకము ఉంది.

కృష్ణ భులియ జీవ భోగ వాంఛా కరె
పాసటెమాయా తారె జాపతియా ధరె
(ప్రేమ-వివర్త).

మనస్సు.... నేను ఆత్మ, దేవాదిదేవుని అంశ మరియు భాగము. మనస్సు కలుషితమైన వెంటనే, నేను ఎదురు తిరుగుతాను, ఎందుకంటే నాకు కొద్ది స్వతంత్రం లభించింది. నేను కృష్ణున్ని లేదా భగవంతుని ఎందుకు సేవించాలి? నేను భగవంతుడిని. ఇది కేవలం మనసు నుండి ఒక శాసనం. మొత్తం పరిస్థితి మారుతోంది. అతడు తప్పు భావన, భ్రమలో ఉన్నాడు, మొత్తం జీవితం నాశనం అవుతుంది. ఎవరైతే అలా చేయడంలో విఫలమవుతారో, మనం మనస్సును జయించడంలో విఫలమైతే, మనం చాలా విషయాలు జయించడానికి ప్రయత్నిస్తున్నాం, సామ్రాజ్యం, కానీ మన మనస్సును జయించడంలో విఫలమైతే, అప్పుడు మీరు ఒక సామ్రాజ్యాన్ని జయించినా, అది ఒక వైఫల్యం. అతడి మనస్సు గొప్ప శత్రువుగా వుంటుంది. కొనసాగించు.

భక్తుడు: మనస్సును జయించిన వాడికి, పరమాత్మని అప్పటికే చేరుకున్నాడు, ఎందుకంటే అతడు శాంతిని పొందాడు. అలాంటి మనిషికి, ఆనందం మరియు బాధ, వేడి మరియు చల్లదనం, గౌరవం మరియు అగౌరవం అన్నీ ఒకటే ( BG 6.7) "

ప్రభుపాద: కొనసాగించు. భక్తుడు:" ఒక వ్యక్తి ఆత్మ-సాక్షాత్కారములో నెలకొని, ఒక యోగి లేదా మర్మయోగి అని పిలువబడ్డాడు,  ఆయన ఆర్జించిన జ్ఞానము మరియు అనుభవం వలన పరిపూర్ణముగా సంతృప్తి చెందినప్పుడు అలాంటి వ్యక్తి దివ్యత్వంలో స్థిరంగా ఉంటాడు, స్వయం-నియంత్రణ కలిగి ఉంటాడు. అతడు గులకరాళ్ళు, రాళ్లు లేదా బంగారం, అన్నిటినీ ఒకే విధముగా చూస్తాడు ( BG 6.8) "

ప్రభుపాద: అవును. మనస్సు సమతుల్యములో ఉన్నప్పుడు, ఈ పరిస్థితి వస్తుంది. గులకరాళ్లు, రాళ్లు లేదా బంగారం, అదే విలువ.