TE/Prabhupada 0652 - ఈ పద్మపురాణము సత్వ గుణములో ఉన్నవారికి ఉద్దేశించబడింది



Lecture on BG 6.6-12 -- Los Angeles, February 15, 1969


భక్తుడు: భాష్యము: "మహోన్నతమైన సత్యము యొక్క సాక్షాత్కారము లేకుండా పుస్తక విజ్ఞానము నిష్ఫలము. పద్మపురాణములో ఈ విధముగా చెప్పబడింది... "

ప్రభుపాద: అవును, పద్మపురాణము. పద్దెనిమిది పురాణములు ఉన్నాయి. ఉన్నాయి... వ్యక్తులు మూడు గుణములలో నిర్వహించబడతారు: సత్వ గుణము, రజో గుణము మరియు తమో గుణము. వివిధ రకాల జీవులలో ఈ బద్ధజీవాత్మలను అన్నింటిని తిరిగి తీసుకువెళ్ళటానికి, పురాణములలో వీటి యొక్క ప్రస్తావన ఉంది. ఆరు పురాణాలు సత్వ గుణములో ఉన్నవారికి ఉద్దేశించబడినవి. ఆరు పురాణాలు రజో గుణములో ఉన్న వ్యక్తులు కోసం ఉద్దేశించబడినవి. ఆరు పురాణాలు - తమో గుణములో ఉన్నవారికి, ఆ పురాణాలు వారికి ఉద్దేశించబడినవి. ఈ పద్మపురాణము సత్వ గుణములో ఉన్నవారికి ఉద్దేశించబడింది. వేదముల ఆచారాలలో, మీరు చాలా భిన్నమైన సంప్రదాయాలను చూస్తారు. వివిధ రకాలైన వ్యక్తులు దీనికి కారణం. ఉదాహరణకు మీరు విన్నారు వేదముల సాహిత్యములో , కాళిక దేవి సమక్షంలో మేకను బలి చేసే సంప్రదాయ వేడుక ఉంది. కానీ ఈ పురాణము, మార్కండేయ పురాణము, తమో గుణములో ఉన్న వ్యక్తులు కోసం ఉద్దేశించబడింది.

ఉదాహరణకు మాంసం తినడానికి ఒక వ్యక్తి అలవాడు పడి ఉన్నట్లయితే. అకస్మాత్తుగా, ఇప్పుడు మాంసం తినడం మంచిది కాదని ఆయనకు చెప్పినట్లయితే ... లేదా మద్యం తాగడానికి ఒక వ్యక్తి అలవాడు పడి ఉన్నట్లయితే. ఆయన ఒకసారిగా మద్యం తీసుకొనుట మంచిది కాదని చెప్పినట్లయితే, అతడు అంగీకరించలేడు. అందువలన పురాణములలో మనము కనుగొంటాము, "సరే, మీరు మాంసం తినాలంటే, మీరు కాళికాదేవిని ఆరాధించి, దేవతకు ముందు ఒక మేకను బలి ఇచ్చి దాని మాంసం మీరు తినవచ్చు. మీరు కబేళా లేదా కసాయి వాని దుకాణం నుండి కొనుగోలు చేయడం ద్వారా మాంసమును తినకూడదు. మీరు ఈ విధముగా తినవలసి ఉంది. "దాని అర్థం పరిమితి. ఎందుకంటే మీరు కాళికాదేవి ముందు బలి ఇవ్వాలి అని కోరుకుంటే, ఒక నిర్దిష్ట సమయము ఉంటుంది, ఒక నిర్దిష్ట సామగ్రి ఉంటుంది, మీరు వాటిని ఏర్పాటు చేయాలి. ఆ పూజ, ఆ ఆరాధన అమావాస్య నాడు మాత్రమే అనుమతించబడినది. కాబట్టి అమావాస్య రాత్రి అనగా నెలలో ఒకసారి మాత్రమే. మంత్రాలు ఈ విధముగా పటించాలి ఆ మేకకు సంకేతం ఇస్తారు "నీవు కాళికాదేవి ముందు నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు. కాబట్టి నీవు వెంటనే ఒక మానవ శరీరమునకు ఉద్దరించ బడతావు . "వాస్తవానికి అది జరుగుతుంది. ఎందుకంటే మానవ శరీరము యొక్క ప్రమాణములోనికి రావడానికి , ఒక జీవి చాలా పరిణామ పద్ధతి ద్వారా వెళ్ళాలి. కానీ ఏ మేకైతే అంగీకరిస్తుందో , లేదా బలవంతముగా కాళికాదేవి ముందు బలి ఇవ్వబడుతుందో, అది తక్షణము మానవ శరీరమునకు ఉద్దరించ బడుతుంది. మంత్రం ఇలా చెబుతోంది, "నిన్ను బలి ఇస్తున్న ఈ వ్యక్తిని చంపడానికి నీకు హక్కు ఉంది." మాంస. మాంస అనగా నీవు కూడా ఆయన మాంసాన్ని మరుసటి జన్మలో తింటావు ఈ విధముగా, బలి ఇస్తున్న వ్యక్తి, ఆయన తెలివిలోకి వస్తాడు, నేను ఎందుకు ఈ మాంసం తింటున్నాను? అప్పుడు నేను నా మాంసంతో తిరిగి చెల్లించవలసి ఉంటుంది. నేను ఈ పని ఎందుకు చేయాలి? మీరు చూడండి. మొత్తం ఆలోచన అతన్ని ఆపడానికి.

అందువల్ల వేర్వేరు రకాల పురాణాలు ఉన్నాయి, పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి. వేదముల సాహిత్యం మొత్తం అంటే అన్ని రకాలైన మనుష్యులకు తిరిగి ముక్తి కలిగించడము మాంసం తినేవాళ్ళు లేదా తాగుబోతులుగా ఉన్నవారు తిరస్కరించబడినారు అని కాదు. కాదు ప్రతి ఒక్కరూ అంగీకరించబడ్డారు, కానీ ఉంది- ఉదాహరణకు మీరు వైద్యుడి దగ్గరకి వెళ్ళినట్లుగా. ఆయన వేర్వేరు వ్యాధుల ప్రకారం మీకు వివిధ ఔషధాలను సూచిస్తాడు. అని దాని అర్థం కానీ ఆయన దగ్గర ఒక వ్యాధికి, ఒక ఔషధం మాత్రమే ఉంది అని కాదు. ఎవరు వచ్చినా, ఆ ఔషధం ఇస్తాడు. కాదు అది వాస్తవమైన చికిత్స. క్రమంగా, క్రమంగా. కానీ సాత్విక-పురాణములలో, వారు వెంటనే భగవంతుని ఆరాధించడం కోసం ఉద్దేశించబడినారు. ఏ క్రమ పద్ధతి లేదు. కానీ క్రమంగా, ఈ దశకు వచ్చిన వ్యక్తి, ఆయనకు సలహా ఇచ్చారు. కాబట్టి పద్మ పురాణము అనేది సత్వ గుణములో ఉన్న పురాణములలో ఒకటి. అది ఏమి చెప్తుంది? కొనసాగించు