TE/Prabhupada 0654 - మీ ప్రయత్నం ద్వారా మీరు భగవంతుణ్ణి చూడలేరు ఎందుకంటే మీ ఇంద్రియాలన్నీ పనికి మాలినవి



Lecture on BG 6.6-12 -- Los Angeles, February 15, 1969


భగవద్గీతలో చెప్పబడినట్లు:

patraṁ puṣpaṁ phalaṁ toyaṁ
yo me bhaktyā prayacchati
tad ahaṁ bhakty-upahṛtam
aśnāmi prayatātmanaḥ
(BG 9.26)

ఎవరైనా నాకు పువ్వు, పండ్లు, కూరగాయలు, పాలు సమర్పిస్తే, భక్తితో ప్రేమతో, నేను అంగీకరిస్తాను, తింటాను." ఇప్పుడు ఆయన ఎలా తింటాడు, ప్రస్తుతం నీవు చూడలేవు - కాని అతడు తింటాడు. అది మనము ప్రతి రోజూ అనుభవిస్తున్నాము. మనము ఆచార పద్ధతి ప్రకారం, కృష్ణుడికి భోగ సమర్పిస్తున్నాం, మీరు చూడండి ఆహారం రుచి వెంటనే మార్చబడుతుంది. అది ఆచరణాత్మకమైనది. ఆయన తింటాడు, ఎందుకంటే ఆయన పూర్ణుడు, కానీ ఆయన మనలాగా తినడం లేదు. నేను మీకు ఆహారాన్ని ఇచ్చినట్లయితే, మీరు పూర్తి చేస్తారు. కానీ భగవంతుడు ఆకలితో లేడు, కాని అతడు తింటాడు. ఆయన అవి తింటాడు మరియు ఆ పదార్థాలను అలాగే ఉంచుతాడు. Pūrṇasya pūrṇam ādāya pūrṇam evāvaśiṣyate (Śrī Īśopaniṣad, Invocation). భగవంతుడు సంపూర్ణుడు, మీరు అందించే అన్ని ఆహారపదార్ధాలను తీసుకోగలడు, వాటిని అలాగే ఉంచగలడు. ఆయన తన కళ్ళతో కూడా తింటాడు. ఇది బ్రహ్మ సంహితలో చెప్పబడింది: aṅgāni yasya sakalendriya-vṛttimanti. భగవంతుని శరీర భాగంలోని ప్రతి భాగం ఇతర శరీర భాగం యొక్క అన్ని శక్తులని కలిగి ఉంది. ఉదాహరణకు మీరు మీ కళ్ళతో చూడగలరు. కానీ మీరు మీ కళ్ళతో తినలేరు. కానీ భగవంతుడు, కేవలం మీరు ఇచ్చిన ఆహారాన్ని చూసినట్లయితే, అది ఆయన తినటం.

కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు అర్థం చేసుకోలేము. అందుచే ఇది ఈ పద్మపురాణము చెప్పింది, అది కేవలం భగవంతుని పవిత్ర సేవ ద్వారా మాత్రమే వ్యక్తి ఆధ్యాత్మికంగా పూర్తిగా సంతృప్తి చెందుతాడు , అప్పుడు, భగవంతుడు యొక్క పవిత్రమైన దివ్యమైన పేరు, రూపం, లక్షణము మరియు లీలలు మీకు వెల్లడవుతాయి. మీ ప్రయత్నంతో మీరు అర్థం చేసుకోలేరు, కానీ భగవంతుడు మీకు వెల్లడిస్తాడు. ఉదాహరణకు ఇప్పుడు మీరు సూర్యుడిని చూడాలనుకుంటే. ఇప్పుడు అది చీకటి. మీరు ఇలా చెప్పితే, "నా దగ్గర చాలా బలమైన టార్చిలైటు ఉంది, సూర్యరశ్మిని, సూర్యుడిని నేను చూపిస్తాను." మీరు చూపలేరు. కానీ ఉదయాన్నే సూర్యుడు తన స్వంత సంకల్పం తో ఉదయించినప్పుడు, మీరు చూడగలరు. అదేవిధముగా మీ ప్రయత్నం ద్వారా మీరు భగవంతుణ్ణి చూడలేరు ఎందుకంటే మీ ఇంద్రియాలన్నీ పనికి మాలినవి. మీరు మీ ఇంద్రియాలను పవిత్రము చేయాలి. మీరు సమయం కోసం వేచి ఉండాలి భగవంతుడు మీ యెదుట తనను తాను ప్రకటించుటకు సంతృప్తి చెందినప్పుడు. అది పద్ధతి. మీరు సవాలు చేయలేరు. " నా ప్రియమైన భగవంతుడా, నా ప్రియమైన కృష్ణా, దయచేసి వచ్చేయి, నేను నిన్ను చూస్తాను." లేదు, భగవంతుడు మీ ఆజ్ఞా పాలకుడు, మీ సేవకుడు కాదు. అందువలన ఆయన సంతృప్తి చెందినప్పుడు, మీరు చూస్తారు.

కాబట్టి మన పద్ధతి ఆయనను ఎలా సంతృప్తి పరచాలి. అందువల్ల నాకు అతడు తనను వెల్లడి చేయబడును. ఇది వాస్తవమైన పద్ధతి. మీరు చేయలేరు... అందువల్ల వారు తప్పు చేస్తున్నారు. ఒక అర్థంలేని భగవంతుని ఎందుకంటే వారు భగవంతుణ్ణి చూడలేరు కాబట్టి, "నేను భగవంతుని" అని ఎవ్వరు చెప్పినా, ఇది అంగీకరించారు. కానీ వారికి భగవంతుడు అంటే ఏమిటో తెలియదు. కొందరు చెప్తారు "నేను సత్యము కొరకు శోధిస్తున్నాను." కానీ మీరు సత్యము ఏమిటో తెలుసుకోవాలి. లేకపోతే మీరు సత్యమును ఎలా శోధిస్తారు? మీరు బంగారం కొనాలని అనుకుందాం. మీరు సిద్ధాంతపరంగా తెలుసుకోవాలి, లేదా కనీసం కొంత అనుభవం ఉండాలి బంగారం అంటే ఏమిటి అని. లేకపోతే జనాలు మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి ఈ ప్రజలు మోసం చేయబడ్డారు, చాలా మంది దుష్టులను మూర్ఖులను భగవంతునిగా అంగీకరించారు. ఎందుచేతనంటే భగవంతుడంటే ఏమిటో తెలియదు మూర్ఖుడు. ఎవరైనా వస్తారు, "నేను భగవంతుని," అంటారు. మూర్ఖుడు- అతను మూర్ఖుడు, "నేను భగవంతుణ్ణి" అని చెప్పిన వాడు కూడా దుష్టుడు, మూర్ఖుడు. మూర్ఖపు సమాజం, ఒక దుష్టుడిని భగవంతుడు అని అంగీకరించారు. భగవంతుడు అలాంటివాడు కాదు. భగవంతుణ్ణి చూడడానికి, భగవంతుణ్ణి అర్థం చేసుకునేందుకు తనను తాను అర్హత పొందాలి. ఇది కృష్ణ చైతన్యము. Sevonmukhe hi jihvādau svayam eva sphuraty adaḥ [Bhakti-rasāmṛta-sindhu 1.2.234]. మీరు భగవంతుని యొక్క సేవ లో మిమ్మల్ని మీరు వినియోగించినప్పుడు, అప్పుడు మీరు భగవంతుణ్ణి చూడడానికి అర్హత పొందుతారు. లేకపోతే అది సాధ్యం కాదు. కొనసాగించు