TE/Prabhupada 0662 - వారు పూర్తిగా ఆందోళనతో ఉన్నారు ఎందుకంటే వారు దేనినో అశాశ్వతమైన దానిని పొందారు



Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969


తమాల కృష్ణ: శ్లోకము పదిహేను: "ఈ విధముగా ధ్యానం చేస్తూ, ఎల్లప్పుడూ శరీరము, మనస్సు మరియు కర్మలను నియంత్రించుచూ, ధ్యాన యోగులు శాంతిని (మహోన్నతమైన నిర్వాణం) కలిగి ఉంటారు, ఇది నా యందు (BG 6.15) ఉంటుంది." ప్రభుపాద: నిర్వాణం అనగా, సంస్కృతములో వాస్తవమైన పదం నిర్వాణ అంటే నిర్వాణం అనగా పూర్తయింది. పూర్తయ్యింది. దీనిని నిర్వాణం అని పిలుస్తారు. అంటే భౌతిక కార్యక్రమాలు ఆపివేయబడినవి. ఇంక లేవు. దీనిని నిర్వాణం అని పిలుస్తారు. మీరు ఈ అర్థంలేని కార్యక్రమాలను ఆపి వేస్తే తప్ప, శాంతి ప్రశ్నే లేదు. ఎంత కాలము మీరు భౌతిక కర్మలలో నిమగ్నమై ఉంటారో, శాంతి అనే ప్రశ్నే లేదు. ప్రహ్లాద మహారాజు తన తండ్రితో చెప్పారు, tat sādhu manye 'sura-varya dehināṁ sadā samudvigna-dhiyām asad-grahāt. ఆయన తండ్రి ఆయనని అడిగాడు, "నా ప్రియమైన పుత్రుడా, నీవు చదువుకుంటున్నావు..." ఒక చిన్న పిల్లవాడు, ఐదు సంవత్సరాలు. తండ్రి ఎల్లప్పుడూ అభిమానంతో ఉంటాడు, ఆయన అడుగుతున్నాడు, నా ప్రియమైన పుత్రుడా, నీవు నేర్చుకున్న దానిలో, అత్యుత్తమ విషయము ఏమిటి, ఇప్పటి వరకు? ఓ, ఆతడు వెంటనే, "అవును తండ్రీ, నేను మీకు చెప్తాను, అత్యుత్తమ విషయము." అది ఏమిటి? ఆతడు చెప్పాడు, tat sādhu manye 'sura-varya dehināṁ. నా ప్రియమైన తండ్రి, ఇది అత్యుత్తమ విషయము. ఎవరికీ? అత్యుత్తమ విషయము ఎవరికీ? ఆతడు చెప్పాడు, tat sādhu manye 'sura-varya dehināṁ sadā samudvigna-dhiyām asad-grahāt ( SB 7.5.5) ఈ వ్యక్తులు, ఈ భౌతికమైన వ్యక్తులు ఎవరైతే, ఏదైనా అశాశ్వతమైనది స్వీకరించారో... ప్రతి పదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ భౌతికమైన వ్యక్తులు, వారు ఏదో అశాశ్వతమైన దానిని పొందుట కోసము ఆరాటపడుతున్నారు. అంతే. మీరు చూశారు, అనుభవం ద్వారా. ఇప్పుడు ఆ అధ్యక్షుడు, Mr. కెన్నెడీ, ఆయన చాలా ధనవంతుడు. ఆయన అధ్యక్షుడిగా ఉండాలని కోరుకున్నాడు ఆయన డబ్బును చాలా ఖర్చు చేశాడు. ఆయన అధ్యక్షుడయ్యాడు. ఆయన చక్కని కుటుంబం, భార్య, పిల్లలు, అధ్యక్ష పదవి కలిగి ఉన్నాడు - ఒక క్షణములో మొత్తము ముగిసిపోయింది. అదేవిధముగా ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు, భౌతిక ప్రపంచంలో, ఏదైనా అశాశ్వతమైనది పొందటానికి. కానీ నేను ఆత్మను, శాశ్వతము.

కాబట్టి ఈ మూర్ఖులు వారు తెలివికి రారు "నేను శాశ్వతంగా ఉంటాను. ఎందుకు నేను అశాశ్వతమైన వాటి కోసము ఆశ పడుతున్నాను? " నేను ఈ శరీరం యొక్క సుఖాల కోసం ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటే, కానీ నాకు ఈ శరీరం, నేడు లేదా రేపు లేదా వంద సంవత్సరాల తర్వాత మరణిస్తుంది అని తెలుసు, ఇప్పటివరకు నా గురించి ఆలోచిస్తే, నేను ఆత్మను, నాకు జన్మ లేదు, నాకు మరణం లేదు. అప్పుడు నా పని ఏమిటి? ఇది శరీరము పని, ఇప్పటివరకు నేను చేస్తున్నాను, ఈ భౌతిక కార్యక్రమాలను. అందువలన ప్రహ్లాద మహారాజు అన్నాడు అసద్-గ్రహాత్. ఎంత బాగుందో చూడండి. వారు ఆందోళన చెందుతున్నారు, వారు పూర్తిగా ఆందోళనతో నిండిపోయారు ఎందుకంటే వారు దేనినో అశాశ్వతమైన దానిని పొందారు. వారి మొత్తం కార్యక్రమాలు ఏదో అశాశ్వతమైన దానిని పట్టుకోవటానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. అందువలన వారు ఎల్లప్పుడూ ఆందోళనలతో ఉన్నారు. ఏవరైనా వ్యక్తి, ఏదైనా జీవి, మనిషి లేదా మృగం లేదా జంతువు లేదా పక్షులు, ఎప్పుడూ ఆత్రుతగా ఉంటాయి. ఇది భౌతిక వ్యాధి. మీరు ఎల్లప్పుడూ పూర్తిగా ఆందోళనలతో ఉన్నట్లయితే, అక్కడ శాంతి అనే ప్రశ్న ఎక్కడ ఉంది? నీవు వెళ్ళు, నేను వీధిలో వెళ్తున్నాను, నేను చెప్తాను "కుక్క ఉంది జాగ్రత్త వహించండి." వారు చాలా సుందరమైన ఇంటిలో నివసిస్తున్నారు, కానీ చాలా ఆందోళనలతో. ఎవరైనా రాకపోవచ్చు. కుక్కను ఉండనివ్వండి. మీరు చూడండి? "కుక్క ఉంది జాగ్రత్త." "దొంగలు రాకూడదు." అంటే ఒక చక్కని గృహములో నివసిస్తున్నప్పటికి, చాలా బాగుంది, కానీ పూర్తిగా ఆందోళనలతో. పూర్తిగా ఆందోళనలతో. ఒక కార్యాలయంలో కూర్చుని, చాలా మంచి జీతము, ఎల్లప్పుడూ ఆలోచిస్తూ, "నేను ఈ కార్యాలయం కోల్పోను." మీరు చూడండి? మీరు చూడండి? అమెరికన్ దేశం, చాలా సంపన్నమైన దేశము, చాలా మంచి రక్షణ, రక్షణ శక్తి, ప్రతిదీ. ఎల్లప్పుడూ ఆత్రుతతో ఉంది. "ఓ, ఈ వియత్నాం వాసులు ఇక్కడ రాకపోవచ్చు." మీరు చూడండి? కాబట్టి ఆందోళన లేని వారు ఎవరు? కాబట్టి సారంశము మీరు ఆందోళన లేకుండా శాంతిని కోరుకుంటే, అప్పుడు మీరు కృష్ణ చైతన్యమునకు రావలసి ఉంటుంది. ఇతర ప్రత్యామ్నాయం లేదు. ఇది ఆచరణాత్మకమైనది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

అందువలన ఇక్కడ చెప్పబడింది, "ఈ పద్ధతిలో ధ్యానం చేయడము ద్వారా, నా మీద ధ్యానం చేస్తూ, కృష్ణా. ఎల్లప్పుడూ శరీరాన్ని నియంత్రిస్తూ. " మొదటి నియంత్రణ నాలుక. తదుపరి నియంత్రణ జననేంద్రియము. అప్పుడు మీరు ప్రతిదీ నియంత్రించ గలుగుతారు. కృష్ణుడు ప్రసాదమును తినడము మరియు కీర్తన చేయడము గురించి మీ నాలుకను నిమగ్నము చేయండి, ఇది నియంత్రించబడుతుంది, పూర్తి అవుతుంది. మీ నాలుక నియంత్రించబడిన వెంటనే, వెంటనే మీ కడుపు నియంత్రించబడుతుంది, వెంటనే తరువాత, మీ జననేంద్రియము నియంత్రించబడుతుంది. సాధారణ విషయము. శరీరమును, మనస్సును నియంత్రించడము, కృష్ణుడిపై మనసును స్థిరపరచటము, ఏ ఇతర నిమగ్నత లేకుండా, నియంత్రించడము. కార్యక్రమాలు - ఎప్పుడూ కృష్ణుని సేవ చేస్తూ ఉండటము. తోటపని, టైపింగ్, వంట చేయడము, పని చేయడము, కృష్ణుడి కోసం ప్రతిదీ - కార్యక్రమాలను. ధ్యాన యోగి అప్పుడు - వెంటనే వారు ధ్యాన యోగి అవుతారు శాంతిని, మహోన్నతమైన నిర్వాణంను పొందుతారు, అది నాలో ఉంటుంది. " ఇది అంతా కృష్ణుడిలో ఉంది. మీరు కృష్ణుడి కార్యక్రమాల వెలుపల శాంతిని కనుగొనలేరు. కృష్ణ చైతన్యమునకు వెలుపల. అది సాధ్యం కాదు. కొనసాగించు.