TE/Prabhupada 0663 - కృష్ణునితో మీరు కోల్పోయిన సంబంధం పునఃస్థాపించటానికి. ఇది యోగా అభ్యాసం



Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969


తమాల కృష్ణ: భాష్యము: "యోగా సాధనలో అంతిమ లక్ష్యం స్పష్టంగా వివరించబడింది."

ప్రభుపాద: ఇప్పుడు స్పష్టంగా వివరించారు. యోగా యొక్క ప్రయోజనము ఏమిటి? వారు యోగిగా మారడం వలన, ఇటువంటి మరియు అటువంటి ధ్యానం గురించి, యోగా సమాజానికి హాజరు కావడం వలన చాలా గర్వంగా ఉన్నారు. కానీ ఇక్కడ యోగా అభ్యాసం ఉంది. స్పష్టంగా వివరించారు. చదవడము కొనసాగించు.

తమాల కృష్ణ: "యోగా అభ్యాసం ఏ రకమైన భౌతిక సౌకర్యమును సాధించటానికి ఉద్దేశించినది కాదు. ఇది భౌతిక జీవితమును అన్ని విధములుగా నిలుపుదల చేయుట కొరకు ఉంది "

ప్రభుపాద: ఎంత కాలము మీకు కొన్ని భౌతిక సౌకర్యాలు అవసరమో, మీరు భౌతిక సౌకర్యాలను పొందుతారు, కానీ అది మీ జీవిత సమస్యలకు పరిష్కారం కాదు. భౌతిక సౌకర్యాలు, నేను అనుకుంటున్నాను మీరు అమెరికన్ అబ్బాయిలు మరియు అమ్మాయిలు , మీరు ఇతర దేశాల కంటే మెరుగైన భౌతిక సౌకర్యాలను కలిగి ఉన్నారు. కనీసం భారత దేశము కన్నా మెరుగైనవి, నేను నా అనుభవం నుండి చెప్పగలను. నేను చాలా దేశాలలో ప్రయాణించాను, జపాన్లో కూడా నేను చూసాను, అయినప్పటికీ మీరు మెరుగైన స్థానములో ఉన్నారు. కానీ మీరు శాంతి సాధించినట్లు మీరు అనుకుంటున్నారా? మీలో ఎవరైనా "అవును, నేను పూర్తిగా శాంతితో ఉన్నాను" అని చెప్ప గలరా. ఎందుకు యువత చాలా నిరాశ మరియు కలతతో ఉన్నారు? కాబట్టి, ఎంతవరకైతే మనము ఈ యోగా అభ్యాసాన్ని కొన్ని భౌతిక సౌకర్యాల కోసం ఉపయోగించుకుంటామో, శాంతి అనే ప్రశ్నే లేదు. యోగా అభ్యాసం కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి చేయాలి, అంతే. లేదా కృష్ణునితో మీరు కోల్పోయిన సంబంధం పునఃస్థాపించటానికి. ఇది యోగా అభ్యాసం. చదవడము కొనసాగించు.

తమాల కృష్ణ: "ఆరోగ్యము మెరుగుపడడానికి లేదా భౌతికమైన వాటి కొరకు ఆశపడే వ్యక్తి..."

ప్రభుపాద: సాధారణంగా ఈ యోగా అభ్యాసం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి అనే పేరుతో జరుగుతు ఉంటుంది. కొందరు కొవ్వు తగ్గించు కోవడానికి వెళ్లుతారు. మీరు చూడoడి? కొవ్వు తగ్గించండి. మీది ధనిక దేశం కనుక, మీరు ఎక్కువ తింటారు మరియు కొవ్వును పెంచు కుంటారు, ఆపై మళ్ళీ యోగ సాధన ఫీజు చెల్లించి మీ కొవ్వు తగ్గించుకుంటారు. అది జరుగుతోంది. మొన్నటి రోజు నేను కొన్ని ప్రకటనలను చూశాను, "మీ కొవ్వు తగ్గించు కోండి." ఎందుకు మీరు మీ కొవ్వును పెంచకుంటారు? అర్థంలేని వాటిని వారు అర్థం చేసుకోరు. నేను తగ్గించు కోవాలంటే, నేను ఎందుకు పెంచాలి? సరళమైన ఆహారంతో ఎందుకు సంతృప్తి చెందకూడదు? మీరు ధాన్యాలు కూరగాయలు తేలికపాటి ఆహార పదార్ధాలను తింటే, మీకు కొవ్వుకు ఎన్నటికీ పెరగదు. మీరు చూడoడి? మీకు కొవ్వు ఎన్నటికి పెరగదు. సాధ్యమైనంత తినడం తగ్గించండి. రాత్రి తినకూడదు. ఈ విధముగా యోగ సాధన చేయండి మీరు విపరీతముగా తినేవారు అయితే, మీకు... రెండు రకాల వ్యాధులు ఉన్నాయి. అతిగా తినేవాళ్ళు, వారు డయాబెటిస్ బారిన పడతారు, తగినంతగా తినలేని వారు, వారు క్షయవ్యాధి తో ఉంటారు. మీరు ఎక్కువ తినడానికి లేదు లేదా మీరు తక్కువ తినడానికి లేదు. మీరు అవసరం అయినంత మీరు తినండి. మీరు ఎక్కువ తింటూ ఉన్నా, అప్పుడు మీరు తప్పక వ్యాధిని కలిగి ఉండాలి. మీరు తక్కువ తింటూ ఉంటే, మీరు తప్పక వ్యాధిని కలిగి ఉండాలి అది వివరించబడుతుంది. Yuktāhāra-vihārasya… yogo bhavati siddhi na ( BG 6.17) మీరు ఆకలితో బాధ పడకూడదు, కానీ ఎక్కువ తినకూడదు. మా కార్యక్రమం, కృష్ణ-ప్రసాదం, మీరు కృష్ణ-ప్రసాదమును తినండి. తినడం అవసరం - మీరు మీ శరీరము ఆరోగ్యముగా ఉంచుకోవాలి. ఏదైనా అభ్యాసము చేయడానికి. కాబట్టి తినడం అవసరం. కానీ ఎక్కువ తినవద్దు. తినండి... తక్కువ కూడ తినవద్దు. మీరు తక్కువ తినండి అని మేము చెప్పడము లేదు. మీరు పది పౌండ్లు తినగలిగితే మీరు తినండి. కానీ మీరు పది పౌండ్లను తినలేక పోయినట్లయితే, అత్యాశ వలన మీరు పది పౌండ్లు తింటే, అప్పుడు మీరు బాధ పడతారు. మీరు చూడoడి? ఇక్కడ, అది ఏమిటి? భౌతిక సౌకర్యాలు లేవు. చదవడము కొనసాగించు.