TE/Prabhupada 0665 - కృష్ణుని లోకము, గోలోక వృందావనం, ఇది స్వయం - ప్రకాశవంతమైనది



Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969


తమాల కృష్ణ: "ముఖ్యంగా భౌతిక జీవితము యొక్క నిలుపుదల ఒకరిని ప్రవేశించేటట్లు చేస్తుంది. ఆధ్యాత్మిక ఆకాశం లోకి, భగవంతుడు యొక్క నివాసమునకు. భగవంతుడు యొక్క నివాసం కూడా స్పష్టంగా భగవద్గీతలో వివరించబడింది ఆ ప్రదేశంలో ఎక్కడైతే సూర్యుడు లేదా చంద్రుడు అవసరం లేదో, లేదా విద్యుత్తు అవసరం కలిగి ఉండదో. "

ప్రభుపాద: ఇప్పుడు మీరు భగవద్గీతలో కనుగొంటారు, మనం ఇప్పటికే ... నేను రెండవ అధ్యాయంలో ఉందనుకుంటున్నాను, ఏమైనప్పటికి, అది చెప్పబడింది:

na tad bhāsayate sūryo
na śaśāṅko na pāvakaḥ
yad gatvā na nivartante
tad dhāma paramaṁ mama
(BG 15.6)

ఇప్పుడు కృష్ణుడు ఇలా వర్ణించాడు, "నా నివాసం, ఇది ఎలా ఉంటుందో ఆ ఆకాశంలో, అక్కడ నా నివాసం ఉన్నచోట, సూర్య కాంతి అవసరం లేదు, చంద్రకాంతి అవసరం ఉండదు, విద్యుత్ అవసరం లేదు." ఇప్పుడు మీరు ఈ విశ్వంలో అలాంటి ప్రదేశము కనుగొనలేరు. మీరు మీ స్పుత్నిక్ లేదా ఏ యంత్రంతో అయినా ప్రయాణం చేస్తే, మీరు సూర్యరశ్మి లేనట్టి, చంద్రుని కాంతిలేనట్టి ఒక ప్రదేశమును కనుగొనండి సూర్యకాంతి చాలా విస్తృతమైనది, విశ్వమంతా సూర్యకాంతి ఉంది. మీరు ఎక్కడ ఆ స్థలాన్ని కనుగొంటారు? అంటే అర్థం ఆ ధామము ఆకాశం అవతల ఉన్నది. అది కూడా చెప్పబడింది: paras tasmāt tu bhāvo 'nyo 'vyakto 'vyaktāt sanātanaḥ ( BG 8.20) ఈ భౌతిక ప్రకృతికి వెలుపల మరొక ఆధ్యాత్మిక ప్రకృతి ఉంది. కాబట్టి ఈ భౌతిక ప్రకృతి ఎలా సృష్టించబడిందో మనకు తెలియదు, ఇక ఆధ్యాత్మిక ప్రకృతి గురించి ఏం తెలుసుకుంటాము అప్పుడు మీరు అక్కడ నివసిస్తున్న కృష్ణుని నుండి వినవలసిన అవసరం ఉంది. లేకపోతే మీరు మీ జీవితం అంతా అర్థము లేని వారిగా ఉంటారు.

ఇక్కడ సమాచారం ఉంది. ఎలా తెలుసుకుంటారు మీరు ఏదైనా చేయలేనిది, చేరుకోలేనిది, తెలుసుకోలేని దాని గురించి - మీ ఇంద్రియాలు చాలా అసంపూర్ణమైనవి. మీకు ఎలా తెలుస్తుంది? మీరు వినవలసి ఉంటుంది. ఉదాహరణకు మీరు తల్లి నుండి మీ తండ్రి గురించి శ్రవణము చేయాలి. ఏ ఇతర మార్గం లేదు. తండ్రి ధ్రువీకరింపబడతారు, తల్లి ధృవీకరిస్తుంది, "ఇతను మీ తండ్రి, మీరు అంగీకరించాలి." మీరు ఏ ప్రయోగాన్ని చేయలేరు. మీకు వేరే మార్గమేమీ లేదు. అదేవిధముగా, మీరు ఆధ్యాత్మిక ఆకాశం భగవంతుని రాజ్యం గురించి తెలుసుకోవాలనుకుంటే, అప్పుడు మీరు కేవలం ప్రామాణికుని నుండి వినవలసి ఉంటుంది. ప్రయోగాత్మక జ్ఞానం యొక్క ప్రశ్నే లేదు. కేవలం వినాలి. కాబట్టి శ్రవణము అంటే, ఉదాహరణకు మీరు ఎవరో ఒకరిని మీ తండ్రి అని మీ తల్లి యొక్క ప్రామాణికం నుండి విని మీరు విశ్వసించినట్లుగా. కేవలం, తల్లిగా అంగీకరించిన వేదముల సాహిత్యం నుండి, తల్లి యొక్క ప్రామాణికం, జ్ఞానం. తల్లి ప్రామాణికం. వేద-మాతా. దీనిని వేద- మాతా అని పిలుస్తారు. వేదములు అంటే జ్ఞానం. అది తల్లి నుండి పొందబడుతుంది. కాబట్టి వేద-మాత, జ్ఞాన తల్లి నుండి మీరు తెలుసుకోవాలి కృష్ణుడు అంటే ఏమిటి. ఇక్కడ కృష్ణుడు వ్యక్తిగతంగా వివరిస్తున్నాడు. మీరు దీన్ని విశ్వసించాలి. అప్పుడు మీరు జ్ఞానం పొందుతారు. లేకపోతే అవకాశం లేదు. మీరు ఏ ప్రయోగాన్ని చేయలేరు. అప్పుడు మీరు విఫలమౌతారు. కొనసాగించు.

తమాల కృష్ణ: "ఆధ్యాత్మిక రాజ్యంలోని అన్ని లోకములు భౌతిక ఆకాశంలో సూర్యుని వలె స్వయం -ప్రకాశిస్తాయి ..."

ప్రభుపాద: కాబట్టి అవి... ఎందుకంటే ఇక్కడ, ఈ లోకము, ఈ భూ లోకము ప్రకాశించడము లేదు, అందువల్ల మీకు చంద్రుని ద్వారా విద్యుత్ ద్వారా, సూర్యుని ద్వారా వెలుతురు అవసరం. కానీ అక్కడ ఆ లోకమున ... కృష్ణుడు స్వయం ప్రకాశుడు - ఆయన లోకము కూడా స్వయం గా ఉంది ... ఒక ఉదాహరణ సూర్యుడు. సూర్యుడు స్వయం -ప్రకాశవంతమైన లోకము. భౌతిక ప్రపంచంలో ఈ ప్రకాశవంతమైన లోకము యొక్క అవకాశం ఉంటే, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గురించి ఏమి మాట్లాడాలి? అక్కడ ఉన్న అన్ని లోకములు , అవి ప్రకాశవంతమైనవి. స్వయం ప్రకాశం కలవి. నగల వలె. నగ, ఒక వజ్రం, వజ్రం ముక్క, మీరు చీకటిలో ఉంచితే, ఇది స్వయం -ప్రకాశవంతమైనది. వజ్రం ఇక్కడ ఉంది' అని చూపించడానికి వెలుగు యొక్క అవసరము లేదు. ఇది స్వయం -ప్రకాశవంతమైనది. ఈ భౌతిక ప్రపంచంలో కూడా మీరు కనుగొంటారు. అందువల్ల ఆ లోకము, కృష్ణుని లోకము, గోలోక వృందావనం, ఇది స్వయం - ప్రకాశవంతమైనది. మేము శ్రీమద్-భాగవతం లో స్వయం ప్రకాశవంతమైన ఆ చిత్రమును ఇచ్చాము. ఆ ఆధ్యాత్మిక ఆకాశంలో అనేక లక్షల లోకములు ఉన్నాయి. కొనసాగించు