TE/Prabhupada 0666 - సూర్యుడు మీ గదిలో ప్రవేశించ గలిగితే, కృష్ణుడు మీ హృదయంలోకి ప్రవేశించలేడా?



Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969


తమాల కృష్ణ: "భగవంతుని రాజ్యం అన్నిచోట్లా వుంటుంది, కానీ ఆధ్యాత్మిక ఆకాశం మరియు అక్కడ ఉన్న లోకములను పరంధామంగా లేదా ఉన్నత ధామంగా పిలుస్తారు....."

ప్రభుపాద: అవును. ఈ భౌతిక ప్రపంచం కూడా భగవంతుని సృష్టి. ఇది కూడా భగవంతుని రాజ్యం, కానీ మనము భగవంతుణ్ణి మరచిపోయాము కనుక, మనము "దేవుడు చనిపోయెను", అని చేసాము కాబట్టి అది నరకం అయ్యింది. కానీ మనము భగవంతుణ్ణి అంగీకరించినట్లయితే, ఇది ఆధ్యాత్మిక ప్రపంచం అవుతుంది. సహజముగా. అందువలన ఈ ఆలయం ఆధ్యాత్మిక ప్రపంచం, అది భౌతిక ప్రపంచం కాదు. ఇది భౌతిక ప్రపంచం పైన ఉంది. కొనసాగించు.

తమాల కృష్ణ: "కృష్ణుడిని సంపూర్ణముగా అర్థం చేసుకునే పరమయోగి భగవంతునిచే స్వయంగా స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది, నిజమైన శాంతిని పొందవచ్చు అంతిమంగా మహోన్నతమైన నివాసం, గోలోక వృందావనం అను కృష్ణ లోకానికి చేరుకోవచ్చు. బ్రహ్మ సంహిత లో స్పష్టంగా చెప్పబడింది, భగవంతుడు ఆయన గోలోక అను నివాసంలో ఎల్లప్పటికీ నివసించినప్పటికీ, అంతటా వ్యాపించే బ్రహ్మము మరియు స్థానిక పరమాత్మ కూడా."

ప్రభుపాద: అవును. మీరు కృష్ణుడు తన నివాసమైన గోలోక వృందావనంలో ఉన్నాడు అనుకున్నట్లయితే, మీ గుడిలో కృష్ణుడు ఉన్నాడు అని మీరు ఎలా అనుకుంటున్నారు? లేదు. బ్రహ్మ సంహిత చెప్తుంది..... అందువల్ల మనము ప్రామాణిక తల్లి ద్వారా వినవలసి ఉంటుంది. బ్రహ్మ సంహిత చెప్తుంది: goloka eva nivasaty akhilatma - bhutah (BS 5.37) ఆయన తన నివాసంలో ఉన్నప్పటికీ, గోలోక వృందావనము, ఆయన ప్రతి చోటా వున్నాడు. ఆయన ప్రతి చోటా వున్నాడు. కేవలము, అదే ఉదాహరణ ఉపయోగించుకోవచ్చు. ఆ సూర్యుడు 90 మిలియన్ల మైళ్ళు లేదా అలాంటిదే, మన నుండి దూరంగా. కానీ మీ గదిలో ఉన్నాడు. లేకపోతే మీరు ఎలా చెప్తారు, “ ఓ సూర్యకాంతి ఇక్కడ ఉంది".? కాబట్టి సూర్యుడు మీ గదిలో ప్రవేశించ గలిగినప్పుడు, కృష్ణుడు మీ హృదయంలోకి మరియు గదిలో ప్రతి మూలలో చొచ్చుకు పోలేడా? ఆయన చాలా పనికిరానివాడా? ఆయన ప్రతి చోటా ఉన్నాడు, కానీ మీరు అర్థం చేసుకోవాలి, ఆయన ప్రతి చోటా ఎలా వున్నాడు. కొనసాగించు.

తమాల కృష్ణ : "ఎవరూ ఆధ్యాత్మిక ఆకాశం చేరుకోలేరు, లేదా భగవంతుని శాశ్వత నివాసంలోకి వెళ్ళలేరు, కృష్ణుని మరియు ఆయన పూర్తి స్థాయి విస్తరణ, విష్ణువు యందు సరైన అవగాహన లేకుండా. అందువల్ల కృష్ణ చైతన్యములో పని చేసే వ్యక్తి పరిపూర్ణ యోగి. ఎందుకంటే తన మనస్సు కృష్ణుడి కార్యక్రమాలలో ఎల్లప్పుడు నిమగ్నమై ఉంటుంది. వేదాలలో కూడా మనము నేర్చుకుంటాము, జనన మరణ మార్గము అధిగమించాలంటే కేవలము భగవంతుని మహోన్నతమైన వ్యక్తిత్వం అర్థం చేసుకోవడం ద్వారానే. మరో మాటలో చెప్పాలంటే, యోగ పద్ధతి యొక్క పరిపూర్ణత అంటే భౌతిక జీవితం నుండి స్వేచ్ఛను సాధించడం అమాయక ప్రజలను మోసగించుట కొంత మాయాజాలం గారడీ లేదా సాము కాదు.

ప్రభుపాద: ధన్యవాదములు, అంతే. (ముగింపు)