TE/Prabhupada 0706 - వాస్తవమైన శరీరం లోపల ఉంది
Lecture on SB 3.26.29 -- Bombay, January 6, 1975
కాబట్టి ప్రయత్నము అంతా ఎలా స్వేచ్ఛను పొందాలి అనే దానిపై ఉండాలి ఈ భౌతిక జీవితము నుండి, మన ఆధ్యాత్మిక స్థితికి రావటానికి. అది మానవ జీవితం యొక్క ప్రయత్నము అవ్వాలి. పిల్లులు కుక్కలు, వాటికి అటువంటి ఉన్నత చైతన్యము లేదు. అవి దాని కోసం ప్రయత్నించలేవు. అవి ఈ భౌతిక శరీరంతో భౌతిక ఇంద్రియాలతో సంతృప్తి చెందాయి. కానీ మానవ రూప శరీరంలో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ ఇంద్రియాలను, శరీరం యొక్క ఈ భౌతిక నిర్మాణం, మిథ్య అని, లేదా తాత్కాలికమైనది, లేదా మిథ్య అని ఈ భావములో- ఇది నా వాస్తవ శరీరం కాదు. వాస్తవ శరీరం ఈ భౌతిక శరీరం లోపల ఉంది. అది ఆధ్యాత్మిక శరీరం. Asmin dehe dehinaḥ. Dehino 'smin, tathā dehāntara-prāptiḥ ( BG 2.13) అస్మిన్ దేహినః. కాబట్టి ఆధ్యాత్మిక శరీరం నిజానికి వాస్తవ శరీరం, ఈ భౌతికము శరీరం కప్పి ఉంచింది. ఇది భగవద్గీతలో వేరొక విధముగా వివరించబడింది. Vāsāṁsi jīrṇāni yathā vihāya ( BG 2.22) ఈ భౌతిక శరీరం కేవలం దుస్తుల వలె ఉన్నది. దుస్తులు... నేను చొక్కా వేసుకుంటున్నాను, మీరు చొక్కా మరియు కోట్ మీద వేసుకుంటున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం కాదు. ముఖ్యమైన విషయం చొక్కా లోపల ఉన్న శరీరము. అదేవిధముగా, ఈ భౌతిక శరీరము కేవలం ఆధ్యాత్మిక శరీరమును కప్పి ఉంచింది భౌతిక వాతావరణం ద్వారా, కాని వాస్తవమైన శరీరం లోపల ఉంది. Dehino 'smin yathā dehe ( BG 2.13) ఈ బాహ్య, భౌతిక శరీరం దేహ అని పిలువబడుతుంది, ఈ దేహ యొక్క యజమానిని దేహి అని పిలుస్తారు, ఈ దేహను కలిగి ఉన్నవాడు. మనము అర్థము చేసుకోవాలి ... ఇది భగవద్గీతలో మొదటి ఆదేశం.
కాబట్టి ఒకరు తెలుసుకోవటానికి ఉత్సాహము కలిగి ఉండాలి, "ఈ భౌతిక శరీరము ఎలా ఉనికిలోకి వచ్చింది, నన్ను కప్పి ఉంచింది. ఆధ్యాత్మిక శరీరం, అహం బ్రహ్మాస్మి? " కాబట్టి ఈ విజ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు కపిలదేవుడు భౌతిక సాంఖ్య తత్వాన్ని వివరిస్తున్నాడు, ఎలా విషయాలు అభివృద్ధి చెందుతున్నాయి.వాటిని అర్థం చేసుకోవడానికి... అదే విషయం : సాధారణ విషయం అర్థం చేసుకునేందుకు, "నేను ఈ శరీరం కాదు. శరీరం ఆత్మ నుండి అభివృద్ధి చెందింది. " అందువలన మనము భౌతిక శాస్త్రవేత్తలను సవాలు చేస్తున్నాము. వారు ఆత్మ శరీరం నుండి అభివృద్ధి చెందుతుంది అని చెప్తారు. లేదు ఆత్మ శరీరం నుండి అభివృద్ధి చెందలేదు, కానీ శరీరం ఆత్మ నుండి అభివృద్ధి చెందింది. కేవలం వ్యతిరేకం. భౌతిక మూలకాల యొక్క కలయిక పరిస్థితిని సృష్టిస్తుంది అని భౌతిక శాస్త్రవేత్తలు భావిస్తారు ఎక్కడ, జీవనము ఉన్నప్పుడు, జీవిత లక్షణాలు. లేదు. అది కాదు. వాస్తవం ఏమిటంటే, నిజానికి, అక్కడ ఆత్మ ఉంది. వారు విశ్వమంతా, బ్రహ్మాండ బ్రమణ్. తిరుగుతున్నారు. బ్రహ్మాండ అంటే విశ్వమంతా అని అర్థం. ఆత్మ కొన్నిసార్లు ఒక జాతి జీవితంలో ఉంటుంది; కొన్నిసార్లు ఆయన మరొక జాతి జీవితంలో . కొన్నిసార్లు ఆయన ఈ లోకములో, కొన్నిసార్లు మరొక లోకములో. ఈ విధముగా, తన కర్మ ప్రకారం ఆయన తిరుగుతున్నాడు. అది ఆయన భౌతిక జీవితం. కాబట్టి ei rūpe brahmāṇḍa bhramite ( CC Madhya 19.151) ఆయన ఏ లక్ష్యము లేకుండా తిరుగుతూ ఉంటాడు. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? నేను ఈ స్థితిలో ఎందుకు పెట్టబడ్డాను, ఈ భౌతిక శరీరాన్ని అంగీకరించడం, అన్ని దుఃఖాల యొక్క మూలం? " ఈ ప్రశ్నలను అడగాలి. దీనిని బ్రహ్మ-జిజ్ఞాసా అని పిలుస్తారు. అది సరిగా జవాబు ఇవ్వాలి. అప్పుడు మన జీవితం విజయవంతమవుతుంది. లేకపోతే అది ఒక పిల్లి లేదా ఒక కుక్క శరీరం వలె పనికిరానిది - ఏ అవగాహన లేదు, మూఢా. మూఢా.