TE/Prabhupada 0713 - తీరిక లేకుండా ఉండే మూర్ఖుడు ప్రమాదకరము
Lecture on SB 1.16.23 -- Hawaii, January 19, 1974
అయితే చక్కగా మీరు ఈ అన్ని భౌతిక సౌకర్యాలు, సౌకర్యాలను తయారు చేసినారు మీరు ఇక్కడ ఉండలేరు. నీవల్ల కాదు... మీకు శక్తి కొంత వరకు ఉంది. కాబట్టి ఆ శక్తి కొంత ఇతర ప్రయోజనము కోసం ఉద్దేశించబడింది. కాబట్టి మీ శక్తి జీవితం యొక్క నిజమైన ప్రయోజనము కోసం ఉపయోగించ బడడము లేదు, మీరు భౌతిక ఆనందము అని పిలవబడే దానిని పెంచుకోవటానికి దానిని ఉపయోగించినట్లయితే... వాస్తవానికి, వారు సంతోషంగా మారలేదు. లేకపోతే, ఎందుకు చాలా యువకులు మరియు యువతులు వారు నిరాశ చెందుతున్నారు? ఈ రకమైన పురోగతి మనకు సంతోషాన్ని ఇవ్వదు. అది సత్యము. కావున, మీరు అనవసరపు విషయాల కోసం మీ శక్తిని వృథా చేస్తే, మీరు ఎదగడము లేదు (పవిత్రము అవ్వటము లేదు), మీరు ఓడిపోయారు. అది వారికి తెలియదు.
ఇది శ్రీమద్-భాగవతం లో చెప్పబడింది. Parābhavas tāvad abodha-jāto yāvan na jijñāsata ātma-tattvam. Parābhava(SB 5.5.5). Parābhava అంటే ఓటమి. Tāvat, "చాలా కాలం." భౌతిక వ్యక్తుల యొక్క అన్ని కార్యక్రమాలు కేవలం ఓడిపోవడము. Parābhavas tāvad abodha-jātaḥ. Abodha. Abodha అంటే దుష్టులు, మూర్ఖులు, అమాయకులు, మూర్ఖులుగా దుష్టులుగా జన్మించిన వారు, అమాయకులు అని అర్థం. మనము అందరము మూర్ఖులుగా జన్మించాము. కాని మనము సరిగా విద్యావంతులు కాకపోతే, అప్పుడు మనం మూర్ఖులుగా, మూర్ఖులుగా ఉండిపోతాము, ఇది కేవలం సమయం వృధా చేసుకోవడము ఎందుకంటే... ఏమి అంటారు? తీరిక లేని మూర్ఖులు, తీరిక లేని మూర్ఖులు ఒక మూర్ఖుడు తీరిక లేకుండా ఉంటే, అది ఆయన కేవలము తన శక్తిని పాడు చేసుకుంటున్నాడు. కేవలం కోతి లాగా. కోతి చాలా తీరిక లేకుండా ఉంటుంది. అయితే, Mr. డార్విన్ ప్రకారం, వారు కోతి నుండి వస్తున్నారు. కాబట్టి కోతి పని కేవలము సమయమును వ్యర్థము చేసుకొనుట. ఆయన చాలా తీరిక లేకుండా ఉన్నాడు. మీరు ఎల్లప్పుడూ తీరిక లేకుండా ఉంటారు. కాబట్టి తీరిక లేకుండా ఉండే మూర్ఖుడు ప్రమాదకరం. నాలుగు తరగతుల వ్యక్తులు ఉన్నారు: సోమరితనము ఉన్న తెలివైనవాడు, తీరిక లేని తెలివైనవాడు, సోమరితనము ఉన్న మూర్ఖుడు, మరియు తీరిక లేని మూర్ఖుడు కాబట్టి మొదటి తరగతి వ్యక్తి సోమరితనము ఉన్న తెలివైనవాడు. ఉదాహరణకు మీరు ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులను చూస్తారు. వారు చాలా సోమరితనము కలిగి ఉంటారు (ఏమి పని చేయరు) మరియు చాలా తెలివైన వారు. ఇది మొదటి తరగతి మనిషి. వారు ప్రతిదీ చాల తెలివిగా చేస్తారు. తదుపరి తరగతి: తీరిక లేని తెలివైన వారు. బుద్ధిని చాలా తెలివిగా వాడాలి. మూడవ తరగతి: సోమరితనము ఉన్న మూర్ఖుడు - సోమరితనం, అదే సమయంలో, మూర్ఖుడు. నాల్గవ తరగతి: తీరిక లేని మూర్ఖుడు. తీరిక లేని మూర్ఖుడు చాలా ప్రమాదకరమైవాడు. కాబట్టి ఈ ప్రజలు అందరూ, వారు తీరిక లేకుండా ఉన్నారు. ఈ దేశంలో కూడా, ప్రపంచవ్యాప్తంగా, అన్నిచోట్ల, ఈ దేశములో లేదా ఆ దేశములో . వారు ఈ గుర్రము లేని బండ్లను కనుగొన్నారు, చాలా తీరిక లేకుండా ఉంటున్నారు. "హాన్స్, హాన్స్," (కార్లు 'శబ్దం అనుకరిస్తుంది) ఈ మార్గములో ఈ మార్గములో , ఈ మార్గములో . కానీ నిజానికి, వారు తెలివైనవారు కాదు. తీరిక లేకుండా ఉన్న మూర్ఖులు. అందువల్ల వారు సమస్య తర్వాత సమస్యలను సృష్టిస్తున్నారు. అది సత్యము. వారు చాలా బిజీగా ఉన్నారు, కానీ వారు మూర్ఖులు కనుక, అందువల్ల వారు సమస్యలను సృష్టిస్తున్నారు.