TE/Prabhupada 0714 - లాభము ఏమైనా పట్టించుకోను, నేను కృష్ణుడి కొరకు మాట్లాడతాను



Lecture on SB 1.16.24 -- Hawaii, January 20, 1974


కాలము, కాలము చాలా శక్తివంతమైనది. కాలము... కాలముతో ప్రతిదీ చేయవచ్చు. కాలముతో మీరు చాలా సంతోషంగా ఉంటారు, కాలముతో మీరు చాలా బాధపడవచ్చు, చాలా బాధపడవచ్చు, దుఖముతో. కాలము ఇవ్వగలదు. కాలము కూడా కృష్ణుడు, కాల-రూపేన. ఎప్పుడు... మీరు భగవద్గీతలో, పదకొండవ అధ్యాయంలో చూస్తారు... నేను ఇప్పుడే మరిచిపోయాను... "నీవు ఎవరు?" విరాట్-రూపము, విశ్వ రూపము చూసిన అర్జునుడు, "అయ్యా, నీవు ఎవరు?" అందువల్ల ఆయన చెప్తారు, "ఇప్పుడు నేను కాల-రూపములో ఉన్నాను. నేను మిమ్మల్ని అందరినీ చంపడానికి వచ్చాను. " కాబట్టి మన కర్తవ్యముగా ఉండాలి ఈ జీవితం పూర్తిగా కృష్ణ చైతన్యము కోసం ఉపయోగించాలి. ఇతర కర్తవ్యము కోసము కాదు. ఇది చైతన్య మహా ప్రభు యొక్క ఉద్యమము. అది చాలా కష్టము కాదు. అంత కష్టం కాదు. Kīrtanīyaḥ sadā hariḥ ( CC Adi 17.31) కానీ ఇది కష్టం. హరే కృష్ణ మంత్రం ఇరవై నాలుగు గంటలు కీర్తన చేయడము చాలా కష్టము. అలవాటుపడిన వారు, వారు కేవలం పిచ్చివారు అవుతారు కేవలము కీర్తన చేయడము వలన. ఇది (స్పష్టంగా లేదు). మీరు హరిదాస ఠాకురాని అనుకరించలేరు, ఇప్పుడు నేను ఏకాంత ప్రదేశానికి వెళ్తాను హరే కృష్ణ కీర్తన చేస్తాను. ఇది సాధ్యం కాదు, అయ్యా. ఆధ్యాత్మిక జీవితములో గొప్ప పురోగతి అవసరం హరే కృష్ణ మంత్రాన్ని జపించటంలో శ్రద్ధ చూపేటప్పుడు . ఇది అంత సులభం కాదు.

అందువలన, ప్రారంభ భక్తుల కోసం, మనము చాలా సేవలను కలిగి ఉండాలి. ప్రారంభ దశలో, మీరు ఉన్నత స్థితిని అనుకరించడానికి ప్రయత్నిస్తే, అది కేవలం హాస్యాస్పదంగా ఉంటుంది. ప్రారంభ దశలో మనము ఎల్లప్పుడూ సేవలో నిమగ్నమై ఉండాలి. కృష్ణుడికి సేవలు చేయడానికి వివిధమార్గాలు ఉన్నాయి. మీరు చాలా మార్గాల్లో కృష్ణుడికి సేవ చేయగలరు. Karmaṇā manasā vācā etāvaj janma-sāphalyaṁ dehinām iha dehiṣu. Karmaṇā manasā vācā śreya-ācaraṇaṁ sadā. కర్మణా మనసా, మనకు మూడు మార్గాలు ఉన్నాయి పని ద్వారా, కర్మణా ; ఆలోచన ద్వారా, మనసా; కర్మనా మనసా వాచా, మాట్లాడటం ద్వారా. మనము పనులు చేయవచ్చు. కర్మణా మనసా వాచా. కాబట్టి ఈ త్రిదండ సన్యాస అంటే... నాలుగు దండాలు ఉన్నాయి. ఒక దండం అంటే వ్యక్తి యొక్క చిహ్నంగా పిలవబడుతున్నది . ఇతర మూడు దండాలు, అవి ఆయన శరీరం,మనస్సు, వాక్కు యొక్క గుర్తు. ఈ దండము అంటే అర్థం, బహుశా మీకు తెలుసా, తెలియదు. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి... కాబట్టి కర్మణా, ఈ దండము, అంటే "నేను ఇప్పుడు ప్రమాణాన్ని తీసుకున్నాను, నాకు నేను నిమగ్నము అవ్వటానికి నేను సంపాదించిన ఏ ఆస్తులు అయినా. "నేను నా ఆస్తులను కలిగి వున్నాను. నేను నా శరీరంతో పని చేయవచ్చు, నా మనసుతో పని చేయవచ్చు, మాట్లాడటం ద్వారా నేను పని చేయవచ్చు. కాబట్టి త్రిదండి సన్యాసి అంటే ఎవరైతే తన జీవితం అంకితం చేసారో, అంటే తన కార్యక్రమాలను, తన శరీరమును, తన వాక్కును. అది త్రిదండి సన్యాస ఎవరైతే తన మనసును, తన శరీరమును, తన వాక్కును భగవంతుని యొక్క సేవ కోసం అంకితముచేసారో, ఆయనను సన్యాసి అని అంటారు సన్యాసి అంటే కేవలం దుస్తులు మార్చడం మరియు వేరేది ఆలోచించడం కాదు. కాదు. సన్యాసి, ఎవరైనా, దుస్తులు మార్చబడినవా లేదా అనే విషయము పట్టింపు లేదు, ఒక వ్యక్తి పూర్తిగా తన శరీరం, మనస్సు వాక్కు తో నిమగ్నమై ఉంటే అతడు స సన్యాసి.

Anāśritaḥ karma-phalaṁ kāryaṁ karma karoti yaḥ, sa sannyāsī ( BG 6.1) కృష్ణుడు చెప్పారు. ఎవరు సన్యాసి? Anāśritaḥ karma-phalaṁ నేను కృష్ణుడి కొరకు మాట్లాడతాను. అప్పుడు మీరు ఏమి లాభం పొందుతారు? "లాభము ఏమైనా పట్టించుకోను, నేను కృష్ణుడి కొరకు మాట్లాడతాను, అది అంతే." స సన్యాసి, కృష్ణుడు చెప్పారు. ఇది నా కర్తవ్యము. kāryam. కార్యము అంటే కర్తవ్యము. కృష్ణుడి గురించి మాత్రమే మాట్లాడటం నా బాధ్యత. అంతే. నేను దేని గురించి మాట్లాడటం లేదు. ఆయన ఒక సన్యాసి. Anāśritaḥ karma... ఇప్పుడు, మీరు న్యాయస్థానములో మీ కోసం మాట్లాడటానికి ఒక న్యాయవాదిని వినియోగిస్తే, వెంటనే నాకు రెండు వేల డాలర్లను తీసుకురండి. ఆయన వసూలు చేస్తాడు. కానీ ఒక సన్యాసి, ఆయన కృష్ణుడి కోసము ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతాడు, లాభం ఆశించడు. అది సన్యాసి అంటే. కృష్ణుడి యొక్క పని కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేయడం-ఆయన ఒక సన్యాసి. కృష్ణుడికి ఇరవై నాలుగు గంటలు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ- ఆయన ఒక సన్యాసి. ఇది సన్యాసి. వేరే కర్తవ్యము లేదు. Anāśritaḥ karma-phalaṁ kāryaṁ karma... అందరూ తన వ్యక్తిగత ప్రయోజనము కోసం కృషి చేస్తున్నారు, "నేను ఎంత డబ్బు పొందుతాను? ఎంత పేరు ప్రఖ్యాతి మరియు కీర్తి నేను పొందుతాను? " తన వ్యక్తిగత లాభం కోసం. అది భౌతిక విషయము. అది భౌతిక విషయము. మీ వ్యక్తిగత ప్రయోజనము కోసం మీరు పనిచేస్తున్న వెంటనే, అది భౌతిక విషయము. కృష్ణుడి ప్రయోజనము కోసం మీరు పని చేసిన వెంటనే అది ఆధ్యాత్మికము. అంతే. ఇది భౌతికము మరియు ఆధ్యాత్మికము మధ్య ఉన్న వ్యత్యాసం.