TE/Prabhupada 0715 - మీరు భగవంతుని ప్రేమికుడు ఎలా అవుతారు.ఇది మొదటి తరగతి ధర్మము
Lecture on SB 1.16.25 -- Hawaii, January 21, 1974
Bhavān hi veda tat sarvaṁ yan māṁ dharmānupṛcchasi. కాబట్టి, ధర్మరాజ, లేదా యమరాజా, ఆయన పన్నెండుగురు ప్రామాణికులలో ఒకరు సరిగా మానవ నాగరికతను నిర్వహించడానికి. సూత్రము ధర్మము . ధర్మము అంటే మతపరమైన భావం కాదు. ధర్మము అంటే వృత్తిపరమైన కర్తవ్యము. ప్రతి ఒక్కరికీ ఏదైనా ఒక వృత్తిపరమైన బాధ్యత ఉంది. కాబట్టి dharmaṁ tu sākṣād bhagavat-praṇītam ( SB 6.3.19) ఆ వృత్తిపరమైన బాధ్యత, దేవాదిదేవుని ద్వారా కేటాయించబడుతుంది. Tena tyaktena bhuñjīthāḥ ( ISO 1) వాస్తవానికి, ధర్మ సూత్రం, భగవద్గీత నుండి మనము నేర్చుకున్నాము కృష్ణుడు చెప్పారు, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) కల్పితంగా తయారు చేయవద్దు, ధర్మము యొక్క మీ సూత్రమును, సృష్టించవద్దు. అదే కష్టం. Dharmaṁ tu sākṣād bhagavat-praṇītam ( SB 6.3.19) మనము అనేక సార్లు ఇది వివరించాము, అది ధర్మ అంటే అర్థం - ధర్మం, మతం ఇది ఆంగ్లంలో అనువదించబడింది, "ధర్మము" ధర్మము అంటే భగవంతుని చట్టాలకు విధేయత చూపడం. అది ధర్మము. మనం తయారు చేసిన మత పద్ధతి యొక్క మనోభావ పద్ధతి కాదు. ఆ రకమైన ధర్మం మనకు సహాయం చేయదు. అందువలన, శ్రీమద్-భాగవతం లో, ప్రారంభంలో ఇది చెప్పబడింది, dharmaḥ projjhita-kaitavo 'tra: ( SB 1.1.2) మోసపూరితమైన మత పద్ధతి తొలగించబడింది. అది భాగవత-ధర్మము. మోసం లేదు. ధర్మం, మతపరమైన సూత్రం పేరుతో చేసే మోసం, అది మానవ నాగరికతకు సహాయం చేయదు.
వాస్తవమైన ధర్మము.... వాస్తవమైన ధర్మం భగవంతుడు తనకు తానుగా పేర్కొన్నాడు. Dharmaṁ tu sākṣād bhagavat-praṇītam ( SB 6.3.19) మీరు ఎక్కడి నుండైనా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ భగవంతుని నుండి నేర్చుకోవాలి . అందువల్ల భగవద్గీతలో, చాలా చక్కగా వివరించారు. sarva-dharmān parityajya mām... ( BG 18.66) దేవాదిదేవుడికి శరణాగతి పొందాలి, అది ధర్మము. శరణాగతి పొందుటయే కాదు, కానీ ఆయన కోరుకున్నట్లుగా వ్యవహరించాలి లేకుంటే మీరు భగవంతుని ప్రేమికుడు ఎలా అవుతారు. ఇది మొదటి తరగతి ధర్మము. మనము అనేక సార్లు వివరించాము. Sa vai puṁsāṁ paro dharmo yato bhaktir adhokṣaje ( SB 1.2.6) అటువంటి ధర్మము మొదటి తరగతి రకం ఏదైతే నేర్పుతుందో మీరు భగవంతుని ప్రేమికుడు ఎలా కావాలని. మీరు ప్రేమికునిగా మారితే, మీ జీవితం విజయవంతము అవుతుంది. అప్పుడు మీరు భగవంతుని కోసం ప్రతిదాన్నీ చేస్తారు. లేకపోతే కేవలం నీవు ప్రశ్నిస్తావు, "నేను అది ఎందుకు చేయాలి? నేను ఎందుకు చేయాలి అది? ఎందుకు చేయాలి ?" అంటే అక్కడ ప్రేమ లేదు. అది శిక్షణ. ఒక అనుభవం లేని వ్యక్తి శిక్షణ పొందాడు ఆయనకు ప్రేమ లేదు, కావున అతను ప్రశ్నిస్తాడు అది, నేను ఇది ఎందుకు చేయాలి? నేను ఎందుకు ఇది చేయాలి? నేను ఎందుకు చేస్తాను? నేను ఏ ప్రయోజనం పొందుతాను? చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ ప్రేమ ఉన్నప్పుడు, అక్కడ ఏ ప్రశ్న లేదు. కావున భగవద్గీతలో చాలా విషయాలు చెప్పిన తరువాత, యోగ, జ్ఞాన, కర్మ చాలా ఇతర విషయాలు, చివరికి, కృష్ణుడు చెప్తాడు, సర్వ గుహ్యతమమ్: ఇప్పుడు నేను మీకు అత్యంత రహస్య ఉపదేశమును చెపుతున్నాను. అది ఏమిటి? Sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja... ( BG 18.66) ఇది చాలా రహస్యమైనది.