TE/Prabhupada 0723 - రసాయనాలు జీవం నుండి వస్తాయి
Lecture on BG 7.4 -- Bombay, February 19, 1974
ప్రభుపాద: అక్కడ ఆత్మ ఉంది అక్కడ స్థూల భౌతిక శరీరం ఉంది అక్కడ సూక్ష్మ భౌతిక శరీరం ఉంది. ప్రాథమిక సూత్రం ఆత్మ , కానీ నేను ఇప్పటికే వివరించాను, ఒక శరీరం పొందడానికి, తండ్రి తల్లి ద్వారా బయటకు విడుదలయ్యే స్రావం, అవి కలపాలి, అవి చిక్కని ద్రవముగా మారి, ఒక గింజ యొక్క పరిమాణములో శరీరములో రూపమును పొందుతాయి. ఆత్మ తండ్రి యొక్క వీర్యం ద్వారా వస్తుంది మరియు అతను అక్కడ ఉండును. అప్పుడు శరీరం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆత్మ ఉన్నందున, అందువలన భౌతిక పదార్థం అభివృద్ధి చెందుతోంది. ఆత్మ లేనట్లయితే, బిడ్డ చనిపోయినట్లే, ఇంక ఎటువంటి అభివృద్ధి ఉండదు. ఇంక ఎటువంటి అభివృద్ధి ఉండదు. చనిపోయిన పిల్లవాడు శరీరాన్ని అభివృద్ధి పరచలేడు. అందరికీ తెలుసు. అందుచే ఈ భౌతిక అంశాలు ఆత్మ నుండి వస్తాయి, అంతే కాని ఆత్మ భౌతిక అంశాల నుండి వచ్చేది కాదు. ఇది కాదు. ఇది తప్పు సిద్ధాంతం. ఇది భౌతిక పదార్థాల కలయిక నుండి వచ్చినట్లయితే, అప్పుడు మీరు ఎందుకు చెయ్యలేరు ... ప్రయోగశాలలో ఒక జీవిని ఉత్పత్తి చేయండి. ప్రయోగశాలలో, లేదు, అది కాదు... ఒక పదార్థము... ఎందుకంటే... భౌతిక సృష్టి ఉంది ఎందుకంటే నేను కోరుకున్నాను, అటువంటి పరిస్థితులను, వాతావరణమును, అనుమంత, దేవాదిదేవుడు, ఆయన మహోన్నతమైన మంజూరు చేసేవాడు- ఆయన నాకు ఒక నిర్దిష్ట రకమైన తల్లి శరీరంలో ప్రవేశించడానికి అవకాశం ఇస్తాడు, మరియు పదార్థము పెరుగుతుంది.
కాబట్టి వాస్తవము ఏమిటంటే ఆత్మ నుండి, శక్తి, పదార్థ శక్తి బయటకు వస్తుంది. ఉదాహరణకి తీసుకోండి ...నేను ఇస్తున్నాను. ఆ రసాయనాలు. ఇప్పుడు, ఒక నిమ్మకాయ చెట్టు తీసుకోండి. ఇది ఒక జీవి ఇది కనీసం వందల పౌండ్ల సిట్రిక్ అమ్లమును ఉత్పత్తి చేస్తుంది. నిమ్మకాయలు, ప్రతి ఒక్కరికీ తెలుసు. మీరు నేడు యాభై నిమ్మకాయలు తీసి, మళ్లీ యాభై నిమ్మకాయలు తీసికొని, మీరు నిమ్మకాయలను సేకరించినట్లయితే, మీరు సిట్రిక్ యాసిడ్ ను విస్తృత పరిమాణాన్ని చూస్తారు. కాబట్టి సిట్రిక్ ఆమ్లం రసాయనం ఎక్కడ నుండి వస్తుంది? ఎందుకంటే జీవి అక్కడ చెట్టులో ఉంది. అందువలన సారంశము రసాయనాలు జీవము నుండి వస్తాయి; జీవము రసాయనం నుండి రాదు. జీవము రసాయనం నుండి వచ్చినట్లైతే, అప్పుడు మీరు ఉత్పత్తి చేయండి. నేను మీకు కావలసిన రసాయనాలను ఇస్తాను, మీకు ఎటువంటి రసాయనాలు కావాలో. కాబట్టి రసాయనము ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు చెమట ఉన్నప్పుడు మీకు అనుభవం ఉంది. మీరు చెమటను రుచి చూడండి. అందులో ఉప్పు ఉంది. ఉప్పు ఎక్కడ నుండి వస్తుంది? ఉప్పు... రసాయన నామము ఏమిటి? సోడియం కార్బోనేట్, కాదు?
భక్తుడు: క్లోరైడ్.
ప్రభుపాద: సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్. కాబట్టి సోడియం క్లోరైడ్, అది ఎక్కడ నుండి వస్తుంది? అది మీ శరీరం నుండి వస్తుంది, శరీరం ఆత్మ నుండి వస్తుంది. అందువలన సోడియం క్లోరైడ్ యొక్క వాస్తవ కారణం ఆత్మ. కాబట్టి మీ శరీరంలోని, చెట్టు శరీరం నుండి , ఏదైనా శరీరానికి చెందిన రసాయనాలను కొంచెం పరిమాణములో మీరు విశ్లేషించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ఊహించుకోండి అపరిమితమైన శరీరం, కృష్ణుడి యొక్క అతి పెద్ద శరీరమును, విరాట్ పురుషను, ఎంత రసాయనమును అది ఉత్పత్తి చేస్తుంది. అందువలన, ఇది అంతా ఊహ అని తీసుకోకండి. కృష్ణుడు చెప్పెను,
- bhūmir āpo 'nalo vāyuḥ
- khaṁ mano buddhir eva ca
- ahaṅkāra itīyaṁ me
- bhinnā prakṛtir aṣṭadhā
- (BG 7.4)
కృష్ణుడు చెప్పినది, ఈ ఎనిమిది రకాల పదార్థాలు, స్థూల మరియు సూక్ష్మమైనవి, అవి నా శక్తి. ఇది కృష్ణుడి నుండి వస్తుంది. ఒకవేళ నువ్వు... కృష్ణుడు ఎటువంటి అర్థం లేనివి మాట్లాడడములేదు. ఆయన మిమ్మల్ని మోసము చేయడము లేదు. కనీసం ఉన్నత స్థానములో ఉన్న వారు, మీరు ఎందుకు భగవద్గీత చదువుతున్నారు? ఎందుకంటే ఇది ప్రామాణికమైనది ; కృష్ణుడు మాట్లాడుతున్నాడు. అది సత్యము. అత్యంత ఉన్నతమైన ప్రామాణికం. మనము ప్రామాణికం నుండి జ్ఞానం తీసుకోవాలి; మనము జ్ఞానాన్ని తయారు చేయలేము. అది కాదు ... అది అసంపూర్ణమైన పరిజ్ఞానం, మన ఇంద్రియాలన్నీ అసంపూర్ణమైనందున