TE/Prabhupada 0724 - ఇది భక్తి యొక్క పరీక్ష



Lecture on SB 7.9.15 -- Mayapur, February 22, 1976


ఈ భౌతిక ప్రపంచం భక్తులకు చాలా,చాలా క్రూరమైనది.  వారు చాలా చాలా భయపడ్డతారు. ఇది వ్యత్యాసం. భౌతిక వ్యక్తులు, వారు ఆలోచిస్తున్నారు, “ఈ ప్రపంచం చాలా అందంగా ఉంది మనం ఆనందిస్తున్నాము. తినండి, తాగండి, ఉల్లాసంగా ఉండండి మరియు ఆనందించండి.” కానీ భక్తులు, వారు ఆలోచిస్తున్నారు, “ఇది చాలా, చాలా భయంకరమైనది.      దీనినుండి ఎంత త్వరగా బయటపడదామా?         మా గురు మహారాజు అనేవారు " ఈ భౌతిక ప్రపంచం మర్యాదస్తుడైన మనిషి జీవించవలసినది కాదు." ఆయన చెప్పేవారు. " ఏ మర్యాదస్తుడు ఇక్కడ జీవించలేడు." కాబట్టి ఈ విషయాలు అభక్తులకు అర్థంకావు, ఈ భౌతిక ప్రపంచం ఎంత ఇబ్బంది పెడుతుంది?          దుఃఖాల..... కృష్ణుడు చెప్తాడు ఇది దుఃఖాలయం అశాశ్వతం ( BG 8.15) అది భక్తుడికి మరియు ఆ భక్తుడికి మధ్య వ్యత్యాసం. దుఃఖాలయం, వారు దానిని సుఖాలయంగా సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యం కాదు.

కాబట్టి ఎవరైనా ఈ భౌతిక ప్రపంచాన్ని ద్వేషిస్తే తప్ప, అతడు ఆధ్యాత్మిక అవగాహనలో ఇంకా ప్రవేశించలేదని అర్థం చేసుకోవాలి. భక్తిః పరెశానుభవో విరక్తిర్ అన్యత్ర స్యాత్ ( SB 11.2.42) ఇది భక్తి యొక్క పరీక్ష. ఎవరైనా భక్తియుత సేవ యొక్క రాజ్యములోనికి    ప్రవేశించినట్లయితే, ఈ భౌతిక ప్రపంచం అతడికి పూర్తిగా రుచించదు. విరక్తి లేదు. ఆర నారె బప (?) జగాయ్-మదాయ్, చాలా ఎక్కువ భౌతికవాదులు, స్త్రీ-లోలురు, తాగుబోతు, మాంసం తినేవారు..... కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సాధారణ వ్యవహారాలుగా మారాయి. కానీ భక్తులకు ఇది చాలా, చాలా భయంకరమైనది. అందువల్ల మేము చెపుతాము, " మత్తు పదార్థాలు వద్దు, అక్రమ లైంగికత వద్దు, మాంసం తినకూడదు." ఇది చాలా చాలా భయంకరము. కానీ వారికి తెలియదు. మూఢః నాభి జానాతి. వారికి ఇది తెలియదు. వారు దానిలో నిమగ్నమవుతారు. ప్రపంచం మొత్తం ఈ స్థితిపై జరుగుతుంది. అతడికి తెలియదు చాలా, చాలా భయంకరమైన పరిస్థితిని సృష్టిస్తున్నాడు. ఈ పాపములలో మునిగిపోవడం ద్వారా.

కాబట్టి ఈ అలవాట్ల నుండి బయటపడటానికి, దానికి చాలా తపస్య కావాలి, తపస్య.

తపసా బ్రహ్మచర్యేన
సమేన ధమేన
హం త్యాగెన సౌచ.....
యమేన నియమేన వా
( SB 6.1.13)

ఇది ఆధ్యాత్మిక జీవితం యొక్క అభివృద్ధి అని పిలుస్తారు, తపసా. మొట్టమొదటి విషయము తపస్య, భౌతిక ప్రపంచం యొక్క సౌకర్యవంతమైన పరిస్థితి అని పిలువబడే దానిని స్వచ్ఛందంగా తిరస్కరించడం. అది తపస్సు అని పిలువబడుతుంది. తపసా బ్రహ్మచర్యేన. తపస్యను అమలు చేయడానికి, మొదటి విషయం బ్రహ్మచర్యం. బ్రహ్మచర్య అంటే లైంగిక సంపర్కం నివారించటం అని అర్థం. అది బ్రహ్మచర్య అని పిలుస్తారు.