TE/Prabhupada 0730 - సిద్ధాంత బొలియా చిత్తే... కృష్ణుడిని అర్థం చేసుకోవడంలో సోమరులుగా ఉండవద్దు
Lecture on SB 7.9.32 -- Mayapur, March 10, 1976
ప్రభుపాద: భగవంతుడు ఎల్లప్పుడూ మంచివాడు. కానీ మన గణన, పరిమిత గణనములో, మనము ఆయన ఏమైనా పాపము చేస్తున్నాడేమో అని చూసినా, లేదు అది పాపము కాదు. అది శుద్ధిచేయుట. అదే ఉదాహరణ: tejīyasāṁ na doṣāya ( SB 10.33.29) ఆయన పవిత్ర నామాన్ని కీర్తన చేయడము ద్వారా మనము పాపములేని వారమైతే, భగవంతుడు ఎలా పాపము చేయగలడు? ఇది సాధ్యం కాదు. ఇది సాధారణ జ్ఞానం. హరే కృష్ణ, హరే కృష్ణ ... అని పవిత్ర నామమును కీర్తన చేయటము ద్వారా
భక్తులు: కృష్ణ కృష్ణ , హరే హరే / హరే రామ, హరే రామ, రామ రామ , హరే హరే.
ప్రభుపాద: ఈ విధంగా... మనము పవిత్రులము అవుతాము, కృష్ణుడు ఎలా ఆపవిత్రమైనాడు? ఇది సాధ్యం కాదు. పవిత్రమ్ పరమమ్ భవాన్ ( BG 10.12). కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఇక్కడ వివరణ ఉంది, అది sthito na tu tamo na guṇāṁś ca yuṅkṣe.( SB 7.9.32) ఇది కృష్ణుడు. ఇది విష్ణు, కృష్ణ. ఎప్పుడూ, ఎప్పుడూ ఆలోచించ వద్దు... కొన్ని పక్షములు ఉన్నాయి, అవి చెప్తున్నాయి, "మనము కృష్ణుని, బాల కృష్ణుని, బాల కృష్ణుని పూజిస్తాము." కొన్నిసార్లు వారు కారణం చెప్తారు అది... ఎందుకు కాదు, నేను చెప్పేది ఏమిటంటే, యవ్వనములో కృష్ణను? వారు చెప్తారు " యవ్వనములో కృష్ణుడు రాస-లీలా ద్వారా కలుషితం అయ్యాడు." వారు మూర్ఖులు, అర్థంలేనివి, చూడండి! అది కాదు... కృష్ణుడు ఎప్పుడూ కృష్ణుడే. యవ్వన కృష్ణుడి కన్నా బాల కృష్ణుడు పవిత్రమైనవాడు, ఇటువంటి అభిప్రాయము తప్పు. ఇది తప్పు భావన. కృష్ణుడు... ఉదాహరణకు కృష్ణుడు, ఆయన మూడు నెలల వయస్సులో ఉన్నప్పుడు, ఆయన చంపగలిగాడు ఒక గొప్ప, అతిగొప్ప మంత్రగత్తె, అది పూతన. మూడునెలల వయస్సు ఉన్న బాలుడు అటువంటి గొప్ప... చంపగలడా? లేదు కృష్ణుడు ఎల్లప్పుడూ భగవంతుడే. ఆయన మూడు నెలల లేదా మూడు వందల సంవత్సరాల లేదా మూడు వేల సంవత్సరాలలో కనిపించినా, అతడు ఒకటే. Advaitam acyutam anādim ananta-rūpam adyaṁ purāṇa puruṣaṁ nava-yauvanaṁ ca (Bs. 5.33). ఇది కృష్ణుడు.
కాబట్టి కృష్ణుడిని అధ్యయనం చేయడం ద్వారా, మీరు విముక్తి పొందుతారు. కాబట్టి ఈ శ్లోకాలు చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అప్పుడు మీరు కృష్ణుడిని అర్థం చేసుకుంటారు. కవిరాజ గోస్వామి ఇలా చెప్పాడు, siddhānta boliyā citte nā kara alasa, ihā haite kṛṣṇa lāge sudṛdha mānasa. సిద్ధాంత, కృష్ణుడు అంటే ఏమిటి మీరు శాస్త్రముల నుండి అధ్యయనం చేస్తే, అప్పుడు siddhānta boliyā citte... కృష్ణుడిని అర్థం చేసుకోవడంలో సోమరులుగా ఉండవద్దు ఎందుకంటే మీరు కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే sādhu-śāstra-guru-vākyaṁ cittete kariya aikya, సాధువు- శాస్త్రం గురువు ద్వారా అప్పుడు మీరు కృష్ణుడిని అర్థం చేసుకుంటారు. కృష్ణుడు ఏమిటన్నది అప్పుడు మీరు అతణ్ణి సాధారణ మానవునిగా తీసుకోరు, బుద్ధిహీన వ్యక్తి తీసుకున్నట్లుగా. Avajānanti māṁ mūḍhā mānuṣīṁ tanum āśritaḥ ( BG 9.11) మూర్ఖులు, దుష్టులు, వారు కృష్ణుడిని మనలో ఒకరుగా భావిస్తారు. అప్పుడు నీవు ఒక మూర్ఖుడివి కాదు. మీరు తెలివైనవారు. ప్రభావం ఏమిటి? కృష్ణుడు వ్యక్తిగతంగా చెప్తాడు, janma karma ca divyaṁ me yo jānāti tattvataḥ. మీరు కృష్ణుడిని బాగా అర్థం చేసుకున్నట్లయితే ... వాస్తవానికి, మనము కృష్ణుడిని పరిపూర్ణంగా తెలుసుకోలేము. ఆయన చాలా గొప్పవాడు మనము చాలా చిన్నవారము అందుకే ఇది అసాధ్యం అది సాధ్యం కాదు. కానీ మీరు కృష్ణుడిని అర్థం చేసుకోగలరు, ఆయన భగవద్గీతలో తన గురించి తాను వివరించినంత. అక్కడ ఉన్నది మీకు సహాయం చేస్తుంది. మీరు కృష్ణుడిని అర్థం చేసుకోలేరు. ఇది సాధ్యం కాదు. కృష్ణుడు తనను తాను అర్థం చేసుకోలేడు. అందువల్ల అతడు చైతన్యగా, స్వయంగా అర్థం చేసుకోవడానికి వచ్చాడు.
కాబట్టి కృష్ణుడిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు, కానీ కృష్ణుడు ఇస్తున్నాడు తన గురించి జ్ఞానం, మనము అర్థం చేసుకోవచ్చు చేసుకునేటంత వరకు. ఇది భగవద్గీత. కాబట్టి మీరు కనీసం కృష్ణుడిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి, భగవద్గీత ఉపదేశం ప్రకారం.... చైతన్య మహాప్రభు సిఫార్సు చేశారు, యారే దేఖా తార కహా కృష్ణ- ఉపదేశ ( CC Madhya 7.128) మానవ జీవితం కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ఉద్దేశించబడింది. వేరే పని లేదు. మీరు కేవలం ఈ కర్తవ్యానికి కట్టుబడి ఉంటే, మీ జీవితం విజయవంతమవ్వుతుంది. మన కృష్ణ చైతన్య ఉద్యమం ఆ పనికి ఉద్దేశించబడింది. మనము చాలా కేంద్రాలు తెరిచాము కాబట్టి ప్రపంచంలోని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, కృష్ణుడిని అర్థం చేసుకుని తన జీవితాన్ని విజయవంతం చేసుకొనవచ్చు.
చాలా ధన్యవాదాలు.
భక్తులు: జయ! (ముగింపు)