TE/Prabhupada 0731 - కాబట్టి ఈ భాగవత-ధర్మము అసూయపడే వ్యక్తుల కోసం ఉద్దేశించబడలేదు
Departure Lecture -- London, March 12, 1975
భక్తులకు, ఒక సాహిత్యం, సాహిత్యం అని పిలవబడేది, చాలా చక్కగా రాయబడింది, అలంకరించిన పదాలతో, ఉపమానాలతో ఈ విషయాలు... tad-vāg-visargo ( SB 1.5.11) ..tad vacaś citra-padam (SB 1.5.10), చాలా చక్కగా, వ్యాకరణ పరముగా చాలా చక్కగా అలంకరించబడిన, na tad vacaś citra-padaṁ harer yaśo na pragṛṇīta karhicit, కానీ కృష్ణుడి గురించి ఆయన మహిమ గురించి ప్రస్తావించలేదు... ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో మీకు వార్తాపత్రిక ఉంది, చాలా చాలా పేజీలు కలిగిన వార్తాపత్రికలు, కానీ ఒక్క వాక్యం లేదు, కృష్ణుడికి సంబంధించినది ఉండదు. ఒక్క లైను కూడా. కాబట్టి భక్తులకు ఈ రకమైన సాహిత్యం చెత్తతో పోల్చబడింది. Tad vāyasaṁ tīrtham ( SB 1.5.10) ఉదాహరణకు వాయసం, కాకులు లాగానే. కాకులు ఒక చోట కలుస్తాయి ఎక్కడ కలుస్తాయి? ఎక్కడైతే ప్రతిదీ చెత్తను పడి వేస్తారో, అవి అన్నీ కలుస్తాయి. మీరు కనుగొంటారు. ఇది పక్షి తరగతిలోని స్వభావం. చెత్తను విసిరిన చోట, కాకులు అన్ని కలుస్తాయి. ఇంకొక పక్షి, హంస, అవి అక్కడకు వెళ్ళవు హంస స్పష్టమైన నీటితో ఉన్న ఒక మంచిపని తోట లో చేరుతాయి, కమల పుష్పములతో, పక్షులు మరియు గానం చేస్తుంటాయి. అవి అక్కడ సమావేశమవుతాయి. అవి అక్కడ ఉన్నట్లుగా... ప్రకృతిలో, పక్షులలో కూడా, జంతువులలో, మృగములలో కూడా వివిధ తరగతులు ఉన్నాయి. ఒకే రకపు ఈక కలిగిన పక్షులు కలసి ఎగురుతూ ఉంటాయి. కాబట్టి కాకులు ఎక్కడికైతే వెళ్తాయో, హంసలు వెళ్ళవు. హంస వెళ్ళిన చోటుకు అక్కడకు, కాకులకు వెళ్ళడానికి ఎటు వంటి అవకాశము ఉండదు.
అదేవిధముగా , కృష చైతన్య ఉద్యమం హంసల కొరకు ఉద్దేశించబడింది, కాకుల కొరకు కాదు. హంసల వలె ఉండడానికి ప్రయత్నించండి, రాజ-హంస, లేదా పరమహంస వలె. హంస అంటే హంస మనము ఈ చిన్న స్థలాన్ని పొందినప్పటికీ, కాకుల ప్రదేశమునకు వెళ్లవద్దు, క్లబ్బులు, రెస్టారెంట్, వేశ్యాగృహం, డ్యాన్స్ క్లబ్ అని పిలువ బడేవి... ప్రజలు... ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో, వారు ఈ ప్రదేశాలతో చాలా తీరిక లేకుండా ఉన్నారు. కానీ కాకి వలె ఉండ వద్దు. కేవలం ఈ పద్ధతి ద్వారా హంసలుగా అవ్వండి, కృష్ణుడి గురించి వినండి మరియు కీర్తన చేయండి. ఇది పధ్ధతి, పరమ హంసగా ఉండండి. Dharma-projjhita-kaitava atra nirmatsarāṇām. Dharma-projjhita-kaitava atra paramo nirmatsarāṇām ( SB 1.1.2) ఈ భాగవత-ధర్మము, ఈ కృష్ణ చైతన్యము, పరమో నిర్ మత్సరానామ్ ఉద్దేశించబడింది. మత్సరా, మత్సరత. మత్సర అంటే అసూయ. నేను నీ పట్ల అసూయ కలిగి ఉన్నాను. మీరు నా పట్ల అసూయతో ఉన్నారు. ఇది భౌతిక ప్రపంచం. ఈ ఇంటిలో చాలామంది అసూయపడే వ్యక్తులు ఉన్నారు, మనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తున్నారు. మనకు దీని యందు మంచి అనుభవముంది. కాబట్టి భాగవత-ధర్మము అనేది పరమో నిర్ మత్సరానామ్ కొరకు ఉద్దేశించబడింది. మత్సర అంటే ఇతరుల అభివృద్ధిని సహించలేని వ్యక్తి. దీనిని మత్సరత అని అంటారు. అది అందరి స్వభావం. ప్రతి ఒక్కరూ మరింత ఉన్నత స్థానము వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు. పొరుగు వారు అసూయపడేవాడు: "ఈ మనిషి ఉన్నత స్థానమునకు వెళ్ళుతున్నాడు నేను వెళ్ళలేకుండా ఉన్నాను." ఇది... ఆయన సోదరుడు అయినప్పటికీ, ఆయన కుమారుడు అయినప్పటికీ, ఇది స్వభావం...
కాబట్టి ఈ భాగవత-ధర్మము అసూయపడే వ్యక్తుల కోసం ఉద్దేశించబడలేదు. ఇది అసూయను లేదా అసూయపడే వైఖరిని పూర్తిగా వదిలిపెట్టిన వారికి పరమో నిర్ మత్సరానామ్ ఇది ఉద్దేశించబడింది. కాబట్టి ఎలా సాధ్యమవుతుంది? మీరు కృష్ణుడిని ఎలా ప్రేమించాలి అనే జ్ఞానము ఉన్న వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడు అది సాధ్యము. అప్పుడు మీరు చూస్తారు "ప్రతి ఒక్కరూ కృష్ణునిలో భాగం మరియు అంశ. కాబట్టి అతడు తన కృష్ణ చైతన్యము కోసమే బాధపడుతున్నాడు. కృష్ణుడి గురించి, నన్ను ఆయన గురించి కొంత మాట్లాడనివ్వండి. కృష్ణుడి గురించి నన్ను కొంత సాహిత్యం ఇవ్వనీయండి, ఒక రోజు ఆయన కృష్ణ చైతన్యమునకు వచ్చి సంతోషంగా ఉంటాడు. " ఇది శ్రవణ కీర్తన ( SB 7.5.23) - స్మరణ పద్ధతి. మనము కూడా ప్రామాణికమైన సాహిత్యం, వ్యక్తి నుండి వినాలి, నిరంతరం అదే విషయమును కీర్తన చేస్తుండాలి, మరలా మరలా. అంతే. అప్పుడు ప్రతిదీ సంతోషకరమైన వాతావరణముగా ఉంటుంది. లేకపోతే కాకులు సమూహము చెత్తలో కొనసాగుతుంది, ఎవరూ సంతోషంగా ఉండరు.
చాలా ధన్యవాదాలు.
భక్తులు: కీర్తి అంతా శ్రీల ప్రభు పాదుల వారికి ! (ముగింపు)