TE/Prabhupada 0758 - కృష్ణుడికి తన జీవితాన్ని అంకితం చేసిన ఒక వ్యక్తికి సేవ చేయండి
760516 - Lecture SB 06.01.16 - Honolulu
ఎవరైనా కృష్ణుడికి తన జీవితాన్ని అంకితం చేస్తే, yathā kṛṣṇārpita prāṇas tat-puruṣa-niṣevayā ( SB 6.1.16) మీరు... కృష్ణుడి భక్తుడికి సేవ చేయకపోతే మన జీవితాన్ని కృష్ణుడికి అంకితం చేయడం అసాధ్యం. తత్పురుషానిసేవయా. మీరు నేరుగా కృష్ణని చేరుకోలేరు. అది సాధ్యం కాదు. మీరు ఆయన భక్తుని ద్వారా వెళ్ళాలి. అందువల్ల కృష్ణుడు తన భక్తుడిని పంపుతాడు. "నీవు వెళ్లి వారిని రక్షించుము" అని పంపుతాడు. ధ్రువ మహారాజ లాగానే. అతనికి ఎలా సాధించాలో తెలియదు దేవాదిదేవుని అనుగ్రహము, కానీ ఆయన ఉత్సాహము వలన ... ఆయన భగవంతుణ్ణి చూడాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన క్షత్రియుడు... తన తల్లి చెప్పింది, "నా ప్రియమైన కుమారుడా భగవంతుడు మాత్రమే నీకు సహాయం చేయగలడు. నీవు నీ తండ్రి సింహాసనంపై రాజుగా ఉండాలని కోరుకుంటే, ఉన్నతమైన స్థితి అప్పుడు భగవంతుడు మాత్రమే నీకు సహాయం చేయగలడు. నేను సహాయం చేయలేను. ఇది కాదు..." అందువలన, నేను భగవంతుణ్ణి చూడాలి అని అతను ధృడముగా నిర్ణయించుకున్నాడు. అందుకే ఆయన అడవికి వెళ్లినాడు, భగవంతుణ్ణి ఎలా సమీపించాలో అతనికి తెలియదు. కేవలం ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న బాలుడు, అతనికి దృడమైన సంకల్పము ఉన్నది. కాబట్టి "ఈ బాలుడు ధృడముగా నిర్ణయించుకున్నాడు" అని కృష్ణుడు చూశాడు. అందువల్ల ఆయన తన ప్రతినిధి నారదను పంపాడు: "నీవు వెళ్లి అతనికి శిక్షణనివ్వుము, అతను ఎంతో ఆసక్తిగా ఉన్నాడు."
అందుచేత చైతన్య మహాప్రభు చెప్పారు, guru-kṛṣṇa-kṛpāya pāya bhakti-latā-bīja ( CC Madhya 19.151) ఇద్దరి కరుణ ద్వారా మీరు భక్తియుక్త సేవలోకి ప్రవేశించవచ్చు. ఒక దయ కృష్ణుడు; మరో దయ ఆధ్యాత్మిక గురువు. అందువలన ఇక్కడ చెప్పబడినది, అదే విషయం, kṛṣṇārpita- prāṇaḥ tat-puruṣa niṣevayā. ఒకరు kṛṣṇāppita prāṇaḥ ఉండకూడదు, తన జీవితాన్ని కృష్ణుడికి అంకితం చేయలేడు, ఆయన ఆధ్యాత్మిక గురువు యొక్క దయను పొందితే తప్ప. ఇది మార్గం. మీరు నేరుగా పొందలేరు. అది సాధ్యం కాదు. అందువలన నరోత్తమదాస ఠాకురా అన్నారు, ఆయనవి అనేక పాటలు ఉన్నాయి ... Chāḍiyā vaiṣṇava-sevā, nistāra pāyeche kebā: వైష్ణవునికి సేవ చేయకుండా, ఎవరు విముక్తి పొందారు? ఎవరూ లేరు.
- Tāṅdera caraṇa-sevi bhakta-sane vās
- janame janame mora ei abhilāṣ
నరోత్తమదాస ఠాకురా చెప్తూ "నేను గురువులకు సేవ చేయవలసి ఉంది, సనతన గోస్వామికి, రూప గోస్వామికి, మరియు భక్తుల సాంగత్యములో నివసిసిస్తాను. " Tāṅdera caraṇa-sevi bhakta-sane vās. నరోత్తమదాస ఠాకురా అన్నారు, janame janame mora ei abhilāṣ. మన... మనము... లక్ష్యం కృష్ణుడిని ఎలా సేవించాలనేది గురు శిష్య పరంపర ద్వార, గురు, భక్తుల సాంగత్యములో నివసిస్తారు. ఇది పద్ధతి. కాబట్టి మేము ప్రపంచవ్యాప్తంగా చాలా కేంద్రాలు ప్రారంభిస్తున్నాము. ఇది విధానం, ప్రజలు ఈ అవకాశం తీసుకోవచ్చు భక్తులతో సాంగత్యములో వైష్ణవునికి సేవ చేసే అవకాశం. అప్పుడు అది విజయవంతమవుతుంది.
అందువలన ఇక్కడ చెప్పబడినది భక్తి-యోగ అంటే, కృష్ణుడికి జీవితాన్ని అంకితం చేయడమే కాకుండా, వైష్ణవునికి, తత్-పురుష కు కూడా సేవలను చేయాలి. తత్-పురుష అంటే కృష్ణుడికి తన జీవితాన్ని అంకితం చేసిన ఒక వ్యక్తికి సేవ చేయడము. రెండు విషయాలు: కృష్ణుడి పట్ల అంకితభావం మరియు కృష్ణుడి భక్తుని పట్ల అంకితభావం. కాబట్టి ఈ విధముగా మనము ఉన్నత స్థానమునకు సాగితే, అప్పుడు ఈ భౌతిక కాలుష్యం నుండి విముక్తి పొందటం చాలా సులభం. అది చెప్పబడింది. Na tathā hy aghavān rājan pūyeta tapa-ādibhiḥ ( SB 6.1.16) Tapa-ādibhiḥ, ఇది సరళమైన పద్ధతి, కానీ ఇది చాలా కష్టము, ముఖ్యంగా ఈ యుగంలో. కాబట్టి మనము ఈ శిక్షణ ను తీసుకుంటే, అది కృష్ణుడి పట్ల అంకితభావం కల్పిస్తుంది. వైష్ణవునికి జీవితాన్ని అంకితం చేస్తే, అప్పుడు మన జీవితం విజయవంతమవుతుంది.
చాలా ధన్యవాదాలు.
భక్తులు: జయ శ్రీల ప్రభుపాద