TE/Prabhupada 0759 - ఆవులకు తెలుసు ఈ ప్రజలు నన్ను చంపరు. అవి ఆందోళనలో లేవు



750522 - Lecture SB 06.01.01-2 - Melbourne


పంది రుచి మలము వంటిది తినవలెనని. అంటే అర్థం అది ఏ చెత్త ఆహార పదార్ధమునైన అంగీకరించగలదు, మలము వరకు కూడా . అది పంది జీవితం. మరి మానవ జీవితం? కాదు, కాదు, కాదు. ఎందుకు మీరు అంగీకరించాలి? మీరు మంచి పండ్లు, పువ్వులు, గింజలు కూరగాయలు కలిగి ఉన్నారు మరియు పాల ఉత్పత్తి నుండి తయారు చేసినవి కలిగి ఉన్నారు, అది తినండి. భగవంతుడు మీకు ఇవి ఇచ్చాడు. ఎందుకు మీరు మలం తినాలి? ఇది మానవ చైతన్యం. అందువలన మంచి ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు, నేను ఉత్తమ ఆహారం తీసుకోవాలి, పూర్తి విటమిన్లు, పూర్తి రుచి, పూర్తి శక్తి నేను వేరే దేనినైనా ఎందుకు తీసుకోవాలి? లేదు. అది మానవ మేధస్సు.

అందువల్ల మన కార్యక్రమము మనము కృష్ణుడికి ఉత్తమమైన ఆహారాన్ని అందిస్తాం. కృష్ణుడు ఇలా అన్నాడు, "నాకు ఈ ఆహారాన్ని ఇవ్వండి." అది ఏమిటి? Patraṁ puṣpaṁ phalaṁ toyaṁ yo me bhaktyā prayacchati, tad aham aṣnāmi ( BG 9.26) మీరు అతిథిని పిలిస్తే, మీరు అతన్ని అడగాలి, నా ప్రియ మిత్రుడా, నేను నీకు ఏమి ఇవ్వాలి, నీవు ఏది తినడానికి ఇష్టపడతావు? కావున ఆయన చెప్తే "ఈ పదార్థం నాకు ఇవ్వండి, నేను చాలా సంతోషంగా ఉంటాను" అని ఆయనకి అది ఇవ్వడం మీ బాధ్యత. అదేవిధముగా, ప్రజలు అడిగవచ్చు అది "ఎందుకు నేను కృష్ణునికి మాంసం అర్పించ కూడదు?" లేదు, కృష్ణుడు అది చెప్పలేదు. కృష్ణుడు దానిని కోరుకోడు. కృష్ణుడు భగవద్గీతలో పేర్కొన్నారు "నీవు నాకు ఇవి ఇవ్వండి..." Patraṁ puṣpaṁ phalaṁ toyaṁ yo me bhaktyā prayacchati ( BG 9.26) మీరు నాకు కూరగాయలు ఇవ్వండి, నాకు పండ్లు ఇవ్వండి, నాకు ధాన్యం ఇవ్వండి, నాకు పాలు ఇవ్వండి, మంచి నీరు, మంచి పుష్పం, మంచి తులసి. "తదహం అశ్నామి:" నేను దానిని తింటాను. " కృష్ణుడు, లేదా భగవంతుడు, ఆయన భగవంతుడు ఆయన ఏదైనా తినవచ్చు. ఆయన సర్వశక్తిమంతుడు. కానీ ఆయన భక్తులతో, "ఈ విషయాలు నాకు ఇవ్వండి" అని అడుగుతున్నాడు. కాబట్టి మనము కృష్ణుడికి ఇవన్నీ అందిస్తాము అనేక రకాలు సిద్ధం చేస్తాము. అది మన తెలివితేటలు బుద్ధి. మీరు అనేక రకాలు చేయవచ్చు. ఉదాహరణకు ఒక పాలతోనే. మీరు పాలు నుండి కనీసం యాభై రకములను తయారు చేయవచ్చు. చాలా రకాలు.

న్యూ వృందావనం లో మనము ఆవులను పెంచుతున్నాము. అది ఒక ఉదాహరణ. ఆవులు పాలు ఇస్తున్నాయి, పాలు ఇస్తున్నాయి, ఇతర రైతుల కన్నా రెట్టింపు పాలను. ఎందుకు? ఎందుకంటే ఆవులకు తెలుసు "ఈ ప్రజలు నన్ను చంపరు." అవి ఆందోళనలో లేవు. మీరు ఏదైనా పనిలో వినియోగించబడి ఉన్నారని అనుకుందాం, "ఏడు రోజుల తర్వాత నేను చంపబడతాను" అని మీకు తెలిస్తే మీరు చాలా చక్కగా పని చేస్తారా? లేదు అదేవిధముగా, పాశ్చాత్య దేశాలలో ఆవులకు తెలుసు ఈ ప్రజలు నాకు చాలా మంచి ధాన్యాలు మరియు గడ్డి ఇస్తున్నారు , కానీ తరువాత, వారు నన్ను చంపుతారు. కాబట్టి అవి సంతోషంగా లేవు. కానీ వాటికి అభయము ఇస్తే "మీరు చంపబడరు," అని అవి రెండింతలు పాలు, రెండింతల పాలను ఇస్తాయి. ఇది శాస్త్రంలో చెప్పబడింది. మహారాజ యుధిష్టర కాలంలో, ఆవుల 'పాల సంచి ఎంతగా నిండిపోయింది అంటే, పచ్చిక బయళ్ళలో అవి పాలను వదిలేవి మొత్తం పచ్చిక మైదానం తడిగా, పాలతో బురదగా మారేది. భూమి పాలతో బురదగా ఉండేది, నీటితో కాదు. అది పరిస్థితి. కాబట్టి ఆవు చాలా ముఖ్యమైనది దాని ద్వారా మనం చాలా మంచి ఆహారం, పాలు పొందగలము. పాలు ప్రతి ఉదయం అవసరం. కానీ ఈ న్యాయం ఏమిటి, ఆ జంతువు నుండి పాలు తీసుకున్న తరువాత దానిని చంపడం? అది మంచి న్యాయమా? ఇది చాలా చాలా పాపము, మనము దానికి ఎంతో బాధను అనుభవించాలి. వారు శాస్త్రంలో పేర్కొన్నారు "మీరు ఈ పాపమును చేస్తే, మీరు ఈ రకమైన నరకానికి వెళతారు. " ఇవి ఐదవ స్కందములో వివరించబడినవి