TE/Prabhupada 0771 - ఒక భక్తుడు, భౌతిక ఆనందము మరియు ఆధ్యాత్మిక ఆనందముల మీద సమాన ఆసక్తి కలిగి ఉండడుLecture on SB 1.5.12-13 -- New Vrindaban, June 11, 1969


ఇప్పుడు వ్యాసదేవుడు వివిధ సాహిత్యాలను చర్చిస్తున్నారు. అందువలన ఆయన వివరించారు ఏ సాహిత్యం అయినా- ఏది ఏమయినప్పటికీ, అలంకారముల పరముగా లేదా కవిత్వము పరముగా, ఉపమానములతో, వ్యాకరణ పరముగా చక్కగా రాయబడినప్పటికి - కానీ పరమ సత్యము యొక్క సమాచారం లేనట్లయితే, అటువంటి సాహిత్యం నిష్ఫలమైనది, ఏ సాధువు అలాంటి సాహిత్యములో ఏ మాత్రము ఆసక్తిని తీసుకోడు. వారు దానిని వదిలి వేస్తారు. ఉదాహరణకు హంసలు, అవి కాకులు ఆనందం పొందే ప్రదేశంలో అవి ఆనందము పొందవు. కాకులు హంసల మధ్య వ్యత్యాసం ఉన్నందున, పక్షి రాజ్యములో కూడా, లేదా జంతు సామ్రాజ్యంలో అయినా... మీరు ఎల్లప్పుడూ చూస్తారు. విభిన్న రకాలైన పక్షులు జంతువులు, అవి కలిసి నివసిస్తాయి. అదేవిధముగా, సాధువులు, కృష్ణ చైతన్యమును కలిగిన వారు, ఉదాహరణకు వారి రుచి కాకులు వంటి వ్యక్తులు రుచికి భిన్నంగా ఉంటుంది. కాకులకు ఆసక్తికరమైన విషయాలు... Carvita-carvaṇānām ( SB 7.5.30) ప్రహ్లాద మహారాజు చెప్తాడు, "నమిలినదే నమలడము." ఇప్పటికే అది నమలబడినది, ఎవరైనా దానిని నమలడానికి ప్రయత్నించాలని అనుకుంటే, నన్ను చూడనివ్వండి. అక్కడ రుచి ఏమిటి? అది పనికిరాని శ్రమ మాత్రమే.

కాబట్టి ఈ భౌతిక ప్రపంచము నమిలిన దానిని నమలడం అనే పద్ధతిలో వెళ్ళుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి, ఆయన చాలా మంచి వ్యాపారము చేసాడు, డబ్బు సంపాదించాడు, ఆయన ఇంద్రియ తృప్తి చేసుకున్నాడు. కానీ ఆయన సంతృప్తి చెందలేదు. కానీ ఇప్పటికీ, తన కుమారులను, మనవళ్లను అదే వ్యాపారానికి ప్రేరేపిస్తాడు. ఆయన దానిని అనుభవించాడు "ఈ విధముమైన, జీవితము చాలా అనందముగా లేదు. నేను సంతృప్తి చెందలేదు, కానీ అయినప్పటికీ, నా కుమారులను ఎందుకు నిమగ్నం చేస్తున్నాను మరియు మనవళ్లను అదే వ్యాపారానికి, నమిలినదే నమలడం? " కానీ వారికి మెరుగైన సమాచారం లేకపోవడము వలన... Na te viduḥ svārtha-gatiṁ hi viṣṇuṁ durāśayā ye bahir-artha-māninaḥ ( SB 7.5.31) ప్రహ్లాద మహారాజు ఆయన తండ్రికి, నాస్తిక తండ్రికి సలహా ఇచ్చాడు. ఆయన చెప్పాడు... తన తండ్రి అడిగినప్పుడు, "నా ప్రియమైన పుత్రుడా, ఎక్కడ నుండి నీకు ఈ ఆలోచనలను వస్తున్నాయి?" ఆయన పరిపూర్ణ భక్తుడు, మరియు తండ్రి పరిపూర్ణ నాస్తికుడు. ఆయన ఇలా అన్నాడు, "ఈ స్థాయి, పవిత్రమైన భక్తుడి కృప లేకుండా సాధించలేము."

Naiṣāṁ matis tāvad urukramāṅghrim ( SB 7.5.32) Urukramāṅghrim, aṅghri. అంఘ్రి అంటే కమల పాదములు. భగవంతుని దేవాదిదేవుడి యొక్క కమల పాదాల మీద ఎవరూ ఆసక్తి చూపలేరు... భగవంతుని యొక్క దేవాదిదేవుడి యొక్క కమల పాదాలపై ఆసక్తి చూపడం అంటే ముక్తిని పొందటము Anartha-apagamaḥ yad-arthaḥ ( SB 7.5.32) Anartha. అనర్ధ అనగా అనవసరమైనది. మనము జీవితం యొక్క అనవసరమైన అవసరాలు సృష్టించుకుంటూ అనవసరముగా చిక్కులలో చిక్కుకుంటున్నాము. ఇది భౌతిక జీవితం. కానీ కృష్ణ చైతన్యములో ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే, కృష్ణుడి మీద ఆసక్తి కలిగి ఉంటే, అప్పుడు ఆయన అసహ్యించుకుంటాడు: "ఉపయోగం ఏమిటి?" ఉదాహరణకు మా బ్రహ్మచారులు, మన భక్తులు వారు పడుకోగలరు, నేల మీద పడుకుంటారు. వారికి ఏ చక్కని మంచము లేదా దిండు అవసరం లేదు. ఎందుకంటే వారి జీవితము అలా మలచబడినది కాబట్టి, వారు అనుకుంటున్నారు, సరే, నేను కొంత విశ్రాంతి తీసుకోవాలి. ఈ విధముగా లేదా ఆ విధముగా, నేను ఎందుకు నేను దాని గురించి ఆలోచించాలి? అవును. ఇది కృష్ణ చైతన్యములో పవిత్రము అవుతున్నాము అనే దాని యొక్క చిహ్నం. కృష్ణ చైతన్యము అనగా bhaktiḥ pareśānubhavo viraktir anyatra syāt ( SB 11.2.42) కృష్ణ చైతన్యము మీద రుచి లేనివారు, వారు సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు వారికి ఇతర సమాచారం లేనందున భౌతిక కోరికలను అనవసరముగా పెంచుకుంటున్నారు. కానీ కృష్ణుడి భక్తి యుక్త సేవలో నిమగ్నమైన వెంటనే pareśānubhūti, ఆయన కొంత ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతాడు మరియు దాని ఫలితంగా, ఈ పనికి మాలిన ఆనందం అల్పమైనది అవుతుంది.

అది పరీక్ష. ఒక భక్తుడు, భౌతిక ఆనందము మరియు ఆధ్యాత్మిక ఆనందముల మీద సమాన ఆసక్తి కలిగి ఉండడు. విరక్తి. భగవద్గీత కూడా చెప్పుతుంది. paraṁ dṛṣṭvā nivartate ( BG 2.59) ఉదాహరణకు ఒక ఆసుపత్రిలో వ్యాధితో ఉన్న వ్యక్తి కొన్ని నిర్దిష్ట ఆహార పదార్థములను అంగీకరించకూడదు. ఆయనకు కోరిక ఉంది. అలాంటి ఆహారాన్ని తీసుకోవాలనే కోరిక ఆయనకు ఉంది. ఉదాహరణకు విషజ్వరంతో బాధపడుతున్న ఒక టైఫాయిడ్ రోగి వలె. వైద్యుడు చెప్తారు "మీరు ఏ ఘన ఆహారాన్ని తీసుకోకూడదు. మీరు కొంత ద్రవ ఆహారమును మాత్రమే తీసుకోవాలి " కానీ ఆయనకు ఘన ఆహారం తీసుకోవాలని కోరిక ఉంది. ఓ, అటువంటి ఆహారం తీసుకోవద్దని వైద్యుడు నన్ను కోరాడు. సరే, నేను ఏమి చెయ్యగలను? కానీ ఆయనకు కోరిక ఉన్నది. కానీ ఒక భక్తుడుని, ఆయనను బలవంతం చేయనవసరము లేదు -ఉదాహరణకు వైద్యుడు ఆయనని అడుగుతాడు, "దీన్ని చేయవద్దు." ఆయన సహజముగా చెప్పిన విధముగా చేస్తాడు. ఎందుకు? Paraṁ dṛṣṭvā nivartate: ఆయన చూసాడు లేదా ఆయన మెరుగైన దానిని ఏదో రుచి చూశాడు దాని కోసం ఆయన ఈ అసహ్యకరమైన వాటిని రుచి చూడాలని ఇష్టపడడు. అది bhaktiḥ pareśānu ... అంటే మనము అటువంటి చెత్త విషయములను అసహ్యించుకుంటే, అప్పుడు మనము కృష్ణ చైతన్యములో పవిత్రము అవుతున్నామని తెలుసుకొనవలెను పరీక్ష మీ చేతిలో ఉంది. మీరు ఎవరినీ అడగవలసిన అవసరము లేదు, నేను కృష్ణ చైతన్యములో పవిత్రము అవుతున్నానని మీరు భావిస్తున్నారా, కానీ మీరు అర్థం చేసుకుంటారు. సరిగ్గా ఇదే విధముగా : మీరు ఆకలిగా ఉంటే మీరు తింటూ ఉంటే, మీరు తినడం ద్వారా, మీ ఆకలి ఎంత తీరినది, ఎంత శక్తిని మీరు అనుభవిస్తున్నారు అనేది మీరు తెలుసుకుంటారు, ఎంత ఆనందము మీరు పొందుతున్నారు. మీరు ఎవరిని అడగనవసరము లేదు. అదేవిధముగా, ఎవరైనా తన కృష్ణ చైతన్యమును పెంచుకుంటే, పరీక్ష ఏమిటంటే ఆయన అన్ని భౌతిక ఆనందాల కొరకు ఆసక్తి కలిగి ఉండడు అది పరీక్ష