TE/Prabhupada 0772 - మొత్తం వేదముల నాగరికతఈ భౌతిక బంధనము నుండి జీవులకు విముక్తి కల్పించడము
Lecture on SB 1.5.13 -- New Vrindaban, June 13, 1969
ప్రభుపాద: శ్రీమద్-భాగవతం యొక్క ప్రతి ఒక్క పదం, చాలా సంపుటాల యొక్క పూర్తి వివరణ కలిగి ఉంటుంది, ప్రతి ఒక్క పదం వివరణ. ఇది శ్రీమద్-భాగవతం. విద్యా భాగవతావధి శ్రీమద్-భాగవతమును అర్థం చేసుకోగలిగినప్పుడు ఆయన నేర్చుకున్న దానిని అర్థం చేసుకోవచ్చు. విద్య. విద్య అంటే నేర్చుకోవడము, ఈ విజ్ఞాన శాస్త్రం ఆ విజ్ఞాన శాస్త్రం కాదు. వాస్తవమైన దృక్పథంలో శ్రీమద్-భాగవతమును అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు ఆయనను అర్థం చేసుకోవాలి, ఆయన తన మొత్తం విద్యాభివృద్దిని పూర్తి చేసాడు. అవధి. అవధి అంటే అర్థం "ఇది విద్య యొక్క పరిమితి." విద్యా భాగవతావధి-
కాబట్టి ఇక్కడ నారదుడు అంటున్నారు అఖిల-బంధ- ముక్త్యే: ప్రజల కోసం మీరు సాహిత్యాన్ని అందించాలి దాని వలన వారు జీవితంలో ఈ బద్ధ దశ నుండి విముక్తి పొందుతారు, మీరు ఈ బద్ధ దశ లో మరింత ఎక్కువుగా ఉంచాలని కాదు..." అది వ్యాసదేవునకు నారదుడు ఇచ్చిన ఆదేశాల ప్రధాన విషయం: బద్ధ దశ కొనసాగించడానికి ఎందుకు మీరు చెత్త సాహిత్యాన్ని అందించాలి? మొత్తం వేదముల నాగరికత ఈ భౌతిక బంధనము నుండి జీవులకు విముక్తి కల్పించడానికి ఉద్దేశించబడింది. ప్రజలకు విద్య యొక్క లక్ష్యం ఏమిటో తెలియదు. విద్య యొక్క లక్ష్యం, నాగరికత యొక్క లక్ష్యం, నాగరికత యొక్క పరిపూర్ణము, ఈ బద్ధ జీవితము నుండి ప్రజలు ఎలా విముక్తి పొందాలి. ఇది వేదముల నాగరికత మొత్తం పథకం, ప్రజలకు విముక్తి ఇవ్వడము.
కాబట్టి ఇది చెప్పబడింది: అఖిల-బంధ-ముక్తే ( SB 1.5.13) Samādhinā, akhilasya bandhasya muktaye, akhilasya bandhasya. Samādhinā, మనము బద్ధ దశలో ఉన్నాము, శాశ్వతంగా భౌతిక ప్రకృతి చట్టాలు కట్టివేసినవి. ఇది మన పరిస్థితి. నారద వ్యాసదేవునకు ఉపదేశిస్తున్నారు సాహిత్యం అందించు తద్వారా వారు విముక్తి పొందవచ్చు. ఈ బద్ధ జీవితాన్ని కొనసాగించడానికి వారికి మరింత అవకాశాన్ని ఇవ్వవద్దు." అఖిల-బంధ. అఖిల. అఖిల అంటే పూర్తిగా, ఒక్క సారిగా మొత్తంగా. ఈ సహకారాన్ని ఎవరు ఇవ్వగలరు? అది కూడా చెప్పబడింది, అది atho mahā-bhāga bhavān amogha-dṛk ( SB 1.5.13) ఎవరి దృష్టి స్పష్టంగా ఉందో. ఎవరి దృష్టి స్పష్టంగా ఉందో. (ఒక పిల్ల వాడు గురించి:) ఆయన భంగపరుస్తున్నాడు.
మహిళా భక్తురాలు: ఆయన మిమ్మల్ని కలవరపెడుతున్నాడా?
ప్రభుపాద: అవును.
మహిళా భక్తురాలు: అవును.
ప్రభుపాద: స్పష్టమైన దృష్టి. ఒక స్పష్టమైన దృష్టి ఉంటే తప్ప, ఆయన ఎలా సంక్షేమ కార్యక్రమాలను చేయగలడు? మీకు సంక్షేమం అంటే ఏమిటో తెలియదు. ఆయన దృష్టి మబ్బుగా ఉంది. ఒకవేళ ఒకరి దృష్టి మబ్బుగా ఉంటే... మీ ప్రయాణ గమ్యస్థానమేమిటో మీకు తెలియకపోతే, ఎలా మీరు పురోగతి సాధిస్తారు? అందువలన అర్హతలు... ఎవరైతే మానవ సమాజానికి మంచి చేయాలని సిద్ధమైన వారు, వారు స్పష్టమైన దృష్టిని కలిగి ఉండాలి. ఇప్పుడు స్పష్టమైన దృష్టి ఎక్కడ ఉంది? అందరూ నాయకులుగా ఉండాలనుకుంటారు. ప్రతి ఒక్కరూ ప్రజలను మార్గ నిర్దేశము చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనే అంధత్వం. జీవితం అంతం ఏదో ఆయనకు తెలియదు. Na te viduḥ svārtha-gatiṁ hi viṣṇum ( SB 7.5.31) అందుచేత... వ్యాసదేవుడు దీన్ని చెయ్యవచ్చు ఎందుకంటే తనకు స్పష్టమైన దృక్పథం ఉన్నందున . నారదుడు ధృవీకరించారు. నారదునికి తన శిష్యుడి గురించి తెలుసు, ఆ పరిస్థితి ఏమిటి. ఆధ్యాత్మిక గురువుకు పరిస్థితి ఏమిటో తెలుసు. ఒక వైద్యుడికి తెలుసినట్లుగా. కేవలం నాడి కొట్టుకోవడం చూడడం ద్వారా, ఒక ... ఒక నిపుణుడైన వైద్యుడు తెలుసుకోగలడు ఈ రోగి పరిస్థితి ఏమిటి అన్నది అతడు అతడికి వైద్యం చేస్తాడు. ఆ ప్రకారము అతడికి ఔషధం ఇస్తాడు. అదేవిధముగా, ఒక ఆధ్యాత్మిక గురువు, ఎవరైతే వాస్తవమైన ఆధ్యాత్మిక గురువో? ఆయనకు తెలుసు, ఆయనకు శిష్యుడు యొక్క నాడి కొట్టుకోవడం తెలుసు, అందువల్ల అతడు ప్రత్యేకమైన ఔషధ రకాన్ని ఇస్తాడు, తద్వారా అతడు బాగుపడవచ్చు