TE/Prabhupada 0798 - మీరు నృత్యం చేసే అమ్మాయి.ఇప్పుడు మీరు నృత్యం చేయాలి. మీరు సిగ్గుపడకూడదు



Lecture on BG 2.36-37 -- London, September 4, 1973


కాబట్టి అర్జునుడి పరిస్థితి చాలా ప్రమాదకరమైనది. అక్కడ ఒక బెంగాలీ సామెత ఉంది nachte bose guṇṭhana. ఒక అమ్మాయి, ఆయన, ఆమె చాలా ప్రసిద్ధ నృత్యం చేసే అమ్మాయి. ఇది పద్ధతి, మనము ప్రవేశపెట్టిన విధంగా, అమ్మాయిలు మరియు స్త్రీలు, వారు వారి ముఖాచ్ఛాదనము కలిగి ఉంటారు. గుంథానా, దీనిని భారతీయ భాషలో గుంథాన అని పిలుస్తారు. నృత్యం చేసే అమ్మాయి, ఆయన ఉన్నప్పుడు, ఆమె వేదికపై ఉంది, ఆమె బంధువులు చాలామంది అక్కడ సందర్శకులుగా ఉన్నారని ఆమె చూసింది. కాబట్టి ఆమె ముఖమును కప్పుకోబోయినది కాబట్టి ఇది అవసరం లేదు. మీరు నృత్యం చేసే అమ్మాయి. ఇప్పుడు మీరు నృత్యం చేయాలి. మీరు సిగ్గుపడకూడదు. మీరు స్వేచ్ఛగా నృత్యం చేయాలి. ఇది మీ కర్తవ్యము. కాబట్టి అర్జునుడు... ఎవరో దుష్టుడు ఎవరినో హతమార్చాడు, ఈ కారణం చూపిస్తూ ఆ విధమైన చంపడం పాపం కాదు ఎందుకంటే భగవద్గీతలో అది చెప్పబడింది. అవును. స్పష్టంగా, ఆ మూర్ఖులకి అలా కనిపిస్తుంది, అది కృష్ణుడు అర్జునుడిని పోరాడటానికి ప్రోత్సహిస్తున్నాడని. మరియు పాపం లేదు అని ఆయన చెప్పాడు. కానీ మూర్ఖుడు చూడడు ఏ పరిస్థితిలో ఆయన ఈ సలహా ఇస్తున్నాడో. Sva-dharmam api cāvekṣya. స్వ-ధర్మ, సూత్రం ఏంటంటే... పోరాటంలో పోరాడటం ఒక క్షత్రియుని యొక్క కర్తవ్యము, పోరాటంలో చంపడం. మీరు పోరాటంలో ఉంటే, మీరు సానుభూతి చెందితే, అప్పుడు అదే ఉదాహరణ: నృత్యం చేసే అమ్మాయి, వేదికపై ఉన్నప్పుడు, ఆమె సిగ్గుపడుతూ ఉంటే, అది ఇలా ఉంటుంది. ఎందుకు ఆమె సిగ్గుపడాలి? ఆమె స్వేచ్ఛగా నృత్యం చేయాలి. అది కీర్తి అవుతుంది. కాబట్టి యుద్ధరంగంలో, మీరు కారుణ్యం కలిగి ఉండకూడదు. అది అవసరం లేదు. చాలా విధాలుగా. అహింస ఆర్జవ, ఇవన్నీ మంచి లక్షణాలు. పదమూడవ అధ్యాయంలో, కృష్ణుడు అహింసను గురించి వివరించాడు, అహింస. అహింస సాధారణంగా అంగీకరించబడుతుంది. నిజానికి అర్జునుడు అహింసాపరుడు. ఆయన పిరికివాడు కాదు, ఆయన పిరికివాడు కాబట్టి, ఆయన పోరాడటానికి నిరాకరించాడు అని కాదు. కాదు ఒక వైష్ణవునిగా, సహజంగా ఆయన అహింసాపరుడు. ఆయన ఎవరిని చంపడానికి ఇష్టపడడు, ముఖ్యంగా తన సొంత కుటుంబ సభ్యులను. ఆయన కొద్దిగా కరుణ తీసుకున్నాడు. ఆయన పిరికివాడని కాదు.

కాబట్టి కృష్ణుడు ప్రోత్సాహకరంగా, అర్జునుడిని కర్తవ్యమును ఆచరించడానికి ప్రేరేపిస్తున్నాడు. మీరు కర్తవ్యము నుండి వైదొలగవద్దు. అది విషయం. పోరాటం ఉన్నప్పుడు, మీరు తప్పకుండా తరుచూ పోరాడాలి శత్రువులను చంపాలి. అది మీ కీర్తి. నీవు శత్రువులతో పోరాడుతున్నప్పుడు, నీవు కనికరించినట్లయితే, నీవు ఎలా చంపుతావు? అది పిరికితనం. అందువల్ల ఇక్కడ కృష్ణుడు ముగిస్తున్నాడు: hato vā prāpsyasi svargaṁ jitvā vā bhokṣyase mahīm. రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. యోధుని కొరకు, ఒక క్షత్రియుని కొరకు, యుద్ధంలో పోరాడటము, విజయము సాధించడమా లేదా మరణించడమా ఏదో ఒకటి. మధ్యలో ఏ దారి లేదు. మీరు చేయగలిగితే చివరి వరకు పోరాడండి, అప్పుడు విజయము సాధిస్తారు. లేదా మరణించండి. నిలుపుదల లేదు. ఈ పోరాటాలన్నీ అలాంటివి. వేదముల సంస్కృతి ప్రకారం, క్షత్రియలు... బ్రాహ్మణులు కాదు . పోరాడటానికి లేదా చంపటానికి బ్రాహ్మణులు ప్రోత్సహించబడరు. లేదు. వారు ఎప్పుడూ అహింసాయుతులై ఉండాలి. హింస అవసరం అయినప్పటికీ, ఒక బ్రాహ్మణుడు వ్యక్తిగతంగా చంపడు. ఆయన ఈ విషయాన్ని క్షత్రీయుని, చక్రవర్తి దగ్గరకు తీసుకువస్తాడు