TE/Prabhupada 0806 - కేవలము కృష్ణుడిని ఆయన ప్రతినిధులను అనుసరించండి, అప్పుడు మీరు మహాజనులు అవుతారు
Lecture on SB 1.7.23 -- Vrndavana, September 20, 1976
మీరు ఎలా కృష్ణుడి ప్రతినిధిగా మారవచ్చు? అది చైతన్య మహాప్రభువుచే వివరించబడింది:
- yāre dekha, tāre kaha 'kṛṣṇa'-upadeśa
- āmāra ājñāya guru hañā tāra' ei deśa
- (CC Madhya 7.128)
మీరు కేవలం కృష్ణుడు చెప్పినదే చెప్తూ ఉంటే, అప్పుడు మీరు ఆయన ప్రతినిధి అవుతారు. తయారు చేయవద్దు. అతి తెలివి కలిగి ఉండవద్దు, తయారీ చేయవద్దు. కేవలము కృష్ణుడిని ఆయన ప్రతినిధులను అనుసరించండి, అప్పుడు మీరు మహాజనులు అవుతారు. లేకపోతే మీరు ఒక అర్థంలేని చెత్త. మూఢ. Na māṁ duṣkṛtino mūḍhāḥ prapadyante narādhamāḥ ( BG 7.15) అది పరీక్ష. చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాన్ని అనుసరించడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను నేరుగా కృష్ణుడి యొక్క సేవకుడిని అని చైతన్య మహాప్రభు ఎప్పుడూ చెప్పలేదు. లేదు Gopī-bhartuḥ pada-kamalayor dāsa-dāsa-dāsa-dasānudāsaḥ: "సేవకుని సేవకుని సేవకుడను..." నీవు ఎంతగా సేవకుని సేవకునిగా ఉంటావో, నీవు అంత పరిపూర్ణుడవు ( (CC Madhya 13.80) నీవు స్వతంత్రతను ప్రకటించిన వెంటనే, నీవు మూర్ఖుడవు. ఇది పద్ధతి. మనము ఎల్లప్పుడూ ఉండాలి. నా యజమాని యొక్క అత్యంత విధేయత కలిగిన సేవకునిగా
- yasya deve parā bhaktir
- yathā deve tathā gurau
- tasyaite kathitā hy arthāḥ
- prakāśante mahātmanaḥ
- (ŚU 6.23)
అప్పుడు అది వెల్లడి అవుతుంది. మొత్తం విషయము వ్యక్తమవ్వడము. ఇది పాండిత్యము ద్వారా కాదు, అనుభవము ద్వారా కాదు. కాదు: వెల్లడి అవ్వడము వలన Ye yathā māṁ prapadyante. శరణాగతి పొందిన వ్యక్తి శరణాగతి నిష్పత్తిలో, భగవంతుడు వెల్లడి అవ్వుతాడు. Ye yathā māṁ prapadyante tāṁs tathaiva bhajāmy aham ( BG 4.11)
కాబట్టి భగవంతుడు అంటే ఏమిటో అర్థం చేసుకోవడము కష్టమేమి కాదు. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, దేవాదిదేవుడు -నేరుగా. ప్రజలు భగవంతుని ఎందుకు శోధిస్తున్నారో నాకు తెలియదు, భగవంతుడు అంటే ఏమిటో వారికి తెలియదు. చూడండి. అంటే మూఢా. భగవంతుడు ఇక్కడ ఉన్నప్పటికి , అయినప్పటికీ, అతను అంగీకరించడు. అది మూర్ఖుడు అంటే, నరాధమా. ఎందుకు అతను మూర్ఖుడు? ఎందుకంటే నరాధమా. అతను పద్ధతిని తీసుకోరు. అతను ఏదో తయారు చేయాలని కోరుకుంటాడు. అలా చేయవద్దు. ఇక్కడ అర్జునుడు మహాజన, ఆయన కృష్ణుడి స్నేహితుడు, ఆయన ఎప్పుడూ కృష్ణుడితో ఉన్నాడు, కృష్ణుడు ఆయనని గుర్తిస్తాడు. కావున కృష్ణుడితో ఎప్పుడూ ఉండటం వలన, ఆయనకు కృష్ణుడు తెలుసు అని కాదు. అది సాధ్యం కాదు. ఉదాహరణకు, నేను ఈ ఉదాహరణను చాలా సార్లు ఇచ్చాను, నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను ఒక నల్లి కూడా ఇక్కడ కూర్చొని ఉంది. మేము చాల సన్నిహిత సంబంధము కలిగిన వారిమి అని అర్థం కాదు. కాదు నల్లి విభిన్న దృక్కోణము కలిగి ఉంది (పని?), నా కర్తవ్యము భిన్నంగా ఉంటుంది. నల్లి యొక్క పని కొరకడము. ఆ రకమైన సాంగత్యము సహాయం చేయదు. సాంగత్యము అంటే వ్యక్తి పట్ల ప్రేమను పెంపొందించుకోవడం. ఇది సాంగత్యము.
- dadāti pratigṛhṇāti
- guhyam ākhyāti pṛcchati
- bhuṅkte bhojayate caiva
- ṣaḍ-vidhaṁ prīti-lakṣaṇam
- (Upadeśāmṛta 4)