TE/Prabhupada 0809 - డీమన్ క్రేజీ యొక్క షార్ట్ కట్ 'ప్రజాస్వామ్యం'



740928 - Lecture SB 01.08.18 - Mayapur


అందువల్ల కుంతీ అత్త, పిసిమా, కృష్ణుడి అత్త. వసుదేవుని సోదరి, కుంతి. అందువల్ల కృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్ళుతున్నప్పుడు, కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత, సింహాసనంపై మహా రాజ యుధిష్టరను అధిష్టించిన తరువాత... ఆయన లక్ష్యము... తన లక్ష్యము దుర్యోధనుడిని బయట పడేయాలని యుధిష్టరుడు సింహాసనంపై కూర్చుని ఉండాలి. ధర్మ, ధర్మరాజు.

ఇది కృష్ణుని లేదా భగవంతుని యొక్క కోరిక, రాష్ట్ర కార్యనిర్వాహక యజమాని మహా రాజు యుధిష్టురిని వలె పవిత్రముగా ఉండాలి. అది పథకం. దురదృష్టవశాత్తు, ప్రజలు దీనిని కోరుకోరు. వారు ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య వ్యక్తులని కనుగొన్నారు. డెమోక్రసీ - 'డీమన్-క్రేజీ'. డీమన్ క్రేజీ యొక్క షార్ట్ కట్ 'ప్రజాస్వామ్యం'. అందరు రాక్షసులు మరియు పోకిరీలు, వారు కలిసి ఏదో ఒక విధముగా లేదా ఇతరుల ఓట్లు ద్వారా, పదవిని ఆక్రమిస్తారు, మరియు పని - దోపిడీ చేయడము. పని దోపిడీ చేయడము. మనము ఈ విషయము మీద ఎక్కువగా మాట్లాడటము, ఇది చాలా అనుకూలమైనది కాదు, అయితే శాస్త్రం ప్రకారం... మనము, శాస్త్రం ప్రకారం మాట్లాడతాము, ప్రజాస్వామ్యం అంటే దుష్టులు మరియు దోపిడీదారుల అసెంబ్లీ అని. ఇది శ్రీమద్-భాగవతంలో ప్రకటన. Dasyu-dharmabhiḥ. ప్రభుత్వ వ్యక్తులు అందరు దాస్యు. దాస్యు అంటే దోపిడీ దారులు. జేబులు కొట్టే వారు కాదు. జేబులు కొట్టడము, ఎట్లాగైతేనే, మీరు అర్థం చేసుకోలేకపోతే, మీ జేబులో నుండి ఏదైనా తీసుకుంటే, దోపిడీదారుడు, లేదా దాస్యు, అతడు మిమ్మల్ని పట్టుకొని బలవంతముగా, మీరు మీ డబ్బుని ఇవ్వకపోతే, నేను నిన్ను చంపుతాను. దానిని దాస్యు అని పిలుస్తారు.

కావున కలి యుగములో, ప్రభుత్వ వ్యక్తులు దాస్యు గా ఉంటారు. ఇది శ్రీమద్-భాగవతం లో చెప్పబడింది. Dasyu-dharmabhiḥ. మీరు ఆచరణాత్మకంగా చూడవచ్చు. మీరు మీ డబ్బును ఉంచుకోలేరు. మీరు కష్టపడి శ్రమతో సంపాదించుకుంటారు, కానీ మీరు బంగారమును ఉంచుకోలేరు, మీరు నగలను ఉంచుకోలేరు, మీరు డబ్బును ఉంచుకోలేరు. వారు దాన్ని చట్టాల ద్వారా తీసి వేసుకుంటారు. కావున వారు చట్టం తయారు చేస్తారు... యుధిష్టర మహారాజు దీనికి పూర్తిగా వ్యతిరేకము ఆయన ప్రతి పౌరుడు చాలా సంతోషంగా చూడాలని ఆయన కోరుకున్నాడు మితిమీరిన వేడి అధిక చల్లదనము వలన కూడా వారు కలవర పడకూడదు. Ati-vyādhi. వారు ఏ వ్యాధి వలన బాధపడ కూడదు, వారు అధిక వాతావరణ ప్రభావము వలన బాధపడ కూడదు, చాలా చక్కగా తినడం, వ్యక్తి మరియు ఆస్తి భద్రత ఉందని భావించాలి. ఇది యుధిష్టర మహారాజు. యుధిష్టర మహారాజు మాత్రమే కాదు. దాదాపు రాజులు అందరు, వారు ఆ విధముగా ఉన్నారు.

కాబట్టి కృష్ణుడు మొట్టమొదటి రాజు. ఆయన ఇక్కడ పేర్కొనబడినందున, puruṣam ādyam īśvaram. ఈశ్వరమ్ అంటే నియంత్రికుడు. ఆయన వాస్తవ నియంత్రికుడు. ఇది భగవద్గీతలో చెప్పబడింది. Mayādhyakṣeṇa. Mayādhyakṣeṇa prakṛtiḥ sūyate sa-carācaram ( BG 9.10) ఈ భౌతిక ప్రకృతిలో కూడా, అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి. కృష్ణుడిచే నియంత్రించబడుతున్నది దీనిని అర్థం చేసుకోవాలి. అందువల్ల మనము భగవద్గీత చదువుతున్నాము, మరియు శ్రీమద్-భాగవతం ఇతర వేదముల సాహిత్యం. ప్రయోజనము ఏమిటి? ప్రయోజనము vedaiś ca sarvair aham eva vedyam ( BG 15.15) కృష్ణుడిని అర్థం చేసుకోవడం ప్రయోజనము. మీరు కృష్ణుడిని అర్థం చేసుకోకపోతే, అప్పుడు వేదాలు, వేదాంతాలు ఉపనిషత్లు అని పిలవబడే మీ అధ్యయనము, అవి సమయము వృధా చేసేవి. ఇక్కడ కుంతి నేరుగా చెప్తుంది "నా ప్రియమైన కృష్ణా, మీరు ఆద్యం పురుషమ్, మొట్ట మొదటి వ్యక్తి. మరియు ఈశ్వరమ్. మీరు సాధారణ వ్యక్తి కాదు. మీరు మహోన్నతమైన నియంత్రికులు. " అది కృష్ణుడి మీద ఉండవలసిన అవగాహన. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ (BS 5.1). ప్రతి ఒక్కరూ నియంత్రికులు, కానీ మహోన్నతమైన నియంత్రికుడు కృష్ణుడు.