TE/Prabhupada 0810 - ఈ భౌతిక ప్రపంచం యొక్క ప్రమాదకరమైన స్థితి వలన ఆందోళన చెందకండి
741003 - Lecture SB 01.08.23 - Mayapur
ఇక్కడ ఒక విషయము ప్రత్యేకంగా చెప్పబడింది,అది ముహుర్ విపద్ - గణాత్. ముహు అంటే ఇరవై నాలుగు గంటలు, లేదా ఎల్లప్పుడూ, దాదాపు ఇరవై నాలుగు గంటలు. ముహుః . ముహుః అంటే "మళ్లీ మళ్లీ, మళ్ళీ మళ్ళీ." కాబట్టి విపద్. విపత్ అంటే అర్థం "ప్రమాదం." గణా, గణా అర్థం "బహు," కాదు ఒక రకమైన ప్రమాదం కాదు కానీ వివిధ రకాల ప్రమాదములు. కాబట్టి ముహుర్ విపద్ - గణాత్ ? ఎవరు బాధపడుతున్నారు? ఇప్పుడు, కుంతీ. ఇంకా ఎవరు బాధపడుతున్నారు? ఇప్పుడు, దేవకీ. దేవకి కృష్ణుడి తల్లి, కుంతి కృష్ణుడి యొక్క అత్త. ఇద్దరూ, సాధారణ మహిళలు కాదు. కృష్ణుడి తల్లిగా లేదా కృష్ణుడి అత్తగా మారడము, ఇది సాధారణ విషయము కాదు. దానికి చాలా చాలా జన్మల తపస్సు అవసరం. అప్పుడు ఒకరు కృష్ణుడి తల్లి కావచ్చు. కాబట్టి వారు కూడా బాధపడుతున్నారు. ముహుర్ విపద్ - గణాత్, ఎల్లప్పుడూ విపత్. కృష్ణుడు వారికి చాలా చాలా సులభముగా అందుబాటులో ఉండే వ్యక్తి అయినప్పటికీ, తల్లి, కానీ అప్పటికీ... దేవకి కృష్ణుడికి జన్మనిచ్చింది, కానీ ప్రమాదం చాలా భయంకరమైనది, ఆమె తన కుమారుడిని కాపాడుకోలేకపోయింది. ఆయనను వెంటనే బదిలీ చేయవలసి వచ్చినది. ఎంత విపత్, ఉదాహరణకు ఎంత విపత్తో చూడండి, ఎంత విపత్తో చూడండి కృష్ణుడి తల్లి తన కొడుకును తన ఒడిలో ఉంచుకోలేక పోయింది. ప్రతి తల్లి కావాలని కోరుకుంటుంది, కానీ కంస ఖలేనా ఉండటం వలన, ఆమె ఉంచుకోలేకపోయింది. పాండవులకు, కృష్ణుడు నిరంతరం తోడుగా ఉన్నాడు. ఎక్కడైతే పాండవులు ఉన్నారో, కృష్ణుడు అక్కడ ఉన్నాడు. కృష్ణుడు... ద్రౌపది ప్రమాదంలో ఉంది. ఆమె కౌరవులు, దుర్యోధనుడు, దుస్సాశునుడి చేత నగ్నంగా ఉంచబడపోయినది. కృష్ణుడు వస్త్రం సరఫరా చేసాడు. కాబట్టి చాలామంది వ్యక్తుల సభలో, ఒక స్త్రీని నగ్నంగా ఉంచితే, అది అతి గొప్ప ప్రమాదం. ఇది గొప్ప ప్రమాదం, కృష్ణుడు రక్షించాడు. అదేవిధముగా, కుంతి రక్షించ బడినది... ప్రమాదాలు తరువాత శ్లోకాలలో వర్ణించబడతాయి. ఆమె చెప్పింది, vimocitāhaṁ ca sahātmajā vibho: నేను చాలా ప్రమాదకరమైన పరిస్థితుల నుండి విడుదల చేయబడ్డాను, నేనే మాత్రమే కాదు, నా కుమారులతో పాటు. "
కాబట్టి కుంతీ లేదా దేవకీ కూడా కృష్ణుడితో సన్నిహితంగా సంబంధము కలిగి ఉన్నారు, కానీ వారు చాలా ప్రమాదాలు ఎదుర్కోవలసి వచ్చింది, కాబట్టి ఇతరుల గురించి ఏమి మాట్లాడాలి.ఇతరుల గురించి ఏమి మాట్లాడాలి? మన గురించి కాబట్టి మనము ప్రమాదంలో ఉన్నప్పుడు, మనము ప్రమాదంలో ఉన్నాము, మనము నిరుత్సాహపడకూడదు. మనము ధైర్యం తీసుకోవాలి, కుంతీ వసుదేవుడు మరియు దేవకీ కూడా, వారు కూడా ప్రమాదంలో ఉన్నారు, వారు కృష్ణునితో చాలా, చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. కాబట్టి మనము ఈ భౌతిక ప్రపంచం యొక్క ప్రమాదాల వలన కలవరపడకూడదు. మనము వాస్తవానికి కృష్ణ చైతన్యమును కలిగి ఉంటే, మనము ప్రమాదాన్ని ఎదుర్కోవాలి మరియు కృష్ణుడిపై ఆధారపడి ఉండాలి. Avaśya rakhibe kṛṣṇa viśvāsa pālana. దీనిని శరణాగతి అంటారు, "నేను ప్రమాదంలో ఉన్నాను, కానీ కృష్ణుడు... నేను కృష్ణుడికి శరణాగతి పొందాను. ఆయన నన్ను కాపాడుతారు. "ఈ విశ్వాసమును ఉంచుకోండి. మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు కలత చెందవద్దు, ఎందుకంటే ఈ ప్రపంచం అలాంటిది... Padaṁ padaṁ vipadām. ప్రతి అడుగులో ప్రమాదం ఉంది. ఉదాహరణకు మనము వీధిలో నడుస్తున్నట్లుగానే. వెంటనే ఏదో ముల్లు గుచ్చుకుంటుంది, ముల్లు ఉంది. ఆ ముల్లు గుచ్చుకోవడము వలన, ఇది ఒక పుండు ఆవవచ్చు; అది ప్రమాదకరమైనది కావచ్చు. కాబట్టి వీధిలో నడిచినా కూడా, వీధిలో మాట్లాడటం ద్వారా, మన ఆహారం తినడం ద్వారా, అక్కడ... ఇంగ్లీష్ లో చెప్పబడింది, "(పాల) గిన్నె కు పెదవికి మధ్య అనేక ప్రమాదాలు ఉన్నాయి."
కాబట్టి ఈ భౌతిక ప్రపంచం పూర్తిగా ప్రమాదాలతో నిండిపోయింది అని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మీరు "మనము చాలా సురక్షితంగా ఉన్నాము, మనము చాలా నిపుణులము అని ఆలోచిస్తే; మనము ఈ ప్రపంచాన్ని ఎంతో ఆనందంగా చేశాము, "అప్పుడు మీరు నెంబర్ వన్ మూర్ఖులు. Padaṁ padaṁ yad vipadām ( SB 10.14.58) కానీ మీరు కృష్ణుడి ఆశ్రయం తీసుకుంటే, ఈ ప్రమాదాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. అది కుంతీ చెప్తుంది, విమోచిత. విమోచిత. విమోచిత అంటే ప్రమాదం నుండి విడుదల అవ్వటము అని అర్థం. అహం. సహాత్మజా: "నాతో..."
కాబట్టి ఇది కృష్ణుడి అధ్యయనం, మీరు కృష్ణ చైతన్యమును కలిగి ఉంటే, కృష్ణుడి యొక్క నిజాయితీ గల సేవకుడు అయితే, ఈ భౌతిక ప్రపంచం యొక్క ప్రమాదకరమైన స్థితి వలన ఆందోళన చెందకండి. మీరు కేవలం కృష్ణుడిపై ఆధారపడండి, ఆయన మిమ్మల్ని రక్షించగలడు.
చాలా ధన్యవాదాలు.