TE/Prabhupada 0812 - పవిత్ర నామాన్ని కీర్తన చేయడానికి మనము ఇష్టపడడము లేదు



741010 - Lecture SB 01.08.30 - Mayapur


మనము కృష్ణుడి యొక్క స్వరూప స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, అప్పుడు మనము విముక్తి పొందుతాము. మనము అర్థం చేసుకుంటే, కృష్ణుడు సహాయం చేస్తాడు. కృష్ణుడు చెప్తాడు, śṛṇvatāṁ sva-kathāḥ kṛṣṇaḥ puṇya-śravaṇa-kīrtanaḥ ( SB 1.2.17) కృష్ణుడి గురించి మనము ఎంత వింటే, మనము అంత పవిత్రము అవుతాము. మనము కృష్ణుడిని అర్థం చేసుకోలేము ఎందుకంటే మనము పవిత్రము కాలేదు. కానీ, కేవలము మీరు కృష్ణుడి పేరు వింటే- హరే కృష్ణ... హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ, కృష్ణ, హరే హరే- మీరు కీర్తన మరియు శ్రవణము చేస్తూ ఉంటే, మీరు పవిత్రము అవుతారు. కాబట్టి మనం ఎందుకు చేయకూడదు, ఈ సరళమైన పద్ధతిని తీసుకోవాలి అది శాస్త్రములో సిపార్సు చేయబడిన విధముగా, harer nāma harer nāma harer nāmaiva kevalam ( SB 1.2.17) కేవలం హరే కృష్ణ, హరే కృష్ణ కీర్తన చేయండి, ఇరవై నాలుగు గంటలు? Kīrtanīyaḥ sadā hariḥ ( SB 1.2.17) మీరు పరిపూర్ణమవుతారు ఎందుకు మనము ఈ అవకాశాన్ని కోల్పోతున్నాం? అది మన దురదృష్టం. ఇది శ్రీ చైతన్య మహా ప్రభు చేత వివరించబడినది, etādṛśī tava kṛpā bhagavan mamāpi: నా ప్రభు, మీ దయను మీరు ఉదరముగా స్వేచ్ఛగా చూపించారు, ఆ నామమును, మీ నామమును కీర్తన, జపము చేయడము సరిపోతుంది. " Nāmnām akāri bahudhā nija-sarva-śaktiḥ. నామము కీర్తించడము, abhinnatvān nāma-nāminoḥ( SB 1.2.17) ఆయన యొక్క సంపూర్ణ శక్తి దానిలో ఉంది. Nāmnām akāri bahudhā nija-sarva-śaktis tatrārpitā. అన్ని శక్తులు ఉన్నాయి. Nāmnām akāri... అనేక నామములు ఉన్నాయి, కేవలము ఒక నామము మాత్రమే కాదు. మీరు కృష్ణుడి పేరును కీర్తన చేయడానికి ఇష్టపడకపోతే, అప్పుడు ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఏమైనా పేర్లు చెప్పగలరా హరేర్ నామా, నామా, హరి పేరు అయితే తప్పకుండా ఉండాలి, ఇతరుల పేర్లు కాదు, హరేర్ నామా నామము. అప్పుడు మీరు అన్ని శక్తులను పొందుతారు. Nāmnām akāri bahudhā nija-sarva-śaktis tatrārpitā. And niyamitaḥ smaraṇe na kālaḥ. పరిగణనలోకి తీసుకోవడానికి ఏమి లేదు. మీరు ఉదయమా లేదా సాయంత్రము కీర్తన చేసారా లేదా పవిత్రము అయినారా లేదా పవిత్రము కాలేదా అనేది పరిగణలోకి లేదు. ఏ పరిస్థితులలోనైనా, మీరు కీర్తన చేయవచ్చు. Niyamitaḥ smaraṇe na kālaḥ. ఎటువంటి (కాల) పరిశీలన లేదు.

కాబట్టి కృష్ణుడు చాలా సులభముగా లభిస్తున్నాడు. కలౌ, ముఖ్యంగా ఈ కలి యుగంలో ప్రజలకు, అయినప్పటికీ, పవిత్ర నామాన్ని కీర్తన చేయడానికి మనము ఇష్టపడడము లేదు. అందువల్ల చైతన్య మహా ప్రభు బాధ పడుతున్నాడు, etādṛśī tava kṛpā bhagavan mamāpi: మీరు ఈ పతితుడైన వ్యక్తి పై ఉదారంగా మరియు దయతో ఉన్నప్పటికీ, అయినప్పటికీ, నేను దురదృష్టవంతునిగా ఉన్నాను, ఈ పవిత్ర నామాన్ని కీర్తన చేసేందుకు నాకు ఆసక్తి లేదు. " ఇది మన పరిస్థితి, పంతము, కుక్కల వలె పంతము. కానీ మనము చేస్తే, మనము పవిత్రము అవుతాము. Naṣṭa-prāyeṣv abhadreṣu nityaṁ bhāgavata-sevayā ( SB 1.2.18) అందువలన చైతన్య మహా ప్రభు యొక్క సిఫార్సు, శ్రీమద్-భాగవతమును చదవడము, మీరే, పవిత్రము అయినా లేదా పవిత్రము కాకపోయినా, మీరు చదువుకోవచ్చు, కీర్తన చేయ వచ్చు. ఇది మన వైష్ణవ నిబంధన, కర్తవ్యము. సాధ్యమైనంత వరకు, మనము భగవద్గీత మరియు శ్రీమద్-భాగవతములను చదవాలి. అటువంటి సాహిత్యము ఏదైనా- చైతన్య-చరితామృతం, బ్రహ్మ సంహిత వలె. వాటిలో ఏదైనా లేదా వాటిని అన్నింటిని, అది పట్టింపు లేదు. ఇరవై నాలుగు గంటలు హరే కృష్ణను కీర్తన చేయండి. ఇది మన కర్తవ్యము. కాబట్టి మనము ప్రతి ఒక్కరికీ ఈ అవకాశాన్ని ఇస్తున్నాము. మనము ఈ పెద్ద భవనాన్ని నిర్మించాము లేదా ఇంకా ఎన్నో ఎన్నో నిర్మిస్తున్నాము ఎందుకు? అందరికీ ఈ అవకాశాన్ని ఇవ్వడానికి. దయచేసి ఇక్కడికి రండి. కీర్తన చేయండి, హరే కృష్ణ కీర్తన లో చేరండి, ప్రసాదమును తీసుకోండి, మీకు సాధ్యమైనంత వరకు చేయండి, మీ దగ్గర ఉన్న ప్రతిభతో, సులభముగా, చాలా కష్టపడి కాదు. మీకు ఏదైనా చేయడానికి వస్తే, కృష్ణుడి కోసం దాన్ని చేయండి. అందరికి తెలుసు. అందరూ ఏదో ఒక ప్రతిభను కలిగి ఉంటారు. కాబట్టి ఆ ప్రతిభను కృష్ణుని కోసం వాడాలి. మీరు "కాదు, నేను కేవలం కీర్తన చేస్తాను," అని మీరు అంటే, అది సరే, మీరు కీర్తన చేయండి. కానీ జపము చేస్తున్నాము అనే పేరుతో నిద్ర పోవద్దు. అది... మోసము చేయ వద్దు. ఆ విధముగా మోసం చేయడము మంచిది కాదు. మీరు హరిదాస్ ఠాకురా లాగా మీరు జపము చేయగలరు అని అనుకుంటే, అప్పుడు మీరు కేవలం జపము చేయండి. మేము మీకు ఆహారాన్ని ఇస్తాము. ఆందోళన లేదు. కానీ మోసం చేసేందుకు ప్రయత్నించ వద్దు. మీరు నిమగ్నమై ఉండాలి. Yat karoṣi yaj juhoṣi yad aśnāsi, kuruṣva tad mad-arpaṇam ( BG 9.27) అయితే, మనము ఇరవై నాలుగు గంటలు జపము చేస్తే, అది చాలా మంచిది. కానీ అది సాధ్యం కాదు. మనము అంత పవిత్రులము కాదు. కృష్ణుడి కోసం ఏదో ఒకటి చేయాలి.

కావున ఇది... ఈ సంస్థ కృష్ణ చైతన్య ఉద్యమము ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తోంది. మనము ఈ ప్రయోజనము కోసం ప్రపంచవ్యాప్తంగా కేంద్రాలు తెరుస్తున్నాము, మీరు రండి, కీర్తన హరే కృష్ణ మంత్రమును కీర్తన చేయండి, కృష్ణుడు గురించి వినండి, భాగవతము, భగవద్గీత నుండి, మీరు చేయగలిగినదైనా, కృష్ణుడి కోసం దానిని చేయండి. అప్పుడు మీ జీవితం విజయవంతమవ్వుతుంది.

చాలా ధన్యవాదాలు.