TE/Prabhupada 0811 - రూప గోస్వామి యొక్క సూచన. ఏదో ఒక విధముగా, మీరు కృష్ణుడితోఅనుబంధం పొందండి



761008 - Lecture SB 01.07.51-52 - Vrndavana


అందువల్ల కృష్ణుడిని అలా భావించవద్దు, ఎందుకంటే ఆయన వచ్చాడు కనుక, వృందావనములో ఒక గోపబాలుడు లాగా ఆవిర్భవించారు, ఎప్పుడూ ఆలోచించలేదు... వాస్తవానికి, వృందావన-వాసులు, వారు కృష్ణుడు అంటే ఏమిటనేది ఎరుగరు. వారు గ్రామస్థులు. వారికి తెలియదు. కానీ వారు కృష్ణుడి కంటే ఎక్కువగా మరెవరినీ ఇష్టపడరు. అది వారి అర్హత. వారికి విష్ణువు కూడా తెలియదు. గోపీకలు విష్ణు-మూర్తిని చూసినప్పుడు కృష్ణుడు విష్ణు-మూర్తి రూపమును ధరించారు, వారు అటుగా వెళ్ళుతూ - వారు అన్నారు, "ఇక్కడ విష్ణువు ఉన్నారు, సరే నమస్కారము." వారు విష్ణువు మీద కూడా ఆసక్తి కలిగి లేరు. వారు కృష్ణుడి మీదనే ఆసక్తి కలిగి ఉన్నారు, కృష్ణుడు దేవాదిదేవుడు అని వారికి తెలియదు. అయినప్పటికీ అదేవిధముగా, కృష్ణుడు ఏమిటన్నది తెలుసుకోక పోయినా, మీరు కృష్ణుడితో బంధము ఏర్పర్చుకుంటే, అప్పుడు మీ జీవితం విజయవంతమవుతుంది.

కేవలం, ఎట్లాగైతేనే, మీరు కృష్ణుడితో అనుబంధం ఏర్పర్చుకోండి. Mayy āsakta-manāḥ pārtha yogaṁ yuñjan mad... (విరామం) ...jñāsyasi tac chṛṇu ( BG 7.1) కేవలం మీరు ఉండాలి... ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో. ఏదో ఒక విధముగా, మీరు కృష్ణుని కొరకు మీ అనుబంధాన్ని పెంచుకోవాలి. ఏదో ఒక విధముగా. Yena tena prakāreṇa manaḥ kṛṣṇe niveśayet (Bhakti-rasāmṛta-sindhu 1.2.4). ఇది రూప గోస్వామి యొక్క సూచన. ఏదో ఒక విధముగా, మీరు కృష్ణుడితో అనుబంధం పొందండి. అప్పుడు మీ జీవితం విజయవంతమవ్వుతుంది. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ప్రజలను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుంది ఎలా కృష్ణుడితో అనుబంధము కలిగి ఉండాలి. అది భక్తి-యోగ. Yena tena prakāreṇa manaḥ kṛṣṇe niveśayet. అప్పుడు? Vidhi-niṣedhāḥ. భక్తి-యోగాకు చాలా నియమాలు నిబంధనలు ఉన్నాయి. అవును ఉన్నాయి. రూప గోస్వామి చెప్పారు, sarve vidhi-niṣedhāḥ syur etayor eva kiṅkarāḥ (Padma Purāṇa, Bṛhat-sahasra-nāma-stotra). ఎలాగో ఒకలాగా, మీరు కృష్ణుడికి అనుబంధంగా ఉంటే, ఆ తరువాత అన్ని విధులు క్రమబద్ధమైన సూత్రాలు నియమాలు నిబంధనలు, అవి మీ సేవకునిగా పని చేస్తాయి. అవి సహజముగానే చేస్తాయి. (అస్పష్టంగా) ఎందుకనగా మీరు కృష్ణుడితో అనుబంధం కలిగి ఉన్నప్పుడు, కృష్ణుడు చెప్తారు, kṣipraṁ bhavati dharmātmā.

kṣipraṁ bhavati dharmātmā
śaśvac-chāntiṁ nigacchati
kaunteya pratijānīhi
na me bhaktaḥ praṇaśyati
(BG 9.31)

Kṣipram, చాలా త్వరలోనే Api cet su-durācāro bhajate mām ananya-bhāk sādhur eva sa mantavyaḥ ( BG 9.30)

ఈ ఐరోపావాసులు లేదా అమెరికన్లు, వారు మ్లేచ్ఛులు యవనులు అని అనుకోవద్దు. ఇది అపరాధ, అపరాధము. ఎందుకంటే వారు సాధు. వారికి తెలియదు... వారు కృష్ణుడిని అంగీకరించారు ఏ మిశ్రమ అవగాహన లేకుండా , అది "ఇది కూడా బాగుంది, ఇది కూడా మంచిది, ఇది కూడా మంచిది. వారు వారి ఆధ్యాత్మిక గురువు ఉపదేశమును ఖచ్ఛితముగా అనుసరిస్తున్నారు. కృష్ణస్తు భగవాన్ స్వయమ్ ( SB 1.3.28) మన సంఘంలో కూడా ఒక చిన్న బిడ్డ, శ్యామసుందర కూతురు ఆమె ఎవరి దగ్గరికైన వెళ్ళి- ఆమెకు కేవలం ఐదు సంవత్సరాల వయస్సు మాత్రమే - "మీకు కృష్ణుడు తెలుసా?" అని అడుగుతుంది కాబట్టి ఎవరో అన్నారు, "లేదు, నాకు తెలియదు ఓ "దేవాదిదేవుడు" అని ఆమె ఆ విధముగా బోధిస్తుంది. అందువల్ల వారు నమ్మారు కృష్ణస్తు భగవాన్ స్వయమ్,. ఈ నమ్మకం అనేది మొట్టమొదటి లక్షణము. అప్పుడు ఇతర విషయాలు అనుసరించబడతాయి. Sarve vidhi-niṣedhāḥ syur etayor eva kiṅkarāḥ. అందువల్ల ఎవరైనా కేవలం ఈ విషయాన్ని నమ్మితే, అది కృష్ణస్తు భగవాన్ స్వయమ్, ఆయన ఇలా చేస్తాడు, సూత్రాన్ని అనుసరిస్తాడు, కృష్ణైకం - శరణం , (అస్పష్టముగా ఉంది), వర్ణాశ్రమ ధర్మము- ధర్మ . కృష్ణైకం శరణం. అది కావలసినది. మామ్ ఏకం శరణం వ్రజ. అలా చేయండి. ఈ సూత్రానికి కట్టుబడి ఉండండి, అది కృష్ణుడు దేవాదిదేవుడు, కృష్ణుడు పర-తత్వం, పరమ సత్యం, కృష్ణుడు అంతా వ్యాపించి ఉన్నాడు. Mayā tatam idaṁ sarvam ( BG 9.4) కృష్ణుడు అన్నిచోట్లా ఉన్నాడు. జగద్ అవ్యక్త-మూర్తినా. ఈ అవ్యక్త. కృష్ణుడు యొక్క శక్తి ప్రతిచోటా ఉంది