TE/Prabhupada 0823 - ఇది భారతదేశంలో జన్మహక్కు - వారు సహజముగా కృష్ణ చైతన్యులు



Lecture on SB 3.28.20 -- Nairobi, October 30, 1975


హరికేశ : అనువాదము : " భగవంతుని శాశ్వత రూపము తన మనసులో ముద్రించుకొనునప్పుడు యోగి అన్ని అవయవాల మీద దృష్టి సారించకూడదు భగవంతుని యొక్క ఒక్కొక్క అవయవము మీద మనస్సును లగ్నం చేయాలి”.

ప్రభుపాద:

tasmiḻ labdha-padaṁ cittaṁ
sarvāvayava-saṁsthitam
vilakṣyaikatra saṁyujyād
aṇge bhagavato muniḥ
( SB 3.28.20)

కాబట్టి మేము అనేక మార్లు వివరించినాము, ఈ అర్చా- మూర్తి... మూర్ఖపు వ్యక్తులు, వీరు అర్చా మూర్తిని అర్థం చేసుకోలేరు. వారు అనుకుంటారు "వారు విగ్రహాన్ని పూజిస్తున్నారు". హిందువులలో కూడా, వేదాలను అనుసరించేవారు అని పిలువబడే వారు కూడా ఉన్నారు. వారు కూడా అంటారు " గుడిలో విగ్రహాన్ని పూజించవలసిన అవసరం ఏముంది?". ఆలయ ఆరాధనను ఆపటానికి భారతదేశంలో వారు తీవ్ర ప్రచారం చేసారు. కొంతకాలం వరకు కొంత ప్రతిస్పందన వచ్చింది, కానీ ఇప్పుడు అది ముగిసింది. ఆ... ఆలయంలో విగ్రహాన్ని పూజించకూడదు అన్న ఈ దుష్ట ప్రచారం ముగిసింది. ఎవరూ దాన్ని పట్టించుకోరు. ఆలయంలో తప్ప, భగవంతుడు అన్ని చోట్లా ఉన్నాడని వారు అనుకుంటారు.(నవ్వు) అది వారి అభిప్రాయం. భగవంతుడు ప్రతి చోటా ఉన్నాడు; ఆలయంలో ఎందుకు లేడు? కాదు. అది వారి అజ్ఞానము. వారు దానికి సమాధానము చెప్పలేరు. కాదు. భగవంతుడు ప్రతి చోటా ఉన్నాడు, కానీ ఆలయంలో కాదు. ఇది వారి జ్ఞానము, మూర్ఖులు కావున మనము ఆచార్యుని అనుసరించాలి. Acharyavan puruso veda (Chandyoga Upanishad 6.14.2): ఆచార్యుని అంగీకరించినవాడు..... శాస్త్రాన్ని తెలుసుకొని, ఆచరణాత్మకంగా, శాస్త్రం యొక్క నియంత్రణ ప్రకారం ప్రవర్తిస్తున్న వారు, అతను ఆచార్యుడని పిలవబడతాడు.Acinoti sastrarthah.

కాబట్టి ఆచార్యులందరు.... భారతదేశంలో వేలాది వేల ఆలయాలు ఉన్నాయి, చాలా చాలా గొప్ప ఆలయాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. కొన్నిటిని మీరు చూసారు. ప్రతి ఆలయం ఒక గొప్ప కోటలా వుంటుంది. కాబట్టి ఈ దేవాలయాలన్ని ఆచార్యులచే ప్రతిష్టింపబడ్డాయి. ఏదో ప్రజలు వెర్రిగా స్థాపించినవి కాదు. ఇప్పుడు ముఖ్యమైన ఆలయం ఉంది, బాలాజీ ఆలయం, తిరుపతి, తిరుమలై. ప్రజలు వెళ్తున్నారు, రోజు వారీ సేకరణ ఇప్పటికీ ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువ. వారు దేవాలయాలను సందర్శించకూడదని తీవ్రంగా ప్రచారం చేసినప్పటికీ, ప్రజలు.... ఇది భారతదేశంలో జన్మహక్కు - వారు సహజముగా కృష్ణ చైతన్యులు. సహజముగా. అందువల్ల భారతదేశంలో జన్మించాలని దేవతలు కూడా కోరుకుంటారు.సహజముగా.

కాబట్టి ఆలయ ఆరాధన అవసరం. కాబట్టి ఆలయ ఆరాధనకు దేవత ఆరాధనకు వ్యతిరేకంగా ఉన్నవారు, వారు తెలివైన వారు కాదు - మూర్ఖులు, మూఢ. మళ్ళీ, అదే పదం.

Na māṁ duṣkṛtino mūḍhāḥ
prapadyante narādhamāḥ
māyayāpahṛta-jñānā
āsuri bhāvam āśritāḥ
( BG 7.15)

మాయాయాపహృత జ్ఞానాః. వారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, “భగవంతుడు అన్నిచోట్లా ఉంటాడు,” కానీ వారు ఆలయ ఆరాధనను నిషేధిస్తున్నారు. అపహృత జ్ఞానః. జ్ఞానం అపరిపూర్ణము. ఒక సామాన్య మానవుడు చెప్పవచ్చు, "భగవంతుడు అన్ని చోట్ల ఉంటే, ఆలయంలో ఎందుకు ఉండ కూడదు?"