TE/Prabhupada 0826 - మన కృష్ణ చైతన్య ఉద్యమం ఆ కష్టపడి పని చేయడమును కృష్ణుని మీదకు మరల్చటము
The Nectar of Devotion -- Vrndavana, November 4, 1972
శాస్త్రంలో, "సాధారణంగా, ఈ భౌతిక ప్రపంచములో ప్రజలు, వారు రజో-గుణములో ఉన్నారు. " కాబట్టి కష్టపడి పని చేసే కార్యక్రమాలలో, వారు ఆనందం తీసుకుంటారు. ఎవరైనా సన్యాసులు పనిచేయకపోతే... ఆయన భక్తియుక్త సేవ లేదా ధ్యానం లేదా జపము చేస్తూ ఉంటే. కొన్నిసార్లు ఈ ప్రజలు తప్పించుకుంటున్నారు అని తప్పుగా అర్థము చేసుకుంటాము - ఎందుకంటే వారు చాలా కష్టపడి పనిచేయడం చాలా మంచిది అని తీసుకుంటారు మీరు చాలా కష్టముగా పనిచేయకపోతే, అది తప్పించుకు తిరిగే పద్ధతిగా వారు తీసుకుంటారు: వారు, వారు సామాజిక బాధ్యత మరియు ఇతర బాధ్యతలను తప్పించుకుంటున్నారు సన్యాస జీవితాన్ని తీసుకొని ఇతరుల వ్యయంతో జీవిస్తారు. " చాలా విషయాలు. కాబట్టి వారు ఇష్టపడతారు చాలా కష్టపడి పని చేయడమును.
కానీ మన కృష్ణ చైతన్య ఉద్యమం ఆ కష్టపడి పని చేయడమును కృష్ణుని మీదకు మరల్చటము. కష్టపడి పని చేసే ఆ ధోరణిని ఉపయోగించుకోవచ్చు. మాయావాద తత్వవేత్తల వలె, వారు కామం మరియు కోపం గురించి ఆలోచిస్తారు, ఇవి మన శత్రువులు. Kāma-krodha-lobha-moha-mātsarya. కానీ నరోత్తమ దాస ఠాకురా చెప్తారు కృష్ణుని సేవ కోసం కామమును కూడా ఉపయోగించవచ్చని చెప్తాడు. Kāmaṁ kṛṣṇa-karmārpane. కృష్ణుని కోసం పని చేయడానికి ఎవరికైనా చాలా ఆసక్తి కలిగి ఉంటే, కర్మిల యొక్క ఆ కష్టపడి పని చేసే ప్రవృత్తిని, దానిని ఉపయోగించవచ్చు. అది చేయవచ్చు... అదేవిధముగా, 'krodha' bhakta-dveṣi jane. క్రోధ, కోపం, మంచిది కాదు, కానీ కృష్ణుని సేవకు కోపమును కూడా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు హనుమాన్ లాగా రామచంద్రుని కొరకు రావణుడిపై కోపం తెచ్చుకున్నాడు, ఆయన రావణుని బంగారు నగరం అయిన, లంకకు నిప్పంటించారు. ఆ కోపమును రామచంద్రుని యొక్క సేవకు ఉపయోగించారు. తన వ్యక్తిగత ఇంద్రియ తృప్తి కోసం ఆయన తన కోపమును ఉపయోగించలేదు. ఈ విధముగా, ప్రతిదీ భగవంతుని యొక్క సేవ లో నిమగ్నము చేయవచ్చు, నేను వేరే వారికి వివరిస్తునట్లు , ఆరు అంశాలు ఉన్నాయి, భక్తియుక్త సేవ, పవిత్ర భక్తియుక్త సేవ, ఎలా కృష్ణుని మాత్రమే ఆకర్షించడానికి ఉంది. కృష్ణుడి ఆకర్షించడానికి మీరు కర్మిల లేదా జ్ఞానుల లేదా యోగుల స్పూర్తిని ఉపయోగించలేరు. మీరు భక్తియుక్త సేవ ద్వారా కృష్ణుని ఆకర్షించవచ్చు. Bhaktyā mām abhijānāti ( BG 18.55) కేవలం భక్తియుక్త సేవ ద్వారా, నన్ను అర్థం చేసుకోగలరు అని కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. Bhaktyā mām abhijānāti. కాబట్టి కర్మిల కార్యక్రమాలు, కృష్ణుడి సేవలో నిమగ్నము చేసినప్పుడు, చాలా కష్టపడి పనిచేయడం ద్వారా, మన ధోరణి, మనము చెయ్యవచ్చు...
వాస్తవానికి, భక్తి యుక్త సేవ ప్రధానమైన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది, śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ smaraṇaṁ pāda-sevanam, arcanaṁ vandanaṁ dāsyam ( SB 7.5.23) కానీ దాస్యం యొక్క విభాగము లోపల,... ఉదాహరణకు హనుమాన్ వలె , హనుమాన్ జీ లాగా: ఆయన దాస్యం స్థితిపై నిమగ్నమై ఉన్నారు. అర్జునుడు సఖ్యం స్థితిపై నిమగ్నమై ఉన్నారు. కాబట్టి వారు కూడా చాలా కష్టపడుతున్నారు. కురుక్షేత్ర యుద్ధభూమి, ఇది చాలా సులభంగా నిశ్శబ్దంగా కూర్చొని ఉండే ప్రదేశము కాదు. ఆయన పోరాటం చేస్తునప్పుడు, ఆయన ఒక సైనికుని వలె పోరాడుతున్నాడు. ఆయన ఒక సైనికుని యొక్క అన్ని విధులను చేపట్టినాడు. కానీ అది కృష్ణుని కోసము పోరాడడం జరిగింది. ఇది ఆకర్షణ. ఇది పవిత్రమైన భక్తియుక్త సేవ. కృష్ణుడు ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చారు: bhakto 'si priyo 'si ( BG 4.3) నా ప్రియమైన అర్జునా, నీవు నా ప్రియమైన స్నేహితుడవు మరియు భక్తుడవు. ఏ పని చేయడము ద్వారా అయినా, కృష్ణుని సంతృప్తి కోసం అది చేసినట్లయితే, ఇది భక్తియుక్త సేవ, కృష్ణుని ఆకర్షించడము. కృష్ణుని దృష్టిని ఆకర్షించడము కృష్ణుని శ్రద్ధను వ్యక్తిగత ఉద్దేశ్యం లేకుండా, పవిత్రమైన భక్తియుక్త సేవ ద్వారా ఆకర్షించ వచ్చు. అది అయి ఉంటే... ఆ ఉద్దేశం, ఆ ఆజ్ఞ , ఇవ్వబడినది ఆధ్యాత్మిక గురువు ద్వారా, గురు శిష్య పరంపర ద్వారా, కృష్ణుని ఎలా సంతోషపెడతాము