TE/Prabhupada 0827 - ఆచార్యుని యొక్క విధి, శాస్త్ర ఉత్తర్వును సూచించడము
The Nectar of Devotion -- Vrndavana, November 5, 1972
కాబట్టి చైతన్య మహాప్రభు మనకు ఇచ్చారు... ఇది శాస్త్రములో ఉంది. చైతన్య మహాప్రభు చూపించారు... ఆచార్యుని యొక్క కర్తవ్యము ... ప్రతిదీ ఉంది శాస్త్రములో. ఆచార్యుడు ఏమీ కనుగొనలేదు. కనుగొంటే ఆచార్యుడు కాదు. అచార్య కేవలం సూచిస్తారు, "ఇక్కడ విషయం ఉన్నది." రాత్రి చీకటిలో మనం ఖచ్చితంగా ఏమీ చూడలేము లేదా ఏమి కనబడదు, కానీ, సూర్యోదయం అయినప్పుడు, సూర్యోదయం, సూర్యోదయం యొక్క ప్రభావమేమిటంటే, మేము వాటిని యథాతధముగా చూడగలము. విషయాలు తయారు చేయలేదు. ఇప్పటికే ఉన్నవి. విషయాలు అన్నీ ఉన్నాయి ... ఇళ్ళు, పట్టణం మరియు ప్రతిదీ ఉంది, కానీ సూర్యోదయం ఉన్నప్పుడు మనము చక్కగా ప్రతిదీ చూడగలము. అదేవిధంగా, ఆచార్య, లేదా అవతారం, వారు ఏది సృష్టించరు. వారు కేవలం విషయాలను యథాతథముగా చూడటానికి కాంతిని జ్ఞానాన్ని ఇస్తారు. కాబట్టి చైతన్య మహాప్రభు ఈ శ్లోకమునును బృహన్నారదీయ పురాణం నుండి సూచించారు. ఆ శ్లోకము అప్పటికే బృహన్నారదీయ పురాణంలో ఉంది.
- హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం
- కలౌ నాస్తేవ నాస్తేవ నాస్తేవ గతిరన్యథా
- ( CC Adi 17.21)
ఈ శ్లోకము అప్పటికే బృహన్నారదీయ పురాణంలో ఉంది, కలి యుగములో మన కార్యకలాపాలను సూచిస్తుంది. చైతన్య మహాప్రభు, సూచించారు. ఆయన కృష్ణుడు అయినప్పటికీ - అతను చాలా విషయాలు తయారు చేయగలడు - కానీ అతను అలా చేయలేదు. అది ఆచార్య అంటే. ఆచార్య ఏ కొత్త రకం మతాన్ని తయారు చేయరు, ఉదాహరణకు హరే కృష్ణ మంత్రం యొక్క కొత్త రకం పదబంధమును అది శక్తివంతమైనది కాదు. ఉదాహరణకు హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే / హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఇది శాస్త్రములో ఉంది. కాబట్టి అది శక్తీవంతమైనది ఇప్పుడు మేము ఈ పదహారు పదాలకు ఏదైనా జోడించినా, తీసివేసినా, అది నా తయారీ. అది శక్తిని కలిగి ఉండదు. వారు అర్థం చేసుకోలేరు. వారు హరే కృష్ణకి జతచేస్తూ, కొన్ని కొత్త వాక్యాలని తయారు చేయగలగితే, అప్పుడు అతను ప్రత్యేకంగా గుర్తించబడతాడు అని వారు ఆలోచిస్తున్నారు. కానీ అతను మొత్తం విషయం చెడగొడతాడు. అంటే ... అతడు ఏ క్రొత్త విషయము తయారు చేయలేడు. అతను చేసిన క్రొత్త విషయం ఏమిటంటే అతను మొత్తం విషయం చెడగొడతాడు. కాబట్టి చైతన్య మహాప్రభు ఎన్నడూ అలా చేయలేదు, అయితే అతడు స్వయముగా కృష్ణుడే. అతను శాస్త్రం యొక్క పరిధిలోనే నిలిచాడు. కృష్ణుడు, అతను భగవంతుడు. అతను కూడా సూచిస్తున్నాడు: yaḥ śāstra-vidhim utsṛjya vartate kāma-kārataḥ na siddhiṁ sāvāpnoti ( BG 16.23) అతను, శాస్త్రము యొక్క ఉత్తర్వును ఎవ్వరూ వదిలేయ కూడదని అతను సూచించాడు. Brahma-sūtra-padaiś caiva hetumadbhir viniścitaiḥ ( BG 13.5) కృష్ణుడు చెప్తాడు. అతను ఇవ్వగలడు. అతడు చెప్పినది ఏమైనా, అది శాస్త్రము అది వేదము. కానీ ఇప్పటికీ, ఆయన శాస్త్రము నుండి సూచిస్తారు.
అందువల్ల ఆచార్యుని యొక్క విధి, శాస్త్ర ఉత్తర్వును సూచించడము. అవి ఇప్పటికే వేదాలలో ఉన్నాయి. అతని విధి ఏమిటంటే ... ఉదాహరణకు చాలా మందులు ఉన్నాయి. మీరు ఒక ఔషధ దుకాణానికి వెళ్లినట్లయితే, అవి అన్నీ మందులు, కానీ అనుభవజ్ఞుడైన వైద్యుడు, అతను మీకు ప్రత్యేకంగా తగిన ఒక ఔషధం ఇస్తాడు. మీరు చెప్పకూడదు, "అయ్యా, ఎందుకు మీరు ఔషధం ఎంచుతున్నారు? మీరు ఏదైనా ఒక సీసా ఇవ్వవచ్చు." అది అర్థంలేనిది. ఏది పడితే అది కాదు. ఒక నిర్దిష్టమైన శరీరం, ఒక నిర్దిష్టమైన సీసా, మరియు ఒక నిర్దిష్టమైన మందు మీకు తగినది, అనుభవజ్ఞుడైన వైద్యుడు మీకు ఇస్తాడు. అతను అయ్య. కాబట్టి మీరు చెప్పలేరు "అంతా ఔషధమే, నేను ఏ సీసా తీసుకున్నా, అది సరియైనది." కాదు. అది కాదు. ఇది జరుగుతోంది. Yata mata tata patha. ఎందుకు Yata mata tata patha?ఒక నిర్దిష్ట సమయంలో మీకు అనుకూలంగా ఉండే నిర్దిష్ట mata , అది అంగీకరించాలి. ఏ ఇతర mata కాదు, . అదేవిధంగా, ఈ యుగంలో ఈ కలి యుగములో, ప్రజలు చాలా స్వల్ప కాలము జీవిస్తున్నారు, జీవిత కాల వ్యవధి చాలా చిన్నది, వారు దురదృష్టవంతులు, వారు చాలా నెమ్మదిగా ఉన్నారు, మరియు వారు అనధికారిక మార్గాలను, మతపరమైన సూత్రాలను తీసుకుంటారు, వారు జీవితంలో చాలా అవాంతరాలు ఎదుర్కొంటున్నారు ... కాబట్టి ఈ యుగము కోసం ఈ నిర్దిష్టమైన ఔషధం, చైతన్య మహాప్రభు ఇచ్చిన విధంగా:
- హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం
- కలౌ నాస్తేవ నాస్తేవ నాస్తేవ గతిరన్యథా
- ( CC Adi 17.21)
Prabhu kahe, ihā haite sarva-siddhi haibe tomāra.
అందువల్ల మనము చైతన్య మహాప్రభు సూచనను తీసుకోవాలి, ప్రత్యేకముగా ఈ యుగములో, కలి యుగంలో తనకు తాను అవతరించాడు. Kalau saṅkīrtana-prāyair yajanti hi su-medhasaḥ.. ఇది శాస్త్రము యొక్క ఉత్తర్వు.
- kṛṣṇa-varṇaṁ tviṣākṛṣṇaṁ
- sāṅgopāṅgāstra-pārṣadam
- yajñaiḥ saṅkīrtana-prāyair
- yajanti hi su-medhasaḥ
- (SB 11.5.32)
ఇది భగవంతుని ఈ అవతారము యొక్క ఉత్తర్వు, అతని సహచరులతో కలిసి వచ్చారు ... Sāṅgopāṅgāstra-pārṣadam. కాబట్టి చైతన్య మహాప్రభు ఎల్లప్పుడూ శ్రీ అద్వైత ప్రభుతో సంబంధం కలిగి ఉంటాడు, శ్రీ నిత్యానంద ప్రభు, శ్రీ గదాధర ప్రభు, శ్రీ శ్రీనివాస ప్రభు. అందువల్ల ఆరాధన పద్ధతి śrī-kṛṣṇa-caitanya prabhu-nityānanda śrī-advaita gadādhara śrīvāsādi-gaura-bhakta-vṛnda. అది ఖచ్చితమైన ప్రక్రియ. చిన్నది చేయటము కాదు. లేదు. సూచించినట్లుగానే ఇది శ్రీమద్-భాగవతము యొక్క సూచన. Kṛṣṇa-varṇaṁ tvisakṛṣṇaṁ sangopangastra... ( SB 11.5.32) కనుక మనము చైతన్య మహాప్రభువును ఆరాధించవలసి వచ్చినప్పుడు, మనము అతని సహచరులతో ఆరాధిస్తాము. Śrī-kṛṣṇa-caitanya prabhu-nityānanda śrī-advaita gadādhara śrīvāsādi-gaura-bhakta-vṛnda. అడ్డదారి పద్ధతి లేదు. కాబట్టి అది శాస్త్రము యొక్క ఉత్తర్వు కాబట్టి ఈ యుగము యొక్క పాప కార్యకలాపాలను వదిలించుకోవడానికి, ఇది ఇప్పటికే శాస్త్రములో సూచించబడింది మరియు గొప్ప ప్రామాణికుని ద్వారా నిర్ధారించబడింది, శ్రీ చైతన్య మహాప్రభు. Ceto-darpaṇa-mārjanaṁ bhava-mahā-dāvāgni-nirvāpaṇam ( SB 11.5.32) కనుక మనం అందరము ఈ మహా-మంత్రమును, శ్లోకమును తీసుకోవాలి
- హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే,
- హరే రామ హరే రామ రామ రామ హరే హరే.
- చాలా ధన్యవాదాలు.
- హరే కృష్ణ