TE/Prabhupada 0828 - తన సేవకుని గురించి శ్రద్ధ వహించే వారు ఎవరినైనా, ఆయన గురువు
Lecture on SB 5.5.18 -- Vrndavana, November 6, 1976
ప్రద్యుమ్న: అనువాదం: "జన్మ మరణ పునరావృత చక్రము నుండి తన ఆశ్రితులను విడుదల చేయలేనివాడు ఎప్పుడూ ఒక ఆధ్యాత్మిక గురువు, తండ్రి, భర్త, తల్లి లేదా పూజనీయమైన దేవతగా మారకూడదు. "
ప్రభుపాద:
- gurur na sa syāt sva-jano na sa syāt
- pitā na sa syāj jananī na sa syāt
- daivaṁ na tat syān na patiś ca sa syān
- na mocayed yaḥ samupeta-mṛtyum
- (SB 5.5.18)
కాబట్టి మునుపటి శ్లోకము లో వర్ణించబడింది, అది kas taṁ svayaṁ tad-abhijño vipaścid. సంరక్షకుడు అభిజ్ఞ మరియు విపశ్చిత్, చాలా జ్ఞానము కలిగిన వాడు అవవలెను. ప్రభుత్వం, తండ్రి, గురువు, లేదా భర్త అయినా... మనము మార్గనిర్దేశం చేయబడుతున్నందున, ప్రతి ఒక్కరూ వేరేవారిచే మార్గనిర్దేశం చేయబడతారు. అది సమాజం. పిల్లులు మరియు కుక్కలు కాదు. కేవలము పిల్లులు మరియు కుక్కల వలె, అవి పిల్లలకు జన్మనిస్తాయి. మరియు అప్పుడు వాటికి బాధ్యత ఉండదు. కుక్కలు వీధిలో తిరుగుతుంటాయి; ఎవరూ వాటి జాగ్రత్త తీసుకోరు. కానీ మానవ సమాజం అలా ఉండకూడదు. అక్కడ బాధ్యత గల సంరక్షకులు ఉండాలి. బాధ్యత గల సంరక్షకులను కొందరిని ఇక్కడ వర్ణించారు. మొట్ట మొదటగా, గురువు. మీరు పాఠశాల లేదా కాలేజీల్లో సాధారణ గురువు తీసుకుంటే, వారిని కూడా గురువు అని అంటారు, ఉన్నతమైన గురువు ఆధ్యాత్మిక గురువు. ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, ఇతరులకు గురువుగా బాధ్యతలు చేపట్టిన వారు ఎవరైనా, ఆయన చాలా జ్ఞానము కలిగి ఉండాలి, చాలా బాధ్యత కలిగి ఉండాలి, విపశ్చిత్, అభిజ్ఞాః . అభిజ్ఞతః , ఇది భగవంతుని యొక్క అర్హత. శ్రీమద్-భాగవతము ప్రారంభంలో చెప్పినట్లుగా, అభిజ్ఞః. Janmādy asya yataḥ 'nvayād itarataś ca artheṣu abhijñaḥ ( SB 1.1.1) నియంత్రికుడు అభిజ్ఞః అయి ఉండాలి. అదే విషయము ఇక్కడ ఉంది. వాస్తవానికి, మనము అభిజ్ఞః గా భగవంతునిగా ఉండలేము - అది సాధ్యం కాదు - కానీ ఆ అభిజ్ఞాతః కొంచము పరిమాణములో ఉండాలి. లేకపోతే అలా కావడానికి ఉపయోగము ఏమి ఉంది...?
మొదట గురువు గురించి చెప్పబడినది, తన సేవకుని గురించి శ్రద్ధ వహించే వారు ఎవరినైనా, ఆయన గురువు. మొదటి ఆరోపణ మీరు గురువు కాకూడదని మీరు పూర్తిగా అవగాహనలో ఉంటే తప్ప జనన మరణము నుండి మీ మీద ఆధార పడే వారిని కాపాడగలిగితే తప్ప? ఇది మొదటి ప్రశ్న. అంతే కానీ "నేను మీ గురువును, మీ కడుపులో కడుపునొప్పిని తగ్గించగలను." వారు ఆ విషయము కొరకు గురువు దగ్గరకు వెళతారు. ప్రజలు సాధారణంగా గురువు దగ్గరకు వెళ్ళతారు, మూర్ఖులు మరొక మూర్ఖుపు గురువు దగ్గరకు వెళతారు. అది ఏమిటి? "అయ్యా, నాకు కొంత నొప్పి ఉంది నాకు కొంత ఆశీర్వాదము ఇవ్వండి, నా నొప్పి తగ్గేటట్లుగా." కానీ నీవు ఎందుకు ఇక్కడకు వచ్చావు, మూర్ఖుడా, నీ కడుపులో నొప్పిని తగ్గించుకోవడానికా? మీరు ఎవరైనా డాక్టర్ దగ్గరకు వెళ్ళవచ్చు, లేదా మీరు ఏదైనా టాబ్లెట్ ను తీసుకోవచ్చు. ఇది గురువును సందర్శించడానికి వచ్చే ఉద్దేశమా? " కానీ సాధారణంగా వారు గురువు దగ్గరకు వచ్చి కొంత భౌతిక ప్రయోజనము కోసం వరము అడగటానికి వస్తారు వారు మూర్ఖులు, అందువలన కృష్ణుడు కూడా వారికి ఒక మూర్ఖపు గురువుని ఇస్తాడు. వారు మోసం చేయబడాలనుకుంటున్నారు. వారికి గురువు వద్దకు వెళ్ళవలసిన ఉద్దేశ్యం ఏమిటో తెలియదు. వారికి తెలియదు. వారికి వారి జీవితపు సమస్య ఏమిటో తెలియదు నేను ఎందుకు గురువు దగ్గరకు వెళ్ళాలి? వారికి తెలియదు. గురువులుగా పిలవబడే వారు కూడా ప్రజల యొక్క ఈ అజ్ఞానము యొక్క ప్రయోజనమును పొందుతున్నారు, వారు ఒక గురువు అవుతారు. ఇది జరుగుతోంది. గురువుకు తన బాధ్యత ఏమిటో తెలియదు, మూర్ఖుపు ప్రజలు, వారు గురువు వద్దకు ఎందుకు వెళ్ళలో వారికి తెలియదు. ఇది ఇబ్బంది