TE/Prabhupada 0832 - పరిశుభ్రత దైవత్వానికి పక్కనే ఉంటుంది



Lecture on SB 3.25.16 -- Bombay, November 16, 1974


పద్ధతి ఏమిటంటే అన్ని మురికి విషయముల నుండి మనస్సును శుభ్రపరచుకోవాలి. మనస్సు మిత్రుడు మరియు మనస్సు అందరికీ శత్రువు. ఇది పవిత్రము చేయబడితే, అప్పుడు అది స్నేహితుడు, అది మురికిగా ఉంటే... మిమ్మల్ని మీరు అపవిత్రంగా ఉంచుకుంటే, అప్పుడు మీకు ఏదైనా వ్యాధి వస్తుంది. మీరు మిమ్మల్ని శుభ్రముగా ఉంచుకుంటే, అప్పుడు మీరు కలుషితము అవ్వరు. మీరు చర్య తీసుకుంటే, మిగిలినది... అందువల్ల వేదముల నాగరికత ప్రకారం, రోజుకు మూడుసార్లు తనను తాను శుభ్రపరచుకోవాలి, త్రి-సంధ్య. ఉదయమున, ఉదయమున, మళ్ళీ మధ్యాహ్నము, మళ్ళీ సాయంత్రం. పరిపూర్ణంగా బ్రాహ్మణ నియమాలు నిబంధనలను అనుసరిస్తున్నవారు... వైష్ణవులు కూడా. వైష్ణవ అంటే ఆయన ఇప్పటికే బ్రాహ్మణుడు. అందువలన ఆయన నియమాలు పాటించాలి... Satyaṁ śamo damas titikṣā ārjavaṁ jñānaṁ vijñānam āstikyam... ( BG 18.42)

కాబట్టి పరిశుభ్రత దైవత్వానికి పక్కనే ఉంటుంది.... వాస్తవమునకు, మన భౌతిక బద్ద జీవితములో మనస్సు మురికితో నిండి ఉంది, అన్ని అపవిత్రమైన, మురికి విషయాలు. ఇది వ్యాధి. మనము తమో-గుణము రజోగుణము యొక్క అధమ దశలో ఉన్నప్పుడు, ఈ మురికి విషయాలు చాలా ప్రముఖమైనవి. అందుచేత, తమో-గుణము మరియు రజో-గుణముల స్థితి నుండి సత్వ-గుణమునకు తనకు తాను ఎదగాలి. ఈ పద్ధతి సిఫారసు చేయబడింది: ఎలా మనస్సును శుభ్రపరచుకోవడము śṛṇvatāṁ sva-kathāḥ kṛṣṇaḥ puṇya-śravaṇa-kīrtanaḥ ( SB 1.2.17) ప్రతి ఒక్కరు కృష్ణ- కథను వినవలసి ఉంది. కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు, ఆయన ఒక బద్ద జీవుని చూసినపుడు... ఒక ఆత్మ అనేది కృష్ణుడి యొక్క భాగం మరియు అంశ కనుక, కృష్ణుడు కోరుకుంటాడు "ఈ ఆత్మ, మూర్ఖుడు, అతను భౌతికమైన ఆనందం కోసము చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు ఇది అతని బంధనము, జన్మ, మరణం, వృద్ధాప్యము మరియు వ్యాధి యొక్క కారణము, అతను ఎంత మూర్ఖుడు అంటే, అతడు పరిగణలోకి తీసుకోడు. నేను జన్మ, మరణం, వృద్ధాప్యం మరియు వ్యాధికి తిరిగి ఎందుకు గురి అవుతున్నాను? అతను చాలా మూర్ఖుడు అయ్యాడు. మూఢా. అందువల్ల వారు వర్ణించబడ్డారు: మూర్ఖుడు, గాడిద. గాడిద... ఉదాహరణకు గాడిదకు తెలీదు అతను చాలా బరువును ఎందుకు మోస్తున్నాడు, చాకలి వాని యొక్క చాలా వస్త్రాలు. దేని కోసం? ఆయనకు లాభం లేదు. ఏ వస్త్రం దానికి చెందదు. చాకలి వాడు కొంచెము గడ్డిని ఇస్తాడు, అది ప్రతి చోటా అందుబాటులో ఉంటుంది. ఒకవేళ... కానీ గాడిద అనుకుంటుంది "ఈ కొంచము గడ్డి చాకలి వానిచే ఇవ్వబడింది. అందువల్ల నేను భారీ భారాన్ని మోయాలి, ఏ ఒక్క వస్త్రం నాది కాకపోయినా. "

వీరిని కర్మిలు అంటారు.కర్మిలు, ఈ గొప్ప, గొప్ప కర్మిలు, గొప్ప, గొప్ప మల్టీ మిలియనీర్లు, వారు కేవలం గాడిద వలె ఉన్నారు, ఎందుకంటే వారు చాలా కష్టపడుతున్నారు. ఈ పెద్ద చిన్న మాత్రమే కాదు. పగలు రాత్రి. కానీ రెండు చపాతీలు లేదా మూడు చపాతీలు లేదా అత్యదికముగా, నాలుగు చపాతీలు తింటారు. కానీ ఆయన కష్టపడి పని చేస్తున్నాడు. చాలా కష్టపడి పని చేస్తున్నాడు ఈ మూడు-నాలుగు చపాతీలను పేద వాడు కూడా చాలా సులభంగా పొందుతున్నాడు, ఆయన ఆయన ఎందుకు అంత కష్టపడుతున్నాడు? ఎందుకంటే ఆయన ఆలోచిస్తున్నాడు, "నాకు ఇలాంటి గొప్ప కుటుంబమును నిర్వహించ వలసిన బాధ్యత ఉంది." అదేవిధముగా, ఒక నాయకుడు కూడా, ప్రజా నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు, ఆయన కూడా అలా ఆలోచిస్తున్నాడు, నేను లేకపోతే, నా దేశ ప్రజలందరూ చనిపోతారు, కాబట్టి నేను పగలు రాత్రి పని చేస్తాను. నా మరణం వరకు లేదా ఎవరైనా నన్ను చంపే వరకు, నేను చాలా కష్టపడాలి." ఇవి అన్నీ మురికి విషయములు Ahaṁ mameti ( SB 5.5.8) Ahaṁ mameti. Ahaṁ mamābhimānotthaiḥ. ఈ మురికి విషయాలు... వ్యక్తిగత, సాంఘిక, రాజకీయ, సమాజపు లేదా జాతీయత తీసుకోండి. ఏమైనప్పటికి. ఈ రెండు విషయాలు, అహం మమేతీ ( SB 5.5.8) చాలా ప్రముఖమైనది. నేను ఈ కుటుంబానికి చెందినవాడను. నేను ఈ దేశానికి చెందినవాడను. నేను అటువంటి మరియు అటువంటి సమాజమునకు చెందినవాడను. నేను అటువంటి మరియు అటువంటి కర్తవ్యముని కలిగి వున్నాను. " కానీ ఆయనకు ఇవి అన్నీ తప్పుడు హోదాలు అని అతనికి తెలియదు. దీనిని అజ్ఞానం అంటారు. అందువలన చైతన్య మహాప్రభు తన ఆదేశాలు ప్రారంభిస్తూ, jīvera svarūpa haya nitya-kṛṣṇa-dāsa ( CC Madhya 20.108-109) వాస్తవ పరిస్థితి కృష్ణుడి యొక్క శాశ్వత సేవకుడిని. అది వాస్తవ పరిస్థితి. కానీ ఆయన ఆలోచిస్తున్నాడు, "నేను ఈ కుటుంబానికి సేవకునిగా ఉన్నాను. నేను ఈ దేశమునకు సేవకుడుగా ఉన్నాను. నేను ఈ సమాజ సేవకుడిని, సేవకునిగా ఉన్నాను..." చాలా ఉన్నాయి. అహం మమేతి ( SB 5.5.8) ఇది అజ్ఞానము వలన, తమో-గుణము. తమో-గుణము.