TE/Prabhupada 0834 - భక్తి భగవంతుని కోసం మాత్రమే



Lecture on SB 3.25.19 -- Bombay, November 19, 1974


జీవితములో భౌతిక గుణాల ద్వారా తక్కువగా ప్రభావితం అవ్వడానికి, జ్ఞానము, వైరాగ్యము మరియు భక్తి అనే ఈ స్థితికి రావాలి. లేకపోతే అది సాధ్యం కాదు. అదే పద్ధతి మళ్ళీ నొక్కి చెప్పబడుతోంది: na yujyamānayā bhaktyā bhagavati... భక్తి, ఎక్కడ దానిని అమలు చేయాలి? ఎవరో చెప్పారు, "నాకు భక్తి ఉంది." ఎక్కడ మీకు భక్తి ఉంది? ఇప్పుడు, నా భార్య పట్ల నాకు చాలా భక్తి ఉంది. నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను. నేను ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాను. నేను ఆమెను చూడలేకపోతే, నేను పిచ్చివాడిని అవుతాను. "కాబట్టి ఈ రకమైన భక్తి ఇక్కడ వివరించబడలేదు. నా కుటుంబం మీద నాకు భక్తి ఉంది. నా దేశము మీద నాకు భక్తి ఉంది. నేను దుర్గా దేవి మీద భక్తిని కలిగి వున్నాను. నేను చాలా మంది దేవతల మీద భక్తిని కలిగి ఉన్నాను... " లేదు. ఆ విధమైన భక్తి ఉపయోగము లేదు. అందుచే ఇది ప్రత్యేకంగా చెప్పబడినది భక్త్యా భగవతి. భగవతి, "భగవంతుని మీద..." ఏ రకమైన భగవంతుడు? ఇప్పుడు, ఈ రోజుల్లో చాలా భగవంతులు ఉన్నారు. కాదు, అలాంటి నకిలీ భగవాన్ కాదు, కానీ ఏ రకమైన? అకిలాత్మని. భగవాన్ అని పిలవబడే ఈ నకిలీ భగవాన్ ను మీరు అడగండి "నీవు అకిలాత్మన్ వా? మీరు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారా? నేను ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నానో చెప్పగలరా? "

కాబట్టి భగవాన్ అంటే ఆయన అకిలాత్మ అయి ఉండాలి. భగవాన్ అని పిలవబడే వారి చేత తప్పు దారి పట్ట వద్దు. అంతా ఉంది. భగవాన్ అంటే అకిలాత్మని అని అర్థం. ఆయనకి తెలుసు. కృష్ణుడు భగవద్గీత లో చెప్తాడు, īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe ( BG 18.61) నీవు ఈశ్వర అయితే , అప్పుడు మీరు ప్రతి ఒక్కరి హృదయంలో ఉండాలి. Sarvasya cāhaṁ hṛdi sanniviṣṭaḥ ( BG 15.15) Īśvara... కృష్ణుడు ఈశ్వరుడు అందువల్ల ఆయన చెప్తారు, sarvasya cāhaṁ hṛdi sanniviṣṭaḥ: "నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాను." కావున మీరు ఈశ్వరః అయితే, మీరు భగవాన్ అయితే, మీరు నా హృదయంలో ఉంటున్నారా? నేను ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నానో మీకు తెలుసా? అకిలాత్మని. అంతా చాలా నిశితంగా అధ్యయనం చేయాలి. భక్తి భగవంతుని కోసం మాత్రమే. కాదు " నా భక్తి దీని కోసము దాని కోసము కాదు, ఈ దేవత కోసం, ఆ దేవత కోసము కాదు, నా కుటుంబం కోసం, నా దేశం కోసం, నా సమాజం కోసము, నా భార్య కోసము, నా కుక్క కోసం, నా పిల్లి కోసం. "ఇది భక్తి కాదు. అది నకిలీ మాత్రమే. అది కామం. అది కోరిక. ఇది భక్తి కాదు. భక్తి అంటే భగవతి. భగవతి అంటే అకిలాత్మని.

మనము ఆ కృష్ణ చైతన్యమును పెంపొందించుకుంటే, భక్తి, అప్పుడు మన జీవితం, విజయవంతమైన జీవితం, బ్రహ్మ -సిద్ధయే, సంపూర్ణ ఆత్మ-పరిపూర్ణత, సాధ్యమవుతుంది. అందువలన ఇది చెప్పబడింది, sadṛśaḥ asti śivaḥ panthā: ". కాదు ఏ ఇతర ప్రత్యామ్నాయము లేదు" మీరు... బ్రహ్మ -సిద్ధయే. బ్రహ్మణ్ , పర - బ్రహ్మణ్ కృష్ణుడు. బ్రహ్మ -సిద్ధయే అంటే ఏమిటి సంబంధం? నేను బ్రహ్మణ్. పర్వాలేదు. అహం బ్రహ్మాస్మి. కానీ పర బ్రహ్మణ్ తో మీ సంబంధం ఏమిటి? అది బ్రహ్మ -సిద్ధయే. బ్రహ్మణ్ మరియు పర - బ్రహ్మణ్ , వీరు ఇద్దరు బ్రహ్మణ్ లు. ఎందుకు ఉంది...? ఆత్మ మరియు పరమాత్మ , ఈశ్వర మరియు పరమేశ్వర కాబట్టి జీవి మరియు భగవంతుడు. Nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13). ఇవి వేదముల సమాచారం. రెండు ఉన్నాయి, ఎల్లప్పుడూ రెండు ఉంటాయి. ఆత్మ పరమాత్మ , బ్రహ్మణ్, పర - బ్రహ్మణ్. కావున... బ్రహ్మ -సిద్ధయే అంటే "నేను బ్రహ్మణ్," అని అర్థము చేసుకోవడము మాత్రము కాదు కానీ పర బ్రహ్మణ్ తో నా సంబంధం ఏమిటి అని నేను అర్థం చేసుకోవాలి. అది brahma-siddhaye. అంటే పరబ్రహ్మణ్ ఏమిటో తెలుసుకోవాలి. ఆ పరబ్రహ్మణ్ కృష్ణుడు.