TE/Prabhupada 0835 - ఆధునిక రాజకీయ నాయకులు, వారు కర్మ చేయుటకుప్రాముఖ్యత ఇస్తూ కఠినంగా పని చేస్తుంటారు



Lecture on SB 5.5.33 -- Vrndavana, November 20, 1976


ప్రభుపాద: త్యక్త్వా దేహం పునర్ జన్మ నైతి ( BG 4.9) కృష్ణతత్వాన్ని అర్థం చేసుకున్నవాడు, అతడు వెంటనే విముక్తి పొందిన వ్యక్తి. అతడు ఆధ్యాత్మిక ప్రపంచానికి బదిలీ చేయబడుటటకు తగినవాడు. త్యక్త్వా దేహం పునర్ జన్మ నైతి. పునర్ జన్మ... కృష్ణున్ని అర్థం చేసుకోలేనివాడు, జన్మించుట మళ్ళీ జన్మించుట పునరావృతమవుతుంది. నివర్తన్తే మృత్యు - సంసార- వర్త్మని ( BG 9.3) మీరు కృష్ణుడిని అర్థం చేసుకోనంతవరకు -- హరిం వినా న మృతిం తరంతి--- మీరు మరణము, జన్మించడము, మరణము, వృద్ధాప్యము, వ్యాధి నుండి తప్పించుకోలేరు. ఇది సాధ్యం కాదు.

అందువల్ల మీకు మీ జీవితం విజయవంతం కావాలంటే, మీరు కృష్ణున్ని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అది కృష్ణ చైతన్య ఉద్యమము. అప్పుడు మీ జీవితం విజయవంతమవుతుంది. కృష్ణున్ని అర్థం చేసుకోవడానికి, ఏ ఇతర పద్ధతి మీకు సహాయపడదు. కృష్ణుడు చెప్పాడు, భక్త్వా మాం అభిజానాతి ( BG 18.55) నన్ను యోగ పద్ధతి ద్వారా లేదా కర్మ ద్వారా, జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవచ్చు అని ఎప్పుడూ చెప్పలేదు. ఆధునిక రాజకీయ నాయకులు, వారు కర్మ చేయుటకు ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే వారు పందులు కుక్క వలె కఠినంగా పని చేయాలనుకుంటారు. వారు అనుకుంటారు కర్మ యోగ... కర్మ యోగ బాగుంది, కానీ కర్ములు మూఢులు. ఇంద్రియ తృప్తి కొరకు రాత్రి పగలు కష్టపడి పని చేస్తున్నవారు, వారు పందులు కుక్కల కన్నా ఉత్తమం కాదు. వారు మంచి వారు కాదు. కానీ కర్మ - యోగ భిన్నమైన ప్రక్రియ. కర్మ - యోగ అంటే ఏదో ఒకటి సృష్టించటం, ఏదో ఒకటి చేయటం పట్ల ఆసక్తి ఉన్నవారు. అందువల్ల కృష్ణుడు అన్నారు " అవును, మీరు చేయవచ్చు, కానీ," యత్ కరోషి యజ్ జుహోషి యద్ అస్నాసి యత్ తపస్యసి కురుష్వ తద్ మద్ ....( BG 9.27) " ఫలితం నాకు ఇవ్వాలి.” అనాశ్రితః కర్మ - ఫలం కార్యం కర్మ కరోతి యః, స సన్న్యాసీ ( BG 6.1)

కాబట్టి తమ కర్మఫలం తీసుకోని ఎవరైనా, అప్పుడు అతడు సన్యాసి. మీరు సంపాదించారని అనుకోండి.... మీరు ఒక వ్యాపారవేత్త, వీరు రెండు లక్షల రూపాయలు సంపాదించారు--- కానీ కృష్ణునికి ఇచ్చారు. అనాశ్రితః కర్మ - ఫలం. లేకపోతే, ఈ రెండు లక్షల రూపాయలతో మీరు ఏమి చేస్తారు? మీరు తీసుకోకపోతే, మీరు దాన్ని పారవేస్తారా? " లేదు, నేను ఎందుకు పారేయాలి? ఇది కృష్ణుడి కోసం ఉపయోగించాలి." కాబట్టి ప్రజలు భౌతిక ప్రపంచంలో ధనం సంపాదించటానికి చాలా ఉత్సాహభరితంగా ఉన్నారు. మనము ఆచరణలో, ముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచంలో ప్రత్యేకంగా చూడగలం. అయితే కృష్ణ చైతన్య ఉద్యమాన్ని నడిపించటానికి వారు తమ లాభాన్ని ఉపయోగిస్తే , అప్పుడు వారి ధనము ఇకపై అణుబాంబును విడుదల చేయడంలో నిమగ్నం అవ్వదు. లేకపోతే అది అణుబాంబును విడుదల చేయడానికి ఉపయోగపడుతుంది. నేను నీ తలను నరుకుతాను నీవు నా తలను నరుకుతావు. మనమిద్దరం, మనము పూర్తి చేస్తాము.

చాలా ధన్యవాదములు.

భక్తులు: జయ ప్రభుపాద