TE/Prabhupada 0847 - కలి-యుగము యొక్క ఈ వర్ణన శ్రీమద్-భాగవతం లో ఇవ్వబడింది



731224 - Lecture SB 01.15.46 - Los Angeles


నిన్న మనము ఈ కలి యుగము గురించి చర్చిస్తున్నాము. అత్యంత పతితమైన యుగము. ప్రజలు చాలా పతనమైనారు. కావున అక్కడ, లెక్కింపు ద్వారా, డెబ్భై ఐదు శాతం ధర్మము లేదు ఇరవై ఐదు శాతం ధర్మము ఉన్నది ఇతర యుగాలతో పోలిస్తే. కానీ ఈ ఇరవై ఐదు శాతం ధర్మము ఉన్న జీవితం కూడా తగ్గిపోతుంది. ఈ శ్లోకముని వివరించడానికి ముందు, నేను ఈ యుగములోని కొన్ని లక్షణాల గురించి మీకు తెలియజేస్తాను. ఇది శ్రీమద్-భాగవతం, పన్నెండవ స్కందములో, మూడవ అధ్యాయములో కూడా వివరించబడింది. (ప్రక్కన:) ఎక్కడ ఉంది? ఆ పుస్తకం నాకు ఇవ్వండి. మనము ఇంకా ప్రచురించలేదు, కాబట్టి నేను సూచన నుండి చదువుతున్నాను. Anyonyato rājabhiś ca kṣayaṁ yāsyanti pīḍitāḥ (SB 12.1.41). ఇది రెండవ అధ్యాయములో, పన్నెండవ స్కందములో, శ్రీమద్-భాగవతం లో వివరించబడింది. కాబట్టి,

tataś cānu-dinaṁ dharmaḥ
satyaṁ śaucaṁ kṣamā dayā
kālena balinā rājan
naṅkṣyaty āyur balaṁ smṛtiḥ
(SB 12.2.1)

కలి-యుగము యొక్క ఈ వర్ణన శ్రీమద్-భాగవతం లో ఇవ్వబడింది. దీన్ని శాస్త్రము అని పిలుస్తారు. ఈ శ్రీమద్-భాగవతం ఐదు వేల సంవత్సరాల క్రితం కలి యుగము ప్రారంభమయ్యేటప్పుడు వ్రాయబడింది. ఇప్పుడు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో, అక్కడ ప్రతిదీ ఇవ్వబడింది. శాస్త్రము అనగా... అంటే... అందువలన మనం శాస్త్రమును అంగీకరిస్తాము. త్రికాలజ్ఞ Tri-kāla-jña. śāstrakāra, శాస్త్రకార లేదా శాస్త్రముల యొక్క గ్రంథకర్త , ఆయన గతమునూ, వర్తమానమునూ, భవిష్యత్తునూ వర్ణించగలగాలి కాబట్టి విముక్తి పొందిన వ్యక్తి అయి ఉండాలి. శ్రీమద్-భాగవతములో మీరు చాలా విషయాలు కనుగొంటారు ఇది భవిష్యత్తులో జరుగుతుందని చెప్పబడింది. ఉదాహరణకు శ్రీమద్-భాగవతములో బుద్ధుని అవతారము గురించి ప్రస్తావన ఉంది. అదేవిధముగా, భగవంతుడు కల్కి అవతారము యొక్క ప్రస్తావన ఉంది. ఐదు వేల సంవత్సరాల క్రితం రాయబడినప్పటికీ, భగవంతుడు చైతన్య అవతారము గురించి ప్రస్తావన ఉంది Tri-kāla-jña. వారు త్రికాలజ్ఞ. తెలుసు, గతం, వర్తమానం భవిష్యత్తు గురించి వారికి తెలుసు.

కాబట్టి కలి-యుగము గురించి, చర్చించడం, శుకదేవ గోస్వామి ఈ యుగము యొక్క ముఖ్య లక్షణాలను వివరిస్తున్నారు. మొట్టమొదటి లక్షణం ఆయన చెప్పుతున్నారు, tataś cu anu-dinam. ఈ యుగము పురోగతి అవుతున్నప్పుడు, కలి యుగము, ధర్మము, ధర్మ సూత్రాలు; సత్యం, నిజాయితీ; శౌచం, పరిశుభ్రత; క్షమ, క్షమాపణ; దయ, కరుణ ఆయుః, జీవిత కాల వ్యవధి; బలమ్, శారీరక బలము; స్మ్రతి, జ్ఞాపకశక్తి... ఎన్నో లెక్కించండి. ధర్మః , సత్యం , శౌచం , క్షమ , దయ , ఆయుః , బలమ్ , స్మ్రతి - ఎనిమిది. ఈ విషయాలు క్రమంగా తగ్గిపోతాయి, దాదాపు సున్నా అవుతాయి. ఇప్పుడు నేను మీతో చెప్పినట్లు, కలి యుగంలో... ఇతర యుగాలలో... ఉదాహరణకు సత్య యుగము, సత్య యుగము యొక్క కాల వ్యవధి పద్దెనిమిది వందల వేల సంవత్సరాలు. ఆ యుగములో ఒక వంద వేల సంవత్సరాలు మనిషి జీవిస్తున్నాడు. ఒక వంద వేల (లక్ష)సంవత్సరాలు. తదుపరి యుగము, ఆ యుగము యొక్క వ్యవధి, పన్నెండు వందల వేల సంవత్సరాలు, మరియు ప్రజలు ఒక వెయ్యి సంవత్సరాలు జీవించేవారు, ఒకటి కాదు, పది వేల సంవత్సరాలు. పది సార్లు తగ్గింది. తర్వాతి యుగము, ద్వాపర-యుగము, మళ్ళీ పది సార్లు తగ్గింది. అయినా వారు వెయ్యి సంవత్సరాల పాటు జీవించారు, ఆ యుగపు వ్యవధి ఎనిమిది వందల వేల సంవత్సరాలు. ఇప్పుడు, తదుపరి కాలము వయస్సు, ఈ కలి యుగములో, పరిమితి వంద సంవత్సరాలు. మనము అత్యంతముగా వంద సంవత్సరాల వరకు జీవించ వచ్చు. మనము వంద సంవత్సరాలు జీవించడం లేదు, కానీ అయినప్పటికీ, పరిమితి వంద సంవత్సరాలు. కేవలం చూడండి. ఇప్పుడు, వంద సంవత్సరాలు నుండి... ఇప్పుడు భారతదేశంలో సగటు వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు. మీ దేశంలో వారు డెబ్బై సంవత్సరాలు అంటున్నారు? కాబట్టి ఇది తగ్గుతోంది. అది ఇంకా తగ్గుతుంది ఒక వ్యక్తి ఇరవై లేదా ముప్పై సంవత్సరాలు జీవించి ఉంటే, ఆయన ఈ యుగంలో, కలి యుగములో గొప్ప వృద్ధుడుగా పరిగణించబడతాడు. కాబట్టి ఆయుః, జీవిత కాల వ్యవధి తగ్గిపోతుంది