TE/Prabhupada 0848 - ఆయనకు కృష్ణ-తత్వము తెలియకపోతే ఆయన గురువు కాలేడు



741227 - Lecture SB 03.26.18 - Bombay


చైతన్య మహా ప్రభు, రామానంద రాయ ఆధ్యాత్మిక పరిపూర్ణము గురించి మాట్లాడినప్పుడు... కాబట్టి రామానంద రాయ ఒక శూద్రుని కుటుంబానికి చెందినవాడు ఆయన గృహస్థుడు మరియు మద్రాసుకు గవర్నర్ గా ఉన్నారు. ఆయన రాజకీయ నాయకుడిగా కూడా అందువలన చైతన్య మహా ప్రభు ఆయనను ప్రశ్న అడుగుతున్నారు... ఇది చైతన్య మహా ప్రభు యొక్క లీల: mūkaṁ karoti vācālam, ఎలా చేస్తున్నాడు, ఆయన ఎలా ఒక శూద్రునిగా గృహస్తుడిగా, రాజకీయవేత్తగా, ఆయన గురువుగా, చైతన్య మహా ప్రభు గురువుగా. కాబట్టి ఎవరూ చైతన్య మహా ప్రభువుకు గురువు కాలేరు, కానీ ఆయన ఆ పాత్రను చేస్తున్నాడు. ఆయన ప్రశ్నించడం జరిగింది, రామానంద రాయ సమాధానము చెప్తున్నాడు. ఆయన స్థితి ఎంత ఉన్నతమైనదో ఊహించుకోండి. అందువలన ఆయన కొద్దిగా సంశయించారు, చాలా క్లిష్టమైన ప్రశ్నలు ఆయన ముందు ఉంచబడినప్పుడు... ఆయన సమర్ధత కలిగి ఉన్నారు సమాధానము ఇవ్వడానికి. ఆయన సమాధానమిస్తున్నారు. అందువలన ఆయన కొద్దిగా సంశయించారు, అయ్యా, మీరు చాలా ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చారు మరియు అత్యంత జ్ఞానము కలిగిన వ్యక్తి, ఇప్పుడు మీరు మానవ సమాజంలో సన్యాసాన్ని, ఉన్నతమైన స్థానాన్ని తీసుకున్నారు. "

సన్యాస చాలా గౌరవప్రదమైన స్థానము. ఇప్పటికీ ఇది భారతదేశం లో గౌరవించబడుతుంది. ఎవరైనా సన్యాసి వెళ్ళిన చోటుకు, కనీసం గ్రామాలలో, వారు గౌరవప్రదమైన ప్రణామము చేస్తారు. అన్ని రకాల సౌకర్యాలను ఇస్తారు. శాస్త్రం ప్రకారం, ఒక సన్యాసికి గౌరవము లేదా సరైన మర్యాద ఇవ్వకపోతే, ఆ వ్యక్తికి శిక్ష కనీసం ఒక రోజు పస్తు ఉండాలి. ఇది వేదముల పద్ధతి. కానీ చాలా మంది సన్యాసులు దీని యొక్క ప్రయోజనమును పొందుతున్నారు, కాబట్టి మనము ఆందోళన చెందవలసిన అవసరము లేదు. చైతన్య మహా ప్రభు ఒక తప్పుడు సన్యాసి కాదు. ఆయన వాస్తవమైన సన్యాసి. ఆయన వాస్తవమైన గృహస్తుడు కూడా, రామానంద రాయ. అందువలన ఆయన కొంచము సంకోచించారు ఆయనని ప్రోత్సహించడానికి, చైతన్య మహా ప్రభు వెంటనే అన్నారు కాదు కాదు. ఎందుకు మీరు సంశయిస్తున్నారు ? ఎందుకు మీరు అధమ స్థాయి వారిగా భావిస్తున్నారు? మీరు గురువు. ఇప్పుడు నేను ఎలా గురువు అయ్యాను? "Yei kṛṣṇa-tattva-vettā, sei guru haya ( CC Madhya 8.128) " ఎందుకంటే కృష్ణుడి యొక్క జ్ఞానమును తెలుసు కొనుట సాధారణ స్థితి కాదు. Yatatām api siddhānāṁ kaścid vetti māṁ tattvataḥ BG 7.3. కృష్ణుడిని తెలిసిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. Yatatām api siddhānām ( BG 7.3) ఆయన అన్ని సిద్దులు తెలిసిన వాడు కూడా. ఎందుకు మీరు సంశయిస్తున్నారు? మీకు కృష్ణ-తత్వము తెలుసు; అందువలన నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కాబట్టి ఇది పరిస్థితి.

కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమము అంటే మన దగ్గరకు వచ్చిన ప్రజలకు శిక్షణ ఇచ్చి వారిని తయారు చేయడానికి అన్ని సిద్ధుల కంటే ఎక్కువగా, అన్ని సిద్ధుల కంటే ఎక్కువగా ఇది చాలా సులభం. ఒకరు అవవచ్చు, గురువు యొక్క స్థానమును తీసుకోవచ్చు, ఎవరైతే... గురువు అంటే అన్ని సిద్దుల పైన ఉన్నవాడు. Kṛṣṇa-tattva-vettā. Yei kṛṣṇa-tattva-vettā, sei guru haya ( CC Madhya 8.128) ఆయనకు కృష్ణ-తత్వము తెలియకపోతే ఆయన గురువు కాలేడు. సాధారణ మనిషి కాదు. యోగులు, కర్ములు, జ్ఞానులు, వారు గురువు కాలేరు. ఇది అనుమతించ బడలేదు, ఎందుకనగా ఒకరు జ్ఞాని అయినా కూడా, ఆయన అనేక జన్మల తరువాత కృష్ణుడి జ్ఞానమును పొందుతాడు; ఒక జన్మలో కాదు, కానీ అనేక జన్మల తరువాత. ఆయన తన జ్ఞాన పద్ధతి ద్వారా పరమ సత్యము ఏమిటో అర్థం చేసుకోవడానికి పట్టు విడవకుండా ప్రయత్నిస్తే, తన కల్పనల పద్ధతిలో, అప్పుడు ఇంకా ఆయన చాలా చాలా జన్మలు మార్చవలసి ఉంటుంది. అప్పుడు ఒక రోజు ఆయన అదృష్టంతుడు కావచ్చు. ఆయన ఒక భక్తునితో సంబంధం కలిగి ఉంటే, ఆయనకు కృష్ణుడిని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇది భగవద్గీతలో పేర్కొనబడింది: bahūnāṁ janmanām ante jñānavān māṁ prapadyate ( BG 7.19) ఎవరు ప్రపద్యతే? ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందుతారో. కృష్ణుడి సంపూర్ణంగా అర్థం చేసుకోకపోతే, ఎందుకు ఒకరు శరణాగతి పొందాలి? కృష్ణుడు చెప్తాడు, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) గొప్ప, గొప్ప విద్వాంసులు వారు, "ఇది చాలా ఎక్కువ," అని వారు చెప్తారు. ఇది చాలా ఎక్కువ అని. కృష్ణుడు కోరుతున్నాడు, mām ekaṁ śaraṇaṁ vraja. ఇది చాలా ఎక్కువా. ఇది చాలా ఎక్కువ కాదు; ఇది వాస్తవమైన పరిస్థితి. ఆయన వాస్తవమునకు తన జ్ఞానం లో ఉన్నత స్థానములో ఉంటే... Bahūnāṁ janmanām ante ( BG 7.19) అది ఒక జీవితంలో సాధించలేరు. ఆయన జ్ఞానము కోసము పట్టు విడవకుండా ప్రయత్నిస్తూ ఉంటే, సంపూర్ణ సత్యమును అవగాహన చేసుకునేందుకు, తరువాత, అనేక జన్మల తరువాత ఆయన జ్ఞానంలో ఉన్నప్పుడు, ఆయన కృష్ణుడికి శరణాగతి పొందుతాడు. Vāsudevaḥ sarvam iti sa mahātmā sudurlabhaḥ ( BG 7.19) ఆ రకమైన మహాత్మా... మీరు చాలా మంది మహాత్ములను కనుగొంటారు, కేవలం దుస్తులు మార్చడం ద్వారా - ఆ రకమైన మహాత్మ కాదు. Sa mahātmā sudurlabhaḥ. అటువంటి మహాత్ములను గుర్తించడం చాలా కష్టము, కానీ అక్కడ ఉన్నారు. ఒకవేళ అదృష్టవశాత్తూ, అతడు అలాంటి మహాత్ములను కలిస్తే, ఆయన జీవితం విజయవంతమవుతుంది. Sa mahātmā sudurlabhaḥ