TE/Prabhupada 0849 - మనము భగవంతుని చూడాలనుకుంటున్నాము.కానీ మనకు అర్హత లేదని మనము గుర్తించము
731231 - Lecture SB 01.16.03 - Los Angeles
ప్రద్యుమ్న: అనువాదము: " పరీక్షిత్తు మహారాజు, మార్గదర్శకత్వం కోసం తన ఆధ్యాత్మిక గురువుగా కృపాచార్యుని ఎంపిక చేసిన తర్వాత, గంగానది ఒడ్డున మూడు అశ్వమేధ యజ్ఞాలను చేశారు. పరిచారకులకు తగిన ప్రతిఫలంతో వీటిని నిర్వహించారు. ఈ యాగాలలో, సామాన్య మానవుడు కూడా దేవతలను చూడగలడు." ( SB 1.16.3)
ప్రభుపాద: ఇప్పుడు ప్రజలు అంటారు "దేవతలను ఎందుకు చూడలేము?" సమాధానం ఇది "మీ యాగం ఎక్కడ, అశ్వమేధ యాగం?" దేవతలు, వారు చాలా చౌక కాదు. రాజు లేదా అధ్యక్షుడు లాగే. ఆయన ఎక్కడికైనా వస్తాడా, సామాన్య వ్యక్తి వలె? లేదు. ఎక్కడికైతే రాజులు లేదా దేవతలు లేదా నారద ముని వంటి గొప్ప ముని వస్తారో, ఆ ప్రదేశము చాలా విలువైనది అయి ఉండవలెను.
కాబట్టి గ్రహాంతర పద్ధతి ఉండేది. ఉదాహరణకు అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళినట్లు, అదేవిధంగా, ఈ యుగాలలో, పరీక్షిత్ మహారాజు ఇంకా ఇతరులు, యుధిష్టర మహారాజు చేత ఏర్పాటు చేయబడినట్లయితే అప్పుడు దేవతలను ఆహ్వానించినట్లయితే వారు వస్తారు. వారు రావటమే కాదు సామాన్య వ్యక్తులందరూ వారిని చూడగలరు. అందువల్ల ఇక్కడ చెప్పబడింది, yatrākṣi-gocarāḥ, devā yatrākṣi-gocarāḥ. మనము ప్రతిదీ చూస్తాము అని చాలా గర్వంతో ఉంటాము, కానీ చూడడానికి అర్హత కోసం వేచి ఉండాలి. ఏదో చపలముగా నేను చూడాలి అని కాదు, "ఓ దేవా, దయచేసి నా ముందుకు రండి. నేను చూడాలనుకుంటున్నాను." భగవంతుడు... మనము చూచుటకు వీలుగా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు చాలా దయామయుడు. ఇక్కడ ఆయన ఆలయంలో ఉన్నాడు. మీరు చూస్తూ ఉండవచ్చు. అప్పుడు అతడు భగవంతుడు అని మీరు గ్రహిస్తారు.
అందువల్ల భగవంతుడు లేదా ఉపదేవత, ప్రతి ఒక్కరూ akṣi-gocarāḥ, కావచ్చు, మీ దృష్టి యొక్క పరిధిలో , మీరు అర్హులు అయి ఉంటే. ఇది పద్ధతి. ఈ మూర్ఖులు చెప్తారు, "మీరు నాకు భగవంతుని చూపించగలరా?" కానీ మీకు ఏమి శక్తి వుంది చూడడానికి? మొదట మీరు అర్హతను సంపాదించండి.అప్పుడు మీరు చూస్తారు. భగవంతుడు అన్నిచోట్లా ఉంటాడు. Andantara - stha - paramanu - cayan (BS 5.35)... అతడు పరమాణువులో కూడా ఉన్నాడు. కాబట్టి ఎవరికైతే భగవంతుని చూచుటకు అర్హత లేదో, వారికి భగవద్గీతలో భగవంతుని వేరొక విధముగా చూడాలని సలహా ఇస్తారు. కృష్ణుడు చెప్పినట్లుగా, raso 'ham apsu kaunteya prabhāsmi śaśi-sūryayoḥ ( BG 7.8) ఓ కౌంతేయ, అర్జునా, నీటి యొక్క రుచిని నేను. కాబట్టి మీరు భగవంతుని నీటి యొక్క రుచిలో చూడడానికి ప్రయత్నించండి. ప్రస్తుతానికి, మనకు అనేక ఇంద్రియాలు ఉన్నాయి. నీవు కళ్లతో భగవంతుని చూడాలని అనుకుంటున్నావు. కాబట్టి నీ నాలుకతో ప్రారంభించు. ఇది కూడా మరో ఇంద్రియం. ఎలాగైతే ఇక్కడ మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి, నేను చెప్పినట్లయితే, "ఇది ఎలా ఉందో చూద్దాం." ఎలా వుందో చూద్దాం అంటే.... నీవు ఇప్పటికే చూస్తున్నావు నీకు ఏమి కావాలి? లేదు, నేను నాలుకతో ముట్టుకోవాలని అనుకుంటున్నాను. అది "నన్ను చూడనివ్వండి." కళ్లతో కాదు. ఒక మంచి తీపి వస్తువు, హల్వా ఉన్నట్లయితే, అప్పుడు "నన్ను చూడనివ్వండి" అంటే నన్ను రుచి చూడనివ్వండి". మొట్టమొదట భగవంతుని రుచి చూడండి. ఇది మీ ఇంద్రియ జ్ఞానం యొక్క పరిధిలో ఉంది, కాని సాధన చేసేందుకు ప్రయత్నించండి. అప్పుడు sevonmukhe hi jihvādau svayam eva sphuraty adaḥ (Bhakti-rasāmṛta-sindhu 1.2.234). అప్పుడు నీవు గ్రహించగలవు. భగవంతుడు తనకు తానుగా నీకు తెలియచేస్తాడు. మీరు భగవంతునికి వినయముతో, అంకితమివ్వబడినపుడు, ప్రసాదం రుచి చూసి, మీరు భగవంతుని స్వయంగా చూడవచ్చు. ఆయన మీతో మాట్లాడతాడు. అది సాధ్యమే.
ప్రస్తుత క్షణంలో, మనము భగవంతుని చూడాలనుకుంటున్నాము. కానీ మనకు అర్హత లేదని మనము గుర్తించము. మనము ఎలా చూడవచ్చు? నేను ఒక సాధారణ అధ్యక్షుడిని చూడలేకపోతే.... నా చపలత్వం ద్వారా నేను అధ్యక్షుని లేదా ఇతర పెద్ద అధికారిని చూడాలనుకుంటే మీరు అర్హత సాధించకపోతే మీరు చూడలేరు. కాబట్టి మీరు భగవంతుని ఎలా చూడగలరు? అది సాధ్యం కాదు. మీకు మీరే అర్హత సాధించుకోవాలి. అప్పుడు మీరు భగవంతుని చూడవచ్చు. Akṣi-gocaraḥ.. Aksi - gocarah అంటే, కేవలము మనము చూస్తున్నాము - నీవు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నాను-- అలాగే, నీకు అర్హత ఉంటే, భగవంతుని లేదా దేవతలను చూడగలవు