TE/Prabhupada 0856 - జీవాత్మ వ్యక్తి అలాగే భగవంతుడు కూడా వ్యక్తి
740327 - Conversation - Bombay
జీవాత్మ వ్యక్తి అలాగే భగవంతుడు కూడా వ్యక్తి
ప్రభుపాద: ఈ విధంగా ప్రారంభంలో, సృష్టికి ముందే, భగవంతుడు ఉన్నాడు. సృష్టి తరువాత, సృష్టి నాశనం చేయబడినప్పుడు, ఆయన ఎప్పటికీ ఉంటాడు. దీనిని దివ్యమైన స్థితి అని పిలుస్తారు.
పంచద్రావిడ: భాష్యము: భగవంతుని యొక్క పరిస్థితి ఎప్పుడూ దివ్యమైనది, ఎందుకంటే సృష్టిని సృష్టించడానికి కార్యకారణ శక్తులు అవసరం..... (విరామం)
ప్రభుపాద: ... ఈ చొక్కానీ సృష్టించక ముందు, అది నిరాకారం. అక్కడ ఏ చేయి లేదు, ఏ మెడ లేదు , ఏ శరీరం లేదు. అదే వస్త్రం. కానీ శరీరానికి అనుగుణంగా, దర్జీ ఈ చేయిని కప్పి ఉంచడానికి తయారు చేశారు ఇది ఒక చేయిలాగా కనిపిస్తుంది. ఛాతీ యొక్క ఈ కవచం ఛాతీలా కనిపిస్తోంది. అందువలన, నిరాకారం అంటే భౌతికముగా ఆచ్ఛాదింపబడి (కప్పబడి) ఉండటము. లేకపోతే జీవాత్మ వ్యక్తి. ఉదాహరణకు మీరు దర్జీ దగ్గరకు వెళ్లడం లాగానే, మీ శరీరానికి అనుగుణంగా దర్జీ ఒక కోటును కత్తిరిస్తారు. ఈ కోటు, కోట్ యొక్క పదార్థాలు, వస్త్రం, ఇది నిరాకారం, వ్యక్తి కాదు. కానీ దానిని వ్యక్తి లాగా తయారు చేశారు, వ్యక్తి మీద ఆచ్ఛాదింపబడి ఉంది. వేరొక మాటలో చెప్పాలంటే, ఆత్మ అనేది వ్యక్తి అలాగే భగవంతుడు కూడా వ్యక్తి. నిరాకారం అంటే ఆచ్ఛాదింపబడి ఉండటము. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆచ్ఛాదింపబడి వుండటము అనేది నిరాకారము, జీవి కాదు. ఆయన ఆచ్ఛాదింపబడి ఉన్నాడు. ఆయన నిరాకారం కాదు. ఆయన వ్యక్తి. చాలా సులభమైన ఉదాహరణ. కోటు, చొక్కా వ్యక్తి కాదు కానీ ఎవరైతే దుస్తులలో ఉంచబడిన వ్యక్తి, ఆయన నిరాకారం కాదు. ఆయన వ్యక్తి. కాబట్టి భగవంతుడు ఎలా నిరాకారం కాగలడు? భౌతిక శక్తి నిరాకారం. ఇది వివరించబడింది... ఇది భగవద్గీతలో వివరించబడింది, మయా తతం ఇదం సర్వం జగద్ అవ్యక్త-మూర్తినా ( BG 9.4) ఈ జగద్ అవ్యక్తం, నిరాకారం. అది కూడా కృష్ణుడి శక్తి. అందువల్ల, "నేను నిరాకార రూపంలో విస్తరించాను" అని అన్నాడు. ఆ నిరాకార రూప లక్షణం కృష్ణుడి శక్తి. కాబట్టి భౌతిక ఆఛ్ఛాదన నిరాకారమైనది, కానీ ఆత్మ లేదా పరమాత్మ వ్యక్తులై ఉన్నారు. దీనిపై ఏదైనా ప్రశ్న ఉందా, అది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఎవరైనా ఉన్నారా అర్థం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందైనా ఉన్నదా? (విరామం)
భవ-భూతి: ... ఎందుకంటే నేను గీత గురించి ఆంగ్లంలో విన్నాను ఈ విధముగా చాలా మంది యోగులు అని పిలవబడేవారి నుండి, కానీ వారు వివరించలేరు, వారికి ఏ మాత్రము అవగాహన లేదు ...
ప్రభుపాద: లేదు, లేదు, వారు ఎలా వివరించగలరు?
భవ-భూతి: వారికి ఏ మాత్రము అవగాహన లేదు.
ప్రభుపాద: వారు భగవద్గీతను ఏ మాత్రము తాక లేరు. వారికి అర్హత లేదు.
భవ- భూతి : వారికి అవగాహన లేదు.
ప్రభుపాద: భగవద్గీత మీద వారి ఉపన్యాసము కృత్రిమంగా ఉంటాయి.
భవ-భూతి: అవును.
ప్రభుపాద: వారు మాట్లాడలేరు, ఎందుకంటే వాస్తవమైన అర్హత, యధాతథంగా చెప్పబడినది భగవద్గీత లో, భక్తోంసి. ఒకరు ముఖ్యంగా భక్తుడై ఉండాలి అప్పుడు ఆయన భగవద్గీత అంటే ఏమిటో చెప్పగలడు.
భవ-భూతి: మాయాపూర్లో కూడా, మేము వెళ్లిన ఆ సమయంలో శ్రీధర స్వామి యొక్క ఆశ్రమంలో, ఆయన ఆంగ్లంలో ఏదో చెప్పాడు, మరెవరో ఆంగ్లంలో చెప్పాడు.వారు మీలాగా వివరించలేరు, శ్రీల ప్రభుపాద. మీరు మాత్రమే, అది మీరు ఈ జ్ఞానం మాట్లాడేటప్పుడు, ఇది వెంటనే, చెవి లోకి హృదయము లోకి ప్రవేశిస్తుంది,మరియు అప్పుడు ఇది అర్థమవుతుంది.
ప్రభుపాద: బహుశా (నవ్వుతూ).
భారతీయ వ్యక్తి: జయ. (హిందీ).
ప్రభుపాద: హరే కృష్ణ. విశాఖ, మీరు కూడా అలా భావిస్తారా?
విశాఖ: సందేహం లేకుండా.
ప్రభుపాద: (నవ్వుతున్నారు) హరే కృష్ణ