TE/Prabhupada 0862 - మీరు సమాజమును మార్చకపోతే, మీరు సామాజిక సంక్షేమం ఎలా చేస్తారు
750521 - Conversation - Melbourne
మీరు సమాజమును మార్చకపోతే, మీరు సామాజిక సంక్షేమం ఎలా చేస్తారు?
దర్శకుడు: కేవలము ఇబ్బందుల్లో ఉన్న వారిని చూసుకోవటానికి. అది మా విధానము.
ప్రభుపాద: సరే, ప్రతి ఒక్కరూ ఇబ్బందుల్లో ఉన్నారు. దర్శకుడు: ఏమిటి?
ప్రభుపాద : ప్రస్తుతము మంత్రులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు.
దర్శకుడు: అవును, కానీ అది మా పని కాదు. అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. (నవ్వు)
ప్రభుపాద: "వైద్యుడు, స్వయంగా నయం చేసుకుంటాడు." మీరు చూడండి? తాగుబోతులు కూడా ఉన్నారు, వారు స్త్రీ-వేటగాళ్ళు కూడా , మాంసం తినేవారు మరియు జూదము ఆడతారు, అంతే. వారిని సరిదిద్దాలి.
దర్శకుడు: కానీ మీరు సహాయం చేయలేరు. ఆ సమాజం... మీరు సమాజంలోకి వెళ్లి మార్పు తీసుకురావాలి, అప్పుడు సమాజం విభిన్నంగా వ్యవహరించమని మనకు చెబుతుంది.
ప్రభుపాద: లేదు, లేదు. మీరు సమాజాన్ని మార్చకుంటే తప్ప, మీరు సామాజిక సంక్షేమను ఎలా చేయగలరు? మీరు వారిని అలానే ఉంచినట్లయితే, అప్పుడు సంక్షేమము అనే ప్రశ్న ఎక్కడ ఉంది?
దర్శకుడు: ఈ పదానికి వేరే వివరణ ఇవ్వండి.
ప్రభుపాద: వివరణ... ఎలా...? నాకు ...
దర్శకుడు: ఆయన నన్ను అర్థం చేసుకున్నాడా?
ప్రభుపాద: ప్రాధమికంగా, ఒకరు మొదటి-తరగతి ఆదర్శవంతమైన మనిషిగా ఉండాలి. అది కావలసినది.
దర్శకుడు: అందువల్ల ఇది చాలా కష్టము. మీరు మీ స్వంతముగా పని చేయాలి, మీరు పని కోసం అర్హత కలిగి వున్నారని మీరు చూడాలి. మీరు తగినంత మందిని ఒప్పించగలిగితే...
ప్రభుపాద: లేదు, లేదు.మన సొంత కార్యక్రమం, ఇది ప్రజల అభిప్రాయము కాదు.మీరు మాలో తప్పును కనుగొనండి.
దర్శకుడు: ఏమిటి?
ప్రభుపాద :మా తప్పు ఏమిటో అని మీరు కనుగోనండి.
దర్శకుడు: నేను ఏ తప్పును చూడలేదు.
ప్రభుపాద: అప్పుడు మీరు విభేదిస్తున్నారు. కానీ మీరు అంతా బాగుంది అని చూస్తే, దానిని మీరు ఎందుకు అంగీకరించరు? మీరు పక్షపాతముతో ఉంటే తప్ప. దర్శకుడు: అవును నేను పక్షపాతంతో ఉన్నాను. నేను భిన్నంగా పెరిగాను.
ప్రభుపాద: అవును.మన వారి వలె ...
దర్శకుడు: మీరు నా జీవితము మీద వ్యతిరేక అభిప్రాయము కలిగి ఉన్నారు.
ప్రభుపాద: లేదు, మేము పక్షపాతముగా లేము. మనము చెప్తాము ఉదాహరణకు... మనము పక్షపాతము కలిగి లేము. మనము అనుమతిస్తున్నాం. మీరు మొదటి-తరగతి వ్యక్తులుగా ఉండాలని అనుకుంటే, మీరు పాపములు చేయకూడదు. అది మా ప్రచారము.
దర్శకుడు: కానీ నేను, ఒక ప్రజా సేవకునిగా, నేను సమాజం మార్చడానికి ఇక్కడకు రాలేదు.
ప్రభుపాద: కానీ మనము కూడా ప్రజలమే. మనము ప్రజలకు చెందుతాము. మీరు కూడా తప్పకుండా మా సేవకుడు కావాలి. దర్శకుడు: అవును. ఏమిటి?
ప్రభుపాద: మనము పబ్లిక్, పబ్లిక్ సభ్యులము . మీరు తప్పకుండా మా సేవకుడు కావాలి, మీరు పబ్లిక్ సేవకుడు అయితే.
దర్శకుడు: ఒక ప్రజా సేవకుడు, మన తత్వములో, ఒక వ్యక్తి ప్రజలచేత ఎన్నుకోబడిన మంత్రి దగ్గర పని చేస్తాడు, ఈ విధముగా ఆయన ప్రజలకు సేవ చేస్తాడు. ప్రజా నిర్ణయం ప్రకారము, ఆయన పని చేస్తాడు.
ప్రభుపాద: కాబట్టి మనము ప్రజలను సంస్కరిస్తున్నాము.
దర్శకుడు: అవును, నేను చెప్పే దానికి అర్థం అది.
ప్రభుపాద: వారు ఒక మనిషిని ఎన్నుకుంటారు...
దర్శకుడు: మీరు ప్రజలను సంస్కరించినప్పుడు, వారు విభిన్నంగా వ్యవహరించమని మనకు తెలియజేస్తారు.
ప్రభుపాద: అవును. కాబట్టి ప్రజలు అధ్యక్షుడు, నిక్సన్ ను ఎన్నుకున్నారు, వారు కలత చెందుతారు, మళ్ళీ ఆయనని క్రిందకు దింపుతారు. ఇది జరుగుతోంది.
దర్శకుడు: అవును, కానీ సమాజం పని చేసే విధానము అది. మీరు సమాజాన్ని మార్చాలని మీరు కోరుకుంటారు, మనము మార్చాలి. నన్ను చేయమని అడిగినదాన్ని నేను చేస్తాను. లేకపోతే నేను నా ఉద్యోగాన్ని కోల్పోతాను.
ప్రభుపాద: లేదు, మీరు వాస్తవమునకు కొన్ని సామాజిక సంక్షేమాలను చేయాలనుకుంటే, మీరు ఈ ప్రామాణిక సూత్రాన్ని తీసుకోవాలి. మీరు మీ సొంత మార్గాన్ని తయారు చేసుకుంటే, అది ఎప్పటికీ విజయవంతము కాదు.
దర్శకుడు: నేను ... నేను మీతో అంగీకరిస్తాను మనలో అందరూ కృష్ణ ... ఉంటే ...
ప్రభుపాద: మొత్తం కాదు. మనము... కాదు...
దర్శకుడు: అప్పుడు మనము .....
ప్రభుపాద: అప్పుడు సామాజిక సంక్షేమమునకు ఏదో వేరే అర్థం ఉంటుంది. ఉదాహరణకు మనము ఇక్కడ ప్రతిపాదిస్తున్నాము నేను ప్రతిపాదించటం లేదు - కృష్ణుడు చెప్తున్నాడు - శాంతిగా ఎలా ఉండాలి. కాబట్టి ఎలా శాంతిగా ఉండాలి? ఆయన మనస్సు ఎల్లప్పుడూ కలతగా ఉన్నట్లయితే, ఆయన ఎలా శాంతముగా ఉంటాడు?
దర్శకుడు: మీరు చెప్పినది నిజము.
ప్రభుపాద: అందువల్ల అది విజయము యొక్క రహస్యం. మీరు ప్రజలను శాంతిగా ఉంచాలని కోరుకుంటున్నారు, కానీ వారిని శాంతిగా ఎలా ఉంచాలో మీకు తెలియదు. కాబట్టి మీరు ఈ పద్దతిని తీసుకోవాలి... దర్శకుడు: అవును, మీకు అర్హత ఉన్న సమాజము ఉంది.
ప్రభుపాద: మీరు హరే కృష్ణ కీర్తన చేయండి మరియు చక్కగా కడుపు నిండా తినండి , ఇక్కడ సౌకర్యవంతంగా నివసించండి, మీరు శాంతిగా ఉంటారు. ఇది హామీ ఇవ్వబడుతుంది. ఎవరైనా ఒక పిచ్చివాడు అయినా కూడా ఈ మూడు సూత్రాలకు అంగీకరిస్తే, హరే కృష్ణ మంత్రాన్ని కీర్తన చేయనివ్వండి, మేము సిద్ధం చేసిన చక్కని ఆహారమును తీసుకోండి, శాంతిగా జీవించండి, ఆయన శాంతిగా ఉంటాడు.