TE/Prabhupada 0881 - భగవంతుడు అగోచరుడైనప్పటికీ,దృశ్యమానుడయ్యేందుకు ఆయన ఇప్పుడు కృష్ణుడుగా వచ్చాడు



730413 - Lecture SB 01.08.21 - New York


భగవంతుడు అగోచరుడైనప్పటికీ, దృశ్యమానుడయ్యేందుకు ఆయన ఇప్పుడు కృష్ణుడుగా వచ్చాడు. అనువాదం: "కాబట్టి భగవంతునికి నా వినయపూర్వక ప్రణామములు అర్పింతునుగాక, వసుదేవుని కుమారుడు, దేవకికి పరమానందాన్ని ఇచ్చినవాడు, నందుని మరియు ఇతర గోపసమూహానికి చెందిన వృందావనబాలుడు, మరియు గోవులకూ మరియు ఇంద్రియాలకూ ఆనందాన్ని ఇచ్చేవాడు."

ప్రభుపాద: కాబట్టి ప్రారంభంలో కుంతీదేవి ఇలా అన్నారు Namasye puruṣaṁ tvādyam īśvaraṁ prakṛteḥ param: ( SB 1.8.18) నేను పరమపురుషునికి నా ప్రణామములు అర్పిస్తున్నాను, ఆయన ప్రకృతేః పరమ్, ఈ భౌతిక దృశ్యమాన జగత్తుకు అతీతమైనవాడు. " కృష్ణుడు పరిపూర్ణుడు, పరమాత్మ. ఆయనకు భౌతిక శరీరం లేదు. కాబట్టి ప్రారంభంలో కుంతీదేవి మనకు ఈ అవగాహన ఇచ్చారు. భగవంతుడు, పరమ పరుషుడు ... పురుష అంటే వ్యక్తి. ఆయన నిరాకారుడు కాదు. పురుషుడు. కానీ ఆయన ఈ భౌతిక ప్రపంచానికి చెందిన పురుషుడు కాదు, అలానే ఈ భౌతిక సృష్టికి చెందిన వ్యక్తి కాదు. ఇది అర్థం చేసుకోవాలి. నిరాకారవాదులు తమకున్న కొద్దిపాటి జ్ఞానముతో ఈ విషయాన్ని గ్రహించలేరు. ఎలా పరమసత్యము ఒక వ్యక్తిగా ఎలా అవగలడు, ఎందుకంటే ఎప్పుడైతే వారు వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు, వారు ఈ భౌతిక ప్రపంచానికి చెందిన వ్యక్తి గురించి ఆలోచిస్తారు. అది వారి లోపం. కాబట్టి వారు కొద్దిపాటి జ్ఞానం కలవారు. భగవంతుడు ఈ భౌతిక ప్రపంచం యొక్క వ్యక్తిగా ఎందుకు ఉండాలి? కాబట్టి అది ప్రారంభంలో వివరించబడింది. ప్రకృతేః పరమ్, ఈ పదార్థ సృష్టికి అతీతుడు, కానీ ఆయన ఒక వ్యక్తి.

కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి, అలక్ష్యుడు అయినప్పటికీ, అగోచరుడైనప్పటికీ ఇప్పుడు, కుంతిదేవి యొక్క దయ ద్వారా, మనము అర్థం చేసుకోవచ్చు. పరమపురుషుడు అదృశ్యుడు అయినప్పటికీ, ఇప్పుడు ఆయన దృశ్యమానుడై, కృష్ణుడుగా వచ్చాడు. అందువలన ఆమె ఇలా చెబుతోంది: kṛṣṇya vāsudevāya ( SB 1.8.21) వాసుదేవ భావన . కొన్నిసార్లు నిరాకారవాదులు, వారు వాసుదేవభావన, అంటే సర్వ వ్యాపకత్వాన్ని ప్రతిపాదిస్తారు. అందువలన కుంతీదేవి తెలియజేస్తున్నారు, "ఆ వాసుదేవ కృష్ణుడు, సర్వవ్యాపి" కృష్ణుడు, ఆయన వాసుదేవ లక్షణం ద్వారా, సర్వవ్యాపియై వున్నాడు. Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe 'rjuna tiṣṭhati BG 18.61. కృష్ణుడి యొక్క ఈ లక్షణం... కృష్ణుడు, దేవాదిదేవుడు, మూడు లక్షణాలను కలిగి ఉన్నాడు: పరమపురుషుడైన కారణాన సర్వవ్యాపియైన భగవంతుడు, పరమాత్మ, మరియు నిరాకార బ్రహ్మజ్యోతి. కాబట్టి భక్తి-యోగం నందు ఆసక్తి ఉన్నవారికి, వారికి ఈ నిరాకార బ్రహ్మజ్యోతితో పనిలేదు. అది సాధారణ వ్యక్తుల కోసం. సాధారణ వ్యక్తులు. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు: ఎవరైతే సూర్య లోక నివాసులున్నారో, వారికి సూర్యరశ్మితో చేయవలసిన పనేముంది ? ఏదైతే సూర్యరశ్మి వుందో, అది వారికి అస్సలు లెక్కలేనటువంటిది. అదేవిధముగా, ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి చెందిన వారు, వారు వ్యక్తి, పరమపురుషుడు, వాసుదేవుని యందు ఆసక్తి కలిగి ఉంటారు. పురుషమ్. ఆ సాక్షాత్కారం, భగవద్గీతలో చెప్పబడినట్లు, చాలా, చాలా జన్మల తరువాత కలుగుతుంది. Bahūnāṁ janmanām ante ( BG 7.19) అనేకానేక జన్మల తర్వాత కలుగుతుంది. ఈ నిరాకారవాదులు ఎవరైతే బ్రహ్మ జ్యోతి పట్ల చాలా ఆకర్షితులై ఉన్నారో, అలాంటి వ్యక్తులు, వారిని జ్ఞానులు అని పిలుస్తారు. వారు తమ యొక్క అల్పమైన జ్ఞానం ద్వారా పరమసత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వారికి తమ జ్ఞానం చాలా అపరిపూర్ణమైనది మరియు పరిమితమైనదని తెలియదు. మరియు కృష్ణుడు, పరమసత్యము, అపరిమితుడు