TE/Prabhupada 0891 - కృష్ణుడు ఈ ప్రపంచములో మరలా ఆవిర్భవిస్తారు చాలా సంవత్సరాల తరువాత



750522 - Lecture SB 06.01.01-2 - Melbourne


కృష్ణుడు ఈ ప్రపంచములో మరలా ఆవిర్భవిస్తారు చాలా సంవత్సరాల తరువాత

ప్రభుపాద: అవును. భక్తుడు: ఎంతకాలం ముందు అని చెప్తారు కృష్ణుడు తిరిగి మానవ రూపంలో ఎప్పుడు వస్తాడు?

ప్రభుపాద: ఇప్పుడు లెక్కించండి. నేను ఇప్పటికే ఒక రోజు యొక్క సమయమును, పన్నెండు గంటలు, ఇచ్చాను, బ్రహ్మ, అనగా 4,300,000 సంవత్సరాలు అంటే వెయ్యి చేత హెచ్చ వేసిన. అది ఏమి వస్తుంది? 4,300,000 సంవత్సరాలు వెయ్యి చేత హెచ్చ వేసినప్పుడు.

భక్తులు: నాలుగు వేల, మూడువందల మిలియన్.

ప్రభుపాద: లేదు, లేదు. పరమాహంస: నాలుగు బిలియన్, మూడు వందల మిలియన్. ప్రభుపాద: అభిప్రాయము మధ్య వ్యత్యాసం. (నవ్వు)

మధుద్విస: ఆస్ట్రేలియాలో వేరుగా లెక్కిస్తారు, (నవ్వు)

ప్రభుపాద: ఏమైనా, మీ ఆస్ట్రేలియన్ గణన ఏమిటి? నాకు తెలియజేయండి. మధుద్విస: ఇది సత్యము. వారి బిలియన్ వేరే రకముగా ఉంటుంది.

ప్రభుపాద:. ఏమైనా, నేను మీకు సరైన సంఖ్యను ఇచ్చాను, నాలుగు మిలియన్ల, అమెరికన్ లేదా ఇంగ్లీష్ గణన ప్రకారం, (నవ్వు) 4,300,000 సంవత్సరాలు, దానిని వెయ్యి ద్వారా గుణించండి. అప్పుడు ఇంగ్లీష్ గణన ప్రకారం ఏమి వస్తుంది? (నవ్వు)

పరమహాంస: 4,300,000,000. ప్రభుపాద: హు్? పరమహాంస: 4,300,000,000.

ప్రభుపాద: ఇది పన్నెండు గంటలు. రాత్రికి పన్నెండు గంటలు మళ్ళీ కలపండి. అప్పుడు ఎనిమిది బిలియన్...?

పరమాహంస: 600,000,000.

ప్రభుపాద: ఈ కాలం తరువాత కృష్ణుడు వస్తాడు. (నవ్వు) ఒకరోజు, బ్రహ్మ యొక్క ఒక రోజు తర్వాత, ఆయన ఆవిర్భవిస్తాడు.

భక్తుడు (8): శ్రీల ప్రభుపాద, భగవంతుడు చైతన్య మహా ప్రభు కూడా బ్రహ్మ యొక్క ప్రతి రోజు కనిపిస్తారా?

ప్రభుపాద: అవును, కృష్ణుడిని అనుసరిస్తున్నారు. కృష్ణుడు ద్వాపర యుగములో వస్తాడు. ప్రతి యుగానికి నాలుగు కాలాలు ఉన్నాయి: సత్య, త్రేతా, ద్వాపర, కలి. కావున కృష్ణుడు ద్వాపర-యుగము చివరిలో వస్తాడు, చైతన్య మహా ప్రభు కలి యుగములో వస్తాడు. దాదాపు అదే సంవత్సరం, అదే వరుసలో. చాలా గంటలు తర్వాత సూర్యుడు కనిపించినట్లుగానే. ఇది ఇలా ఉంటుంది. సూర్యుడు అదృశ్యం కాడు. ఆకాశంలో సూర్యుడు ఇప్పటికే ఉన్నాడు. ఇది ఆస్ట్రేలియాలోని వారి యొక్క దృష్టిలో ఉండకపోవచ్చు, కానీ అది ఇతర దేశ వాసుల దృష్టిలో ఉండవచ్చు. సూర్యుడు చనిపోలేదు.

అదేవిధముగా, ఈ విశ్వంలో భ్రమణం ద్వారా అనేక సంవత్సరాలు, ఎనిమిది బిలియన్ తొమ్మిది బిలియన్ సంవత్సరాల తర్వాత కృష్ణుడు కనిపిస్తారు. తదుపరి ఆయన మరొక విశ్వమునకు వెళ్తాడు. సూర్యునిలాగా, ఆస్ట్రేలియా నుండి అదృశ్యం అయిన తరువాత, ఆయన మరొక దేశానికి వెళ్తాడు. అదేవిధముగా, కృష్ణుడు, ఈ విశ్వంలో తన పనులను ముగించిన తర్వాత, ఆయన మరొక విశ్వంలోకి వెళతాడు. ఈ విధముగా భ్రమణం ఎనిమిది మిలియన్లు తీసుకోండి, తొమ్మిది బిలియన్ సంవత్సరాలు. కేవలం ఎన్ని విశ్వాలు ఉన్నాయో ఊహించుకోండి. ఆయన 125 సంవత్సరాలు ఒక విశ్వంలో ఉంటాడు. ప్రతిదీ ఉంది, గణన, శాస్త్రములో. ఇప్పుడు మనము ఎన్ని విశ్వాలు ఉన్నాయో ఊహించగలము. అంతేకాదు, భౌతిక ప్రపంచం. అది చెప్పబడింది...

athavā bahunaitena
kiṁ jñātena tavārjuna
viṣṭabhyāham idaṁ kṛtsnam
ekāṁśena sthito jagat
( BG 10.42)

ఈ భౌతిక సృష్టి మొత్తం భగవంతుని ఆస్తి యొక్క నాలుగవ వంతు. నాలుగవ భాగం ఆ మూడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది. అది భగవంతుడు. భగవంతుడు చౌక కాదు, "నేను భగవంతుడిని!" అలాంటి చౌకైన భగవంతుడిని మనము అంగీకరించము