TE/Prabhupada 0890 - ఎంత సమయము పడుతుంది కృష్ణునికి శరణాగతి పొందాడానికి



750522 - Lecture SB 06.01.01-2 - Melbourne


ఎంత సమయము పడుతుంది కృష్ణునికి శరణాగతి పొందాడానికి?

ప్రభుపాద: అవును.

అతిథి: మీరు ఎలా అర్థము చేసుకుంటారు ఒక వ్యక్తిని ఆయన ఇలాగా చెప్తుంటే..., వారు బాధపడుతున్నారు ఎప్పుడైతే వారు వాస్తవమునకు, వారు సంతోషంగా ఉన్నాము అని చెప్పుతారో, వారు చనిపోవడానికి భయపడడము లేదు?

మధుద్విస: చనిపోవడానికి ఎవరైతే భయపడరో, ఆయన బాధపడటం లేదని చెప్తాడో, ఎలా...

ప్రభుపాద: ఆయన ఒక పిచ్చివాడు. (నవ్వు) అంతే. పిచ్చివానిని ఎవరు పట్టించుకుంటున్నారు?

భక్తుడు: కొందరు వ్యక్తులను తమ శరీరము కాదని ఒప్పించటం చాలా సులభం, కానీ వారు వారి మనస్సులు కాదని వారిని ఒప్పించడము అంత సులభం కాదు. ఏమైనా మార్గములను కలిగి ఉన్నమా...

ప్రభుపాద: అది కొంత సమయం తీసుకుంటుంది. ఎలా మీరు ఒక నిమిషములో ప్రతి ఒక్కరూ ప్రతిదీ అర్థం చేసుకుంటారు అని ఆశిస్తారు? దానికి భోధన మరియు సమయం అవసరం. ఆయన సమయం ఇవ్వడానికి సిద్ధం అయితే, అప్పుడు ఆయన గ్రహించవచ్చు, అంతే కాని ఐదు నిమిషాల్లో, పది నిమిషాలలో, ఆయన మొత్తం విషయమును అర్థం చేసుకుంటాడు, అది సాధ్యం కాదు. ఆయన వ్యాధికి గురైన వ్యక్తి. ఆయనకు చికిత్స, ఔషధం మరియు ఆహారం అవసరం. ఈ విధముగా ఆయన గ్రహించ గలడు. ఒక వ్యాధికి గురైన వ్యక్తి, ఆయనకు ఔషధం, ఆహారం మీద శ్రద్ధ లేకపోతే, అప్పుడు ఆయన బాధపడతాడు. అంతే. అవును? ఎవరైనా? లేదా?

భక్తుడు : జన్మ జన్మలుగా దుర్మార్గపు కార్యక్రమాలను చేస్తూ మనము ఇక్కడే ఉంటే, అంటే మన పాపపు ప్రతిచర్యలను ప్రక్షాళన చేసుకోవడానికి మనము పవిత్ర కార్యక్రమాలను చేస్తూ జన్మ జన్మలుగా ఇక్కడే ఉండాలి అని దీని అర్థమా?

ప్రభుపాద: హ్మ్?

మధుద్విస: "పాపములను చేస్తూ జన్మ జన్మలుగా మనము ఇక్కడే ఉన్నాం. అలాంటి పాపములను ఒక జీవితకాలంలో ప్రక్షాళన చేసుకోవడము సాధ్యమేనా లేక అనేక... అవసరమా? "

ప్రభుపాద: కేవలం ఒక్క నిమిషం. ఇది కృష్ణ చైతన్యము ఉద్యమము. ఒక్క నిమిషం. మీరు భగవద్గీత చదవడము లేదా? కృష్ణుడు చెప్పేది ఏమిటి? Sarva-dharmān parityajya mām ekam śaraṇaṁ vraja, ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣayiṣyāmi ( BG 18.66) మీరు నాకు శరణాగతి పొందండి. మీ అన్ని పనులను వదిలేయండి. వెంటనే పాపపు ప్రతిచర్యల నుండి నీకు ఉపశమనం ఇస్తాను. " కావున దీనికి కేవలం ఒకే ఒక్క నిమిషం అవసరం. నా ప్రియమైన కృష్ణా, నేను మర్చిపోయాను. ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నేను నీకు పూర్తిగా శరణాగతి పొందుతాను. అప్పుడు నీవు అన్ని పాపముల నుండి వెంటనే విడుదల చేయబడతావు . ఏమీ ఆశించకుండా, ఏ రాజకీయము లేకుండా, మీరు పూర్తిగా శరణాగతి పొందితే, కృష్ణుడు హామీ ఇస్తున్నాడు, ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣayiṣyāmi mā śucaḥ. ఆయన తిరిగి అభయము ఇస్తున్నాడు, "చింతించవద్దు నేను అన్ని ప్రతిచర్యల నుండి ఉపశమనం కలుగ చేస్తాను." మా శుచః. "పూర్తయింది, హామీ ఇచ్చారు. మీరు దీనిని చేయండి కాబట్టి కృష్ణుడికి శరణాగతి పొందాలి ఎంత సమయం అవసరం? వెంటనే మీరు చేయవచ్చు. శరణాగతి అనగా మీరు శరణాగతి పొందడము మరియు పని చేయడము, కృష్ణుడు చెప్పినట్లుగా. అది శరణాగతి పొందుట. కృష్ణుడు ఏమి చెప్తాడు? Man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65). నాలుగు విషయాలు: "మీరు ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించండి, మీరు నా భక్తుడు అవ్వండి, నీవు నన్ను పూజించండి, నీ గౌరవం, మరియు సంపూర్ణ ప్రణామములు నాకు అర్పించండి. " మీరు ఈ నాలుగు విషయాలను చేయండి. అది పూర్తి శరణాగతి. Mām evaiṣyasi asam śaya: "అప్పుడు నీవు ఎటువంటి సందేహం లేకుండా నా దగ్గరకు వస్తావు." అంతా ఉంది. కృష్ణుడు ప్రతిదీ పూర్తిగా ఇచ్చాడు. మీరు దీనిని అంగీకరిస్తే, అప్పుడు జీవితం చాలా సులభం. ఇబ్బంది లేదు.