TE/Prabhupada 0915 - సాధువు నా హృదయము, నేను కూడా సాధువు యొక్క హృదయమును
730421 - Lecture SB 01.08.29 - Los Angeles
సాధువు నా హృదయము, నేను కూడా సాధువు యొక్క హృదయమును. భక్తుడు: అనువాదము: “ ఓ దేవా, ఎవరూ మీ దివ్యమైన లీలలను అర్థం చేసుకోలేరు ఇవి భౌతికంగా అనిపించవచ్చు, తద్వారా తప్పుదోవ పట్టించును. మీకు ఏ ప్రత్యేకమైన అనుకూల విషయం లేదు, లేదా మీ వద్ద అసూయ కలిగించే విషయం లేదు. మీరు పాక్షికమని మాత్రమే ప్రజలు ఊహిస్తారు.”
ప్రభుపాద: అందువల్ల భగవద్గీతలో భగవంతుడు ఇలా చెప్పాడు: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్క్రుతాం ( BG 4.8) కాబట్టి రెండు ప్రయోజనములు. భగవంతుడు అవతరించినప్పుడు, ఆయనకు రెండు లక్ష్యములు ఉంటాయి. ఒక లక్ష్యము పరిత్రాణాయ సాధూనాం, ఇంకా వినాశాయ... విశ్వనీయ భక్తులను, సాధువులను రక్షించటం ఒక లక్ష్యం. సాధువు అంటే పవిత్రమైన వ్యక్తి.
సాధు.... నేను అనేక సార్లు వివరించాను. సాధువు అంటే భక్తుడు. సాధువు అంటే భౌతిక నిజాయితీ లేదా మోసము, నైతికత లేదా అనైతికత అని కాదు. ఇది భౌతిక కార్యక్రమాలకు సంబంధించినది కాదు. ఇది కేవలం ఆధ్యాత్మికము, సాధు. కానీ మనం కొన్ని సార్లు అనుకుంటాము, “సాధువు", ఒక వ్యక్తి యొక్క భౌతికమైన మర్యాద, నైతికత. కానీ వాస్తవానికి “సాధువు" అంటే ఆధ్యాత్మిక స్థితిలో భక్తియుత సేవలో నిమగ్నమై ఉన్నారు. సగుణాన్ సమతీత్యైతాన్ ( BG 14.26) సాధువు భౌతిక లక్షణాలకు అతీతుడు. కావున పరిత్రాణాయ సాధూనాం ( BG 4.8) అంటే ముక్తి ఇవ్వటం
ఇప్పుడు ఒక సాధువు ముక్తి చెంది ఉంటే, అతడు దివ్యమైన స్థితిలో ఉన్నాడు, అప్పుడు అతడికి ముక్తి కలిగించ వలసిన అవసరం ఏముంది? అందువలన ఇది ప్రశ్న. అందువల్ల ఈ పదం ఉపయోగించబడింది, విడంబనము. ఇది దిగ్భ్రాంతి పరచేది. ఇది విరుద్ధమైనది. ఇది విరుద్ధంగా కనిపిస్తుంది. ఒక సాధువు తరించబడి ఉంటే.... దివ్యమైన పరిస్థితి అంటే ఆయన నియంత్రణలో లేడు. సత్వ, రజస్, తమో గుణములు అను మూడు భౌతిక గుణాల్లో. ఎందుకంటే ఇది భగవద్గీతలో స్పష్టంగా పేర్కొనబడింది: సగుణాన్ సమతీత్యైతాన్ ( BG 14.26) ఆయన భౌతిక లక్షణాలను అధిగమిస్తాడు. ఒక సాధువు, భక్తుడు. అప్పుడు విముక్తి అనే ప్రశ్న ఎక్కడ వుంది? విముక్తి.... అతడికి విముక్తి అవసరం లేదు, ఒక సాధువు, కానీ అతడు భగవంతుని ముఖా ముఖి చూడటానికి ఎంతో ఆతృతగా ఉన్నాడు, అది తన అంతర్గత కోరిక, అందుచేత కృష్ణుడు వస్తాడు. విముక్తి కోసం కాదు. అతడు ఇప్పటికే తరించ బడ్డాడు. అతడు ఇప్పటికే భౌతిక కోరికల నుండి బయటపడ్డాడు. కానీ అతడిని సంతృప్తి పరచుటకు, కృష్ణుడు ఎల్లప్పుడూ.... ఒక భక్తుడు అన్ని విధాలుగా భగవంతుని సంతృప్తిపరచినట్లుగా, అలాగే, భక్తుని కంటే ఎక్కువ, భగవంతుడు భక్తుని సంతృప్తిపరచాలని కోరుకుంటున్నాడు. ఇది ప్రేమ వ్యవహారాల మార్పిడి. మీ లాగే, మన సాధారణ వ్యవహారాల్లో కూడా, మీరు ఎవరినైనా ప్రేమిస్తే, మీరు అతన్ని లేదా ఆమెను సంతృప్తి పరచాలనుకుంటారు. అదేవిధంగా, ఆమె లేదా అతడు కూడా పరస్పరం కోరుకుంటున్నారు. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ప్రేమ వ్యవహారాల అన్యోన్యత ఉంటే, అది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంత ఉన్నతంగా ఉంటుంది? కాబట్టి ఒక శ్లోకం ఉంది: “సాధువు నా హృదయం, నేను కూడా సాధువు యొక్క హృదయమును”. సాధువు ఎప్పుడూ కృష్ణుడు గురించి ఆలోచిస్తున్నాడు. కృష్ణుడు ఎల్లప్పుడూ ఆయన భక్తుడు, సాధువు గురించి ఆలోచిస్తున్నాడు.