TE/Prabhupada 0924 - కేవలం నెగటివ్ అనే దానికి అర్థం లేదు. సానుకూలత కూడా ఉండాలి



730422 - Lecture SB 01.08.30 - Los Angeles


కేవలం నెగటివ్ అనే దానికి అర్థం లేదు. సానుకూలత కూడా ఉండాలి పాపపు జీవితాన్ని పూర్తి చేసిన వ్యక్తి. Yeṣām anta-gataṁ pāpaṁ janānāṁ puṇya-karmaṇām ( BG 7.28) ఎవరు పాపాత్మకమైన జీవితాన్ని పూర్తి చేయగలరు? పవిత్ర కార్యక్రమాలలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో. ఎందుకంటే ఒకరు కార్యక్రమాలను కలిగి ఉండాలి, నిమగ్నమై ఉండాలి. ఒక వ్యక్తి పవిత్ర కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటే అప్పుడు సహజంగానే తన పాపములు అంతరించిపోతాయి. ఒక వైపు, స్వచ్ఛందంగా ఆయన పాపత్మకమైన జీవిత మూలాలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించాలి. ఇంకొక వైపు, అతడు పవిత్రమైన జీవితంలో పాల్గొనవలెను. ప్రతి ఒక్కరూ కొంత నిమగ్నత కలిగి ఉండాలి ఎందుకంటే కేవలం సిద్ధాంతపరంగా కాదు. ఎవరికైనా పవిత్రమైన నిమగ్నత లేకుంటే, అప్పుడు కేవలం సిద్ధాంతపరంగా ఆయన చెయ్యలేరు.

ఉదాహరణకు, ఆచరణాత్మకమైనది, మీ ప్రభుత్వం మిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తుంది ఈ మత్తుని నిలుపుచేయటానికి. అందరికి తెలుసు. కానీ ప్రభుత్వం విఫలమైంది. ఎలా చట్టం ద్వారా లేదా ఉపన్యాసం ద్వారా LSD లేదా మీరు మత్తు అలవాటు లేకుండా వారిని చేయగలరు? అది సాధ్యం కాదు. మీరు వారికి కొంత మంచి నిమగ్నతను ఇవ్వాలి. అప్పుడు అది సహజముగా ఉంటుంది... ఆచరణాత్మకంగా మీరు ఇక్కడకు వచ్చిన మా విద్యార్థులను చూడవచ్చు, మేము ఉపదేశము చేస్తాము: "మత్తు వద్దు." తక్షణమే వదలి వేస్తారు. ప్రభుత్వం విఫలమైంది. ఇది ఆచరణాత్మకమైనది. Paraṁ dṛṣṭvā nivartate ( BG 2.59) మీరు ఎవరికైనా మంచి నిమగ్నతను ఇవ్వకపోతే, ఆయన చెడు నిమగ్నతలను ఆపలేరు. అది సాధ్యం కాదు. అందువలన మనము రెండు వైపులా ఇస్తున్నాం - మంచి నిమగ్నతను మరియు, అదే సమయంలో నిషేధములను. మనము కేవలం చెప్పడము లేదు : "అక్రమ లైంగికత, మత్తు వద్దు, ఏదీ కాదు..." కేవలం ప్రతికూలత అంటే అర్థం లేదు. ఏదో ఒకటి సానుకూలము అయినది ఉండాలి. ఎందుకంటే ప్రతిఒక్కరూ నిమగ్నత కోరుకుంటారు. ఎందుకంటే మనం జీవులము. మనము ప్రాణము లేని రాయి కాదు.

ఇతర తత్వవేత్తలు, వారు ధ్యానం ద్వారా ప్రాణము లేని రాయి కావాలని ప్రయత్నిస్తున్నారు. నన్ను శూన్యము మరియు నిరాకారము గురించి ఆలోచించనివ్వండి. కృత్రిమంగా అది ఎలా శూన్యంగా చేయగలరు? నీ హృదయం, మీ మనస్సు పూర్తిగా కార్యక్రమాలతో నిండి ఉంది. కాబట్టి ఇవి కృత్రిమమైనవి. ఇవి మానవ సమాజానికి సహాయం చేయవు. యోగ అని పిలవబడేది, ధ్యానం అని పిలవబడేది, అవి అన్నీ మూర్ఖత్వము. ఎందుకంటే ఎటువంటి నిమగ్నత లేదు. ఇక్కడ నిమగ్నత ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉదయము అర్చామూర్తులకు ఆరతి ఇవ్వడానికి నిద్ర లేస్తారు. వారు మంచి ఆహారాన్ని తయారు చేస్తున్నారు. వారు అలంకరణ చేస్తున్నారు, దండలు తయారు చేస్తున్నారు, చాలా సేవలలో నిమగ్నము అవుతున్నారు. వారు సంకీర్తనా బృందముతో వెళుతున్నారు, పుస్తకాలను విక్రయించడం కోసం వారు ప్రచారం చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటలు సేవలో ఉంటున్నారు . అందువలన వారు ఈ పాపత్మకమైన జీవితాన్ని వదలి వేస్తున్నారు. Paraṁ dṛṣṭvā nivartate ( BG 2.59)

ఉదాహరణకు ... ఇది, ప్రతిదీ భగవద్గీతలో వివరించబడింది. ఉదాహరణకు ఆసుపత్రిలో వలె. ఆసుపత్రిలో అనేకమంది రోగులు ఉన్నారు, వారు ఏకాదశి రోజున ఏమీ తినడం లేదు. అంటే వారు ఏకాదశిని పాటిస్తున్నారు అని అర్థమా? (నవ్వు) నేను ఎప్పుడు తింటాను, నేను ఎప్పుడు తింటాను, నేను ఎప్పుడు తింటాను అని కేవలము ఆలోచిస్తున్నారు కానీ ఈ విద్యార్థులు, వారు స్వచ్ఛందంగా ఏమీ తినరు. మనము, మీరు ఏమి తిన వద్దు అని చెప్పటము లేదు. కొన్ని పండ్లు, కొన్ని పువ్వులు. అంతే. కాబట్టి paraṁ dṛṣṭvā nivartate ( BG 2.59) ఉదాహరణకు చిన్నపిల్లల వలె. వాడి చేయిలో ఏదో ఉంది; వాడు తింటున్నాడు. మీరు వాడికి మెరుగైనది ఇచ్చినట్లయితే, వాడు అధమమైనది పడేసి, ఆ మెరుగైన దానిని తీసుకుంటాడు. కావున ఇక్కడ కృష్ణ చైతన్యము ఉంది, ఈ మెరుగైన నిమగ్నత ఉంది, మెరుగైన జీవితం, మెరుగైన తత్వము, మెరుగైన చైతన్యము, ప్రతిదీ మెరుగైనది. అందువల్ల వారు జీవితములో పాపములను విడిచిపెడతారు, కృష్ణ చైతన్యములో ఉద్ధరించబడతారు.

కాబట్టి ఈ కార్యక్రమములు కేవలము మానవ సమాజంలో మాత్రమే జరుగటము లేదు. జంతు సమాజములో కూడా. జంతు సమాజం, జల, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కృష్ణునిలో భాగం, కుమారులు. కాబట్టి వారు ఈ భౌతిక ప్రపంచం లో కుళ్ళిపోతున్నారు. కాబట్టి కృష్ణుడికి ఒక ప్రణాళిక ఉంది, వారిని విముక్తులను చేయడానికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. వ్యక్తిగతంగా ఆయన వస్తాడు. కొన్నిసార్లు ఆయన తన చాలా నమ్మకమైన భక్తులను పంపుతాడు. కొన్నిసార్లు ఆయనే స్వయంగా వస్తాడు. కొన్నిసార్లు ఆయన భగవద్గీత వంటి సూచనలను ఇచ్చి ఉంటారు