TE/Prabhupada 0925 - ప్రతి ఒక్కరినీ మన్మథుడు ఆకర్షిస్తాడు. కృష్ణుడు మన్మథుడిని ఆకర్షిస్తాడు



730423 - Lecture SB 01.08.31 - Los Angeles


ప్రతి ఒక్కరినీ మన్మథుడు ఆకర్షిస్తాడు. కృష్ణుడు మన్మథుడిని ఆకర్షిస్తాడు. అనువాదం: "నా, ప్రియమైన కృష్ణా, యశోద ఒక తాడును తీసుకున్నది నిన్ను కట్టి వేయడానికి, నీవు తప్పు చేసినప్పుడు, నీ కలత చెందిన కళ్ళు కన్నీటితో వరదలా పారినవి. అవి నీ కంటి యందు ఉన్న కాటుకను కడిగినవి నీవు భయపడుతున్నావు, భయము కలిగించే వ్యక్తి కూడా నీకు భయపడతాడు. ఈ దృశ్యం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. " ప్రభుపాద: ఇది కృష్ణుని యొక్క మరొక ఐశ్వర్యము. కృష్ణుడు ఆరు రకాల సంపదలను పూర్తిగా కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ ఐశ్వర్యము సౌందర్యం, సౌందర్య ఐశ్వర్యము. కృష్ణుడికి ఆరు సంపదలు ఉన్నాయి: సర్వసంపద, సర్వబలము, సర్వకీర్తి , సర్వజ్ఞానం, సర్వసౌందర్యం, సర్వ వైరాగ్యం. కాబట్టి ఇది కృష్ణుని అందం యొక్క సంపద. కృష్ణుడు ప్రతి ఒక్కరికీ కావాలి...

ఉదాహరణకు మనము కృష్ణ భక్తితో, వినమ్రతతో పూజలు చేస్తున్నాము. కానీ కృష్ణుడి దగ్గరకు ఎవరూ రారు: కృష్ణుడు, మీరు అపరాధి. నేను నిన్ను కట్టి వేస్తాను. ఎవరూ రారు. (నవ్వు) ఇది అత్యంత ఖచ్చితమైన భక్తునికి మరొక వరము. అవును. కృష్ణుడికి అది కావాలి. ఎందుకంటే ఆయన సంపూర్ణ ఐశ్వర్యములతో ఉన్నాడు... ఇది కూడా మరొక సంపద. Aṇor aṇīyān mahato mahīyān. అతి గొప్ప దాని కంటే గొప్పది అతి చిన్నదాని కంటే చిన్నది. అది ఐశ్వర్యము.

అందువల్ల కుంతి దేవి కృష్ణుని ఐశ్వర్యము గురించి ఆలోచిస్తుంది కానీ ఆమె యశోద యొక్క స్థానమును తీసుకోవాలని ధైర్యం చేయలేదు. అది సాధ్యం కాదు. కుంతీ దేవి కృష్ణుడి అత్త అయిన్నప్పటికీ, కానీ ఆమెకు అటువంటి హక్కు లేదు... ఈ ప్రత్యేక హక్కు ముఖ్యంగా యశోదమాయికి ఇవ్వబడింది. ఎందుకంటే ఆమె ఎంతో ఉన్నతమైన భక్తురాలు కాబట్టి, ఆమెకు భగవంతుని శిక్షించటానికి హక్కు కలదు. ఇది ప్రత్యేక అర్హత. అందువల్ల కుంతీదేవి కేవలం యశోదమాయి యొక్క అర్హత గురించి ఆలోచిస్తుంది, ఎంత అదృష్టం కలిగి ఉన్నదో మరియు ఆమె ఎంత విశేషమైనదో, ఆమె భగవంతుడిని బెదిరించగలదని, భయపెట్టే వ్యక్తి కూడా ఎవరికీ భయపడతాడో, ఎవరైతే Bhīr api yad bibheti ( SB 1.8.31) ఎవరు కృష్ణుడికి భయపడరు? ప్రతి ఒక్కరూ. కానీ కృష్ణుడు యశోదామాయికి భయపడతాడు. ఇది కృష్ణుడి యొక్క గొప్పతనము. ఉదాహరణకు కృష్ణుడికి మరో నామము మదన-మోహన. మదన అంటే మన్మథుడు. ప్రతి ఒక్కరిని మన్మథుడు ఆకర్షిస్తాడు. మన్మథుడు. కృష్ణుడు మన్మథుడిని ఆకర్షిస్తాడు అందువలన ఆయన నామము మదన-మోహన. ఆయన చాలా అందంగా ఉంటాడు మన్మథుడు కూడా ఆయనచే ఆకర్షించ బడతాడు. కానీ మరో వైపు, కృష్ణ, ఆయన చాలా అందమైనవాడు, ఆయన మన్మథుడిని కూడా ఆకర్షించేవాడు, అయినప్పటికీ ఆయన శ్రీమతి రాధారాణిచే ఆకర్షించబడతాడు. అందువలన శ్రీమతి రాధారాణి నామము మదన-మోహన-మోహినీ. కృష్ణుడు మన్మథుడిని ఆకర్షించ గలడు, రాధారాణిని ఆ ఆకర్షించే వాడిని ఆకర్షిస్తుంది కాబట్టి ఇవి కృష్ణ చైతన్య జ్ఞానములో ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక అవగాహన. ఇది కల్పన లేదా ఉహాగానము కాదు, కల్పితము కాదు. ఇవి వాస్తవాలు. ఇవి వాస్తవాలు. ప్రతి భక్తుడు ఆయన పవిత్రుడు అయితే అలాంటి అర్హతలను కలిగి ఉంటాడు.మీరు కనుక...

మీరు అనుకోవద్దు యశోదమ్మకు ఇచ్చిన అర్హత... సరిగ్గా అలాంటిది కాకపోతే, ప్రతి ఒక్కరూ ఆ అర్హతను కలిగి ఉంటారు. మీరు మీ బిడ్డను కృష్ణుడి వలె ప్రేమించినట్లయితే, అప్పుడు మీరు అలాంటి అర్హతను కలిగి ఉంటారు. ఎందుకంటే తల్లికి ఉంది ... ఎందుకంటే తల్లి చాలా ప్రేమిస్తుంది. ఎవరూ... ఈ భౌతిక ప్రపంచంలో, తల్లి ప్రేమకు పోలిక లేదు. ఏమీ ఎదురు ఆశించకుండా. ఈ భౌతిక ప్రపంచంలో కూడా. తల్లి ఏమి ఎదురు ఆశించకుండా సాధారణంగా బిడ్డను ప్రేమిస్తుంది. ఈ భౌతిక ప్రపంచము ఎంతగా కలుషితమైనదీ అంటే, అయినప్పటికీ కొన్నిసార్లు తల్లి ఆలోచిస్తుంది: పిల్లవాడు పెరుగుతాడు. ఆయన గొప్ప మనిషిగా అవుతాడు. వాడు డబ్బు సంపాదిస్తాడు, నేను పొందుతాను. అయినప్పటికీ కొంత ఆశించే భావనలు ఉన్నాయి కానీ కృష్ణుడిని ప్రేమించేటప్పుడు, అటువంటి ఆశించే భావనలు లేవు. దీనిని అనన్యమైన ప్రేమ అని పిలుస్తారు. Anyābhilāṣitā-śūnyam (Bhakti-rasāmṛta-sindhu 1.1.11), అన్ని భౌతికలాభాల నుండి స్వేచ్చను పొందటము