TE/Prabhupada 0927 - కృష్ణుడిని మీరు ఎలా విశ్లేషిస్తారు ఆయన అపరిమితమైనవాడు. అది అసాధ్యం



730423 - Lecture SB 01.08.31 - Los Angeles


కృష్ణుడిని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఆయన అపరిమితమైనవాడు. అది అసాధ్యం కాబట్టి ఎవరైతే కృష్ణుడిని మొదట విశ్లేషించాలి అని ఆలోచిస్తున్నవారు, ఆయన భగవంతుడా కాదా, వారు మొదటి తరగతి భక్తులు కాదు. కృష్ణుడి పట్ల సహజమైన ప్రేమను కలిగి ఉన్న వారు, వారు మొదటి తరగతి భక్తులు. మీరు ఎలా కృష్ణుడిని విశ్లేషించగలరు? ఆయన అపరిమితమైనవాడు. అది అసాధ్యం. కాబట్టి ఇది కర్తవ్యము... మనము కృష్ణుణ్ని విశ్లేషించటానికి ప్రయత్నించకూడదు. అది అసాధ్యం. మనకు పరిమిత అవగాహన ఉంది, మన ఇంద్రియాలు పరిమిత శక్తిని కలిగి ఉన్నాయి. మనము కృష్ణుడిని గురించి ఎలా అధ్యయనం చేస్తాము? ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. కృష్ణుడు తనను తాను వెల్లడిచేసినది, అది సరిపోతుంది.ప్రయత్నించ వద్దు. అది కాదు...

నేతి నేతి . ఉదాహరణకు మాయావాదుల వలె, వారు భగవంతుడిని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు. భగవంతుడు ఎవరు నేతి , ఇది కాదు. వారు కేవలం "ఇది కాదు." వారి తత్వము "ఇది కాదు" అనే దాని మీద ఆధారపడి ఉంది. అది ఏమిటో వారికి తెలియదు. శాస్త్రవేత్తలు అని పిలవబడే వారు కూడా, వారు అంతిమ కారణం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ వారి పద్ధతి "ఇది కాదు." అంతే. వారు ఎంత అభివృద్ధి సాధిస్తున్నా వారు కనుగొంటున్నారు "ఇది కాదు" అది ఏమంటే, వారు ఎన్నటికీ కనుగొనలేరు. వారు ఎన్నడూ కనుగొనలేరు. వారు చెప్పవచ్చు "ఇది కాదు," అని చెప్పవచ్చు, కానీ అది ఏమిటంటే, అది సాధ్యం కాదు. అది సాధ్యం కాదు.

panthās tu koṭi-śata-vatsara-sampragamyo
vāyor athāpi manaso muni-puṅgavānām
so 'pyasti yat prapada-sīmny avicintya-tattve
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
(BS 5.34)

కాబట్టి కృష్ణుడి గురించి ఏమి మాట్లాడతాము,ఈ పదార్ధాన్ని గురించి కూడా మాట్లాడలేము. వారు చంద్ర లోకమునకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి అది ఏమిటో వారికి తెలియదు. వాస్తవమునకు, అప్పుడు వారు ఎందుకు తిరిగి వస్తున్నారు? వారికి సంపూర్ణంగా తెలిసినట్లయితే, అది ఏమిటో అని, అప్పుడు వారు ఇప్పటికే, ఈ సమయానికి అక్కడే నివసిస్తూ ఉండేవారు. వారు గత ఇరవై సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. కేవలం వారు చూస్తున్నారు: "ఇది కాదు. అక్కడ జీవులు లేరు అక్కడ మనము నివసించే అవకాశం లేదు. "చాలా వీలు కాదు" అని అంటున్నారు అవును ఏమిటి? కాదు, వారికి తెలియదు. ఇది కేవలం ఒక లోకము లేదా ఒక నక్షత్రం. చంద్రుని లోకము ఒక నక్షత్రముగా తీసుకోబడింది. శాస్త్రవేత్తలు, వారు చెప్తారు, నక్షత్రాలు అన్నీ సూర్యుడులు, కానీ మన సమాచారం ప్రకారం, భగవద్గీతలో: nakṣatrāṇām yatha śaśī. శశి అంటే చంద్రుడు చాలా నక్షత్రాల వలె ఉంటుంది. కాబట్టి చంద్రుని పరిస్థితి ఏమిటి? చంద్రుడు కాంతి వంతముగా ఉన్నాడు ఎందుకనగా సూర్య కాంతి వలన ప్రతిబింబిస్తుంది. కాబట్టి మన గణన ప్రకారం సూర్యుడు ఒకటి. కానీ ఆధునిక శాస్త్రవేత్తలు చాలా సూర్యుడులు, నక్షత్రాలు ఉన్నాయని చెపుతారు. మనము అంగీకరించడము లేదు. ఇది కేవలం ఒక విశ్వం. అనేక సూర్యుడులు ఉన్నాయి, అసంఖ్యాకంగా, కానీ ప్రతి ఒక సూర్యుడు లో, ప్రతి విశ్వములో, ఒక సూర్యుడు ఉన్నాడు, అనేకము కాదు. కాబట్టి ఈ విశ్వం, మనం అనుభూతి చెందుతున్నది, అనుభూతి చెందుతున్నాము అసంపూర్ణంగా చూడటం ద్వారా... మనకు తెలియదు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మనము లెక్కించలేము, ఎన్ని లోకములు ఉన్నాయి. అది అసాధ్యం. కాబట్టి మన ముందు ఉన్న భౌతిక వస్తువులను, ఇప్పటికీ మనము లెక్కించలేము, అర్థం చేసుకునేందుకు, ఈ విశ్వాన్ని సృష్టించిన భగవంతుని గురించి ఏమి చెప్పాలి? అది సాధ్యం కాదు.

అందువలన బ్రహ్మ సంహితలో ఇలా చెప్పబడింది: panthās tu koṭi-śata-vatsara-sampragamyaḥ (BS 5.34). Panthās... Koṭi-śata-vatsara. ఆకాశము అపరిమితంగా ఉంది. ఇప్పుడు మీరు మీ విమానం లేదా స్పుత్నిక్ లేదా క్యాప్సూల్ ను తీసుకుంటారు... వారు చాలా విషయాలు కనుగొన్నారు. మీరు వెళ్తూ ఉండండి. ఇప్పుడు ఎన్ని గంటలు, రోజులు లేదా సంవత్సరాలు కొనసాగుతారు? కాదు Panthās tu koṭi-śata-vatsara.. లక్షలాది సంవత్సరాలు, కోటి-శత- వత్సరాలు, మీ వేగంతో వెళ్తూ ఉండండి. Panthās tu koṭi-śata-vatsara-sampragamyaḥ. నేను ఎలా వెళ్తాను? ఇప్పుడు గాలి యొక్క వేగముతో నడుస్తున్న విమానంలో. ఈ వేగముతో కాదు, ఈ వేగముతో కాదు, గంటకు 500 మైళ్ళు లేదా 1000 మైళ్ళు. కాదు. గాలి యొక్క వేగం ఎంత?

స్వరూప దామోదర: సెకనుకు 196,000 మైళ్లు. ప్రభుపాద: సెకనుకు 96 మైళ్లు. ఇవి వేదముల సాహిత్యంలో ప్రస్తావించబడ్డాయి, మీరు ఈ వేగముతో వెళ్ళితే, గాలి వేగముతో, సెకనుకు 96,000 మైళ్లతో వెళితే... కావున గాలి వేగం ఏమిటో ఊహించుకోండి. కావున panthās tu koṭi-śata-vatsara-sampragamyo vāyor athāpi (BS 5.34). గాలి వేగముతో నడుస్తున్న విమానములో. ఆ వేగముతో, మిలియన్ల సంవత్సరాలు. అప్పుడు మళ్ళీ గాలి వేగమే కాకుండా మనస్సు యొక్క వేగముతో అని సూచించారు