TE/Prabhupada 0928 - కృష్ణుడి కోసం మీ నిష్కల్మషమైన ప్రేమను పెంచుకోండి. అది జీవితపు పరిపూర్ణత
730423 - Lecture SB 01.08.31 - Los Angeles
కృష్ణుడి కోసం మీ నిష్కల్మషమైన ప్రేమను పెంచుకోండి. అది జీవితపు పరిపూర్ణత ప్రభుపాద: మనస్సు మీరు చెయ్యగలరు , అందరికి, మనకు తెలుసు, మనస్సు యొక్క వేగము ఏమిటి అనేది. ఒక సెకనులో పదివేల భాగములో కూడా, మీరు లక్షలాది మైళ్ళు వెళ్ళవచ్చు. మనస్సు వేగం. ఇది చాలా వేగవంతమైనది. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, లక్షలాది మైళ్ళ దూరంలో ఉన్న దేనినైన మీరు చూసారు అని అనుకుందాం, మైళ్ళ దూరంలో, మీరు వెంటనే చేయగలరు... మీ మనస్సు వెంటనే వెళ్ళుతుంది. కాబట్టి ఈ రెండు ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. అవి ఎంత శాస్త్రీయంగా ఉన్నాయో చూడండి. ఈ మూర్ఖులు వారు అప్పుడు అంత ఉన్నతి సాధించిన మనస్సు లేదా అధునాతనమైన శాస్త్రవేత్తలు లేరు అని చెప్తారు. అప్పుడు ఈ పదాలు ఎక్కడ నుండి వచ్చినవి? గాలి యొక్క వేగం, మనస్సు యొక్క వేగం. వారు కొన్ని ప్రయోగాలు చేసి ఉంటే తప్ప, కొంత జ్ఞానము ఎందుకు, ఎలా ఈ పుస్తకాలు వ్రాయబడ్డాయి?
కాబట్టి panthās tu koṭi-śata-vatsara-sampragamyo vāyor athāpi manasaḥ (BS 5.34). వేగం, వేగవంతమైన విమానాలు ఎలా తయారు చేయబడతాయి? ముని-పుంగవానామ్. గొప్ప శాస్త్రవేత్తలు గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తులు. ద్వారా, వారి ద్వారా తయారు చేయబడినవి. కాబట్టి ఇది పరిపూర్ణతనా? లేదు, కాబట్టి 'pyasti yat prapada-sīmny avicintya-tattve అయినా మీరు ఈ సృష్టి ఏమిటి అని గ్రహించలేని అవగాహనలోనే ఉంటారు. అయినప్పటికీ, మీరు ఈ వేగంతో వెళ్ళగలిగే ఉన్నతి సాధించినా మీరు గొప్ప శాస్త్రవేత్త తెలివి కలిగిన వారు మరియు తత్వవేత్త అయితే, అయినప్పటికీ మీరు అదే స్థితిలో ఉంటారు, మీకు తెలియదు. అయినప్పటికీ.
మనము కృష్ణుడిని ఎలా అధ్యయనం చేస్తాం? కృష్ణుడు ఈ అన్ని విషయాలను సృష్టించాడు. మీరు కృష్ణుడు సృష్టించిన విషయములనే అర్థం చేసుకోలేకపోతే, మీరు కృష్ణుడిని ఎలా అర్థం చేసుకోగలరు? ఇది అసలు సాధ్యమే కాదు. ఇది సాధ్యం కాదు. అందువల్ల వృందావన స్థితిలో మనస్సు ఉండడము భక్తులకు పరిపూర్ణత. కృష్ణుని అర్థం చేసుకునే పనే వారికి లేదు. వారు కృష్ణుడిని ఇష్టపడాలి అనుకుంటారు, ఏ షరతులు లేకుండా. ఎందుకనగా కృష్ణుడు భగవంతుడు, అందుచేత నేను ప్రేమిస్తాను... వారి మనస్తత్వం అలాంటిది కాదు. కృష్ణుడు భగవంతునిగా వృందావనములో వ్యక్తమవ్వడు. అక్కడ సాధారణ గోప బాలునిగా ఆయన ఆడుతున్నారు. కానీ కొన్నిసార్లు, ఆయన భగవంతునిగా సర్వోత్కృష్టమైన వ్యక్తి అని రుజువు చేస్తున్నాడు. కానీ వారు తెలుసుకోవడానికి పట్టించుకోరు. కాబట్టి వృందావనము వెలుపల... ఉదాహరణకు కుంతీదేవి వలె . కుంతీదేవి వృందావన నివాసి కాదు. ఆమె హస్తినాపుర నివాసి, వృందావనము వెలుపల. బయట భక్తులు, వృందావనము వెలుపల ఉన్న భక్తులు, వారు వృందావనములోని నివాసులను అధ్యయనము చేస్తున్నారు, వారు ఎంత గొప్పవారు అని. కానీ వృందావనములోని నివాసులు, కృష్ణుడు ఎంత గొప్పవాడని వారు పట్టించు కోరు. అది తేడా. మన కర్తవ్యము కేవలం కృష్ణుడిని ప్రేమించడము ఎంతగా మీరు కృష్ణుడిని ప్రేమిస్తే, మీరు అంత సంపూర్ణము అవుతారు. కృష్ణుడు ఎలా సృష్టించాడో అని అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. విషయాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి. కృష్ణుడు భగవద్గీతలో స్వయముగా చాలా వివరిస్తున్నాడు. కృష్ణుడిని తెలుసుకొనేందుకు చాలా బాధపడకండి. అది సాధ్యం కాదు. మీరు కృష్ణుని మీద మీ నిష్కల్మషమైన ప్రేమను పెంచుకోండి. ఇది జీవితం యొక్క పరిపూర్ణత.
చాలా ధన్యవాదాలు.
భక్తులు: హరే కృష్ణ, జయ!