TE/Prabhupada 0929 - స్నానము చేయడము, ఇది కూడా ఆచరణలో లేదు. బహుశా ఒక వారములో ఒకసారి

From Vanipedia


స్నానము చేయడము, ఇది కూడా ఆచరణలో లేదు. బహుశా ఒక వారములో ఒకసారి
- Prabhupāda 0929


730424 - Lecture SB 01.08.32 - Los Angeles


స్నానము చేయడము, ఇది కూడా ఆచరణలో లేదు. బహుశా ఒక వారములో ఒకసారి అనువాదము: "పవిత్రమైన రాజుల యశస్సు వృద్ధి చేయుట కొరకు జన్మలేని మీరు జన్మించారని కొందరు చెప్తారు ఇంకొందరు చెప్తారు మీ ప్రియ భక్తులలో ఒకడైన యదు రాజును సంతోష పరచడానికి జన్మించినట్లు చెప్తారు. మలయపర్వతాలలో చందనవృక్షము వలె మీరు ఆయన కుటుంబంలో మీరు కనిపిస్తారు."

ప్రభుపాద: అందువల్ల రెండు మలయాలు ఉన్నాయి. ఒకటి మలయా పర్వతం మరియు ఒకటి, ఈ మలయా... ఇప్పుడు ఇది మలేషియా అని పిలువబడుతుంది పూర్వము, ప్రపంచంలోని ఈ భాగంలో, మలేషియా, వారు పెద్ద ఎత్తున చందనమును పండించేవారు. ఎందుకంటే 5,000 సంవత్సరాల క్రితం, చందనము కోసం మంచి డిమాండ్ ఉంది. ప్రతి వ్యక్తి చందనపు గుజ్జు ను వాడాలి. ఎందుకంటే భారతదేశంలో, ఇది ఉష్ణమండల దేశం. కావున ఇది ఒక మంచి అంగరాగము చందనం కాస్మటిక్. అయినప్పటికీ, వేసవి కాలంలో చాలా వెచ్చని రోజులలో కొనగలిగిన వారు, మీరు మీ శరీరం మీద చందనమును పూసుకుంటే మీకు వెచ్చగా ఉండదు. అది చల్లగా ఉంటుంది.

అవును. ఇది పద్ధతి... ఇప్పటికీ ఇది జరగుతోంది, కానీ చాలా తక్కువ స్థాయిలో ఉంది. ప్రతి ఒక్కరూ, స్నానం చేసిన తర్వాత, ఆయన శరీరము మీద చందనమును అద్దుకోవాలి. ఇది శరీరమును రోజు మొత్తము చక్కగా, చల్లగా ప్రశాంతముగా ఉంచుతుంది. కాబట్టి అది కాస్మెటిక్. చందనం అంగరాగము. ఇప్పుడు, కలి యుగంలో... ఇది ప్రసాదంగా పిలువబడుతుంది. ఉదాహరణకు ప్రతి దేశములో, స్నానం చేసిన తరువాత పద్ధతి, మీరు మీ జుట్టును అలంకరించుకుంటారు, ఏదో సువాసన వచ్చే దానిని ఉపయోగిస్తారు. కాబట్టి భారతదేశంలో ఇది పద్ధతి, అది స్నానం చేసిన తరువాత, తిలకము పెట్టుకొని, భగవంతుని గదికి వెళ్లి, ప్రణామములు చేస్తారు తరువాత ప్రసాదము, చందన-ప్రసాదము భగవంతుని గది నుండి తీసుకోబడుతుంది మరియు అది ఉపయోగించబడుతుంది. దీనిని prasādhanam అని అంటారు. కలి-యుగములో, అది చెప్పబడింది: snānam eva hi prasādhanam ఎవరైనా చక్కగా స్నానం చేయగలిగితే, అది snānam eva hi prasādhanam. అంత మటుకే. ఈ కాస్మెటిక్ అంగరాగము లేదా చందనపునూనె లేదా గులాబీ సువాసన లేదా గులాబీ నీరు ఇంక అవసరము లేదు. ఇవి పూర్తయ్యాయి. ఆ snānam eva prasādhanam ( SB 12.2.5) కేవలం స్నానం చేయడం ద్వారా...

నేను భారతదేశంలో ఉన్నప్పుడు, ప్రారంభంలో, కావున... స్నానము చేయడము చాలా సాధారణ విషయము. ఎందుకంటే పేదవాడు కూడా ఉదయాన్నే స్నానము చేస్తాడు కానీ వాస్తవమునకు నేను మీ దేశానికి వచ్చినప్పుడు స్నానం చేయడం కూడా కష్టమైన విషయము. (నవ్వు) స్నానము చేయడము, ఇది కూడా ఆచరణలో లేదు. బహుశా ఒకసారి ఒక వారములో. భారతదేశములో మనము ఒక రోజులో మూడుసార్లు చేయడానికి అలవాటు పడ్డాము. న్యూయార్క్ లో నేను చూసాను స్నేహితుడి ఇంటికి కొందరు స్నేహితులు వస్తుండేవారు, ఎందుకంటే షవర్ స్నానం చేయడానికి కొందరికి ఏ సౌకర్యము ఉండదు. కాబట్టి స్నేహితుని ఇంటికి వచ్చే వారు. అవునా కాదా? నేను దానిని చూశాను. కాబట్టి కలి-యుగము యొక్క లక్షణాలు వివరించబడ్డాయి స్నానము చేయడము కూడా చాలా కష్టముగా ఉంటుంది అని.Snānam eva hi prasādhanam.

మరియు dākṣyaṁ kuṭumba-bharaṇam. Dākṣyam. దాక్ష్యం అంటే అర్థం, తన పవిత్ర కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందినవాడు. ఆయనను దాక్ష్యం అని పిలిచేవారు. దాక్ష్యం , ఈ పదం దక్ష నుండి వచ్చింది. దక్ష అంటే నిపుణుడు. కావున dākṣyaṁ kuṭumba-bharaṇam కలి యుగములో, ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని పోషించగలిగితే... కుటుంబము అంటే భార్య మరియు కొందరు పిల్లలు, లేదా ఒకటి లేదా ఇద్దరు పిల్లలు. దానిని కుటుంబము అని పిలుస్తారు. కానీ కుటుంబము అంటే భారతదేశంలో అలా కాదు. కుటుంబము అంటే ఉమ్మడి కుటుంబము. ఉమ్మడి కుటుంబం, తండ్రి, కుమారులు, మేనల్లుళ్ళు, సోదరి, భర్తలతో కలిపి. వారు కలిసి ఉంటారు. దీనిని ఉమ్మడి కుటుంబం అని పిలుస్తారు. కానీ కలి యుగములో, కుటుంబాన్ని పోషించడము కూడా కష్టంగా ఉంటుంది. ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పోషించగలిగితే...

న్యూయార్క్లో నేను అక్కడ ఉన్నప్పుడు, ఒక వృద్ధ మహిళ వచ్చేది. కాబట్టి ఆయనకు, ఆమెకు ఎదిగిన కుమారుడు ఉన్నాడు. కాబట్టి నేను ఆమెను ఇలా అడిగాను: "మీ కొడుకుకు ఎందుకు పెళ్లి చేయడములేదు?" అవును, ఆయన కుటుంబాన్ని పోషించగలిగితే అతడు పెళ్లి చేసుకోవచ్చు. నాకు తెలియదు, ఇక్కడ కుటుంబమును పోషించడము అనేది కష్టమైన పని అని. నాకు ఆ సంగతి తెలియదు. కాబట్టి ఇవి భాగవతములో వివరించబడ్డాయి. ఒక వ్యక్తి కుటుంబాన్ని పోషించగలిగినట్లయితే, ఓ, ఆయన చాలా గొప్ప వాడు. ఓ, అతడు అయిదుగురిని పోషిస్తున్నాడు. (?) అమ్మాయికి ఒక భర్త ఉంటే, ఆమెను చాలా అదృష్ట వంతురాలుగా భావిస్తారు. వాస్తవానికి ఈ విషయాలు ఉన్నాయి.