TE/Prabhupada 0941 - మా విద్యార్థుల్లో కొందరు, 'నేను ఈ సంస్థలో ఎందుకు పనిచేయాలి' అని ఆలోచిస్తారు



730427 - Lecture SB 01.08.35 - Los Angeles


మా విద్యార్థుల్లో కొందరు, 'నేను ఈ సంస్థలో ఎందుకు పనిచేయాలి?' అని ఆలోచిస్తారు కాబట్టి, ఈ భౌతిక ప్రపంచంలో, asmin bhave, bhave 'smin, saptame adhikāra. Asmin, ఈ భౌతిక ప్రపంచంలో. Bhave 'smin kliśyamānānām. ప్రతిఒక్కరూ... ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క జీవి కష్టపడి పని చేస్తున్నాడు కష్టమైనదా లేదా సులభామైనదా, అది పట్టింపు లేదు; ఒకరు పనిచేయాలి. ఇది పట్టింపు లేదు. ఉదాహరణకు మనము పని చేస్తున్నట్లుగానే. ఇది సులభముగా ఉండవచ్చు, కానీ ఇది కూడా పనే. కానీ అది సాధన చేయడము; అందువలన ఇది పని. మనము ఈ పనిని తీసుకోకూడదు. భక్తి వాస్తవమునకు ఫలాపేక్ష కార్యక్రమాలు కాదు. ఇది ఇలా కనిపిస్తుంది. ఇది కూడా పని చేస్తుంది. కానీ మీరు భక్తియుక్త సేవలో నిమగ్నమైతే మీరు అలసిపోరు. భౌతిక పని, మీరు అలసిపోతారు. అది వ్యత్యాసం, ఆచరణాత్మకమైనది. భౌతికముగా, మీరు ఒక సినిమా పాట చూసి పాడుతూ ఉంటే, అరగంట తరువాత మీరు అలసిపోతారు. హరే కృష్ణ, ఇరవై అయిదు గంటల కీర్తన చేస్తూ ఉండండి, మీరు అలసిపోరు అవునా కాదా? ఆచరణాత్మకంగా చూడండి. మీరు ఒక వ్యక్తి యొక్క భౌతిక పేరుని తీసుకుంటే, "మిస్టర్ జాన్, మిస్టర్ జాన్, మిస్టర్ జాన్," ఎన్ని సార్లు మీరు కీర్తన చేస్తారు? (నవ్వు) పది సార్లు, ఇరవై సార్లు, పూర్తి అయింది కానీ కృష్ణా? "కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా," మీరు కీర్తన చేస్తూ ఉంటే మరింత శక్తి పొందుతారు అది తేడా. కానీ వారు మూర్ఖులు, వారు ఆలోచిస్తారు వారు కూడా మన లాగా పని చేస్తున్నారు, వారు కూడా మనలా చేస్తున్నారు. లేదు, అది కాదు.

అయితే వారు.. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, భౌతిక ప్రకృతి అంటే అర్థం ఎవరైనా ఈ భౌతిక ప్రపంచములోనికి వస్తే ఇక్కడ రావడము మన కర్తవ్యము కాదు, కానీ ఇక్కడకు రావాలని మనము కోరుకుంటున్నాము. ఇది కూడా ఇక్కడ పేర్కొనబడింది. Kliśyamānānām avidyā-kāma-karmabhiḥ. ఎందుకు వారు ఇక్కడకు వచ్చారు? విద్య లేదు. అవిద్య అనగా అజ్ఞానం. ఆ అజ్ఞానం ఏమిటి? కామ. కామ అంటే కోరిక. వారు కృష్ణుడికి పనిచేయడానికి ఉద్దేశించబడినారు, కానీ వారు "నేను ఎందుకు కృష్ణుడికి సేవ చేయాలి? నేను కృష్ణుడు అవుతాను. "ఇది అవిద్య, ఇది అవిద్య. సేవ చేసే బదులుగా... అది సహజమైనది. కొన్నిసార్లు ఇది వస్తుంది, ఆయన ఒక సేవకుని వలె ఆయన గురువుకు పనిచేస్తున్నారు. ఆయన ఇలా ఆలోచిస్తున్నాడు, "నేను ఇంత డబ్బును పొందగలిగితే, అప్పుడు నేను గురువును అవ్వవచ్చు." అది అసహజమైనది కాదు. కాని, జీవి ఆలోచిస్తే... ఆయన కృష్ణుడి నుండి వస్తున్నాడు. Kṛṣṇa, Kṛṣṇa bhuli' jīva bhoga-vāñchā kare. ఆయన కృష్ణుడిని మరచిపోయినప్పుడు, అంటే, నేను చెప్పేది భౌతిక జీవితము గురించి అది భౌతిక జీవితం. ఒకరు కృష్ణుడిని మరచిపోయిన వెంటనే. మనము చూసేటప్పుడు, చాలామంది... చాలా మంది, మా విద్యార్థుల్లో కొందరు, వారు ఈ సంస్థలో నేను ఎందుకు పని చేయాలి? అని ఆలోచిస్తుంటారు ఓ, నన్ను వెళ్ళి పోనివ్వండి. "ఆయన వెళ్తాడు, కానీ ఆయన ఏమి చేస్తాడు? ఆయన ఒక మోటారు డ్రైవర్ అవుతాడు, అంతే. బ్రహ్మచారి, సన్యాసీ, వలె గౌరవము పొందే బదులుగా ఆయన, ఆయన, ఆయన కేవలం సాధారణ ఉద్యోగి వలె పని చేయవలసి వస్తుంది