TE/Prabhupada 0942 - కృష్ణుడిని మర్చిపోవడం ద్వారా అనవసరమైన సమస్యలను సృష్టించాము



730427 - Lecture SB 01.08.35 - Los Angeles


కృష్ణుడిని మర్చిపోవడం ద్వారా అనవసరమైన సమస్యలను సృష్టించాము కాబట్టి, avidyā-kāma-karmabhiḥ. కామ. కామ అంటే కోరిక. ఉదాహరణకు చాలా మంది శాస్త్రవేత్తలు వారు కొత్త ఆహారము కొరకు పరిశోధిస్తున్నారు, ఉదాహరణకు మన శాస్త్రవేత్త స్నేహితుడు ఈ ఉదయం మాట్లాడుతున్నాడు. అప్పుడు కొత్త ఆహారం ఏమిటి? ఆహారం ఇప్పటికే ఉంది, కృష్ణుడిచే కేటాయించబడినది , మీరు "ఈ జంతువు, మీ ఆహారం ఇది, మీరు ఈ జంతువు, మీ ఆహారం ఇది." కావున, మానవుని వరకు వారి ఆహారం కూడా నిర్ణయించబడినది, అది మీరు ప్రసాదం తీసుకోవాలి Patraṁ puṣpaṁ phalaṁ toyaṁ yo me bhaktyā prayacchati ( BG 9.26) ప్రసాదమును అంగీకరించడము మనిషి యొక్క బాధ్యత. ప్రసాదము అంటే కృష్ణుడికి అర్పించిన ఆహార పదార్థాలు. ఇది నాగరికత. మీరు చెప్తే, "నేను ఎందుకు అర్పించాలి?" అది అనాగరికం. ఇది కృతజ్ఞత. మీరు కృష్ణుడికి అర్పిస్తే, అప్పుడు మీరు చైతన్యములో ఉంటారు ఈ ఆహార పదార్థాలు, ఈ ధాన్యాలు, ఈ పండ్లు, ఈ పువ్వులు, ఈ పాలు, ఇది కృష్ణుడిచే ఇవ్వబడింది. నేను దానిని ఉత్పత్తి చేయలేను. నా కర్మాగారంలో ఈ అన్ని అంశాలను నేను ఉత్పత్తి చేయలేను. మనము ఉపయోగిస్తున్న దేనినైనా, ఎవరూ ఉత్పత్తి చేయలేరు, అది కృష్ణుడిచే ఇవ్వబడింది. Eko bahūnāṁ yo vidadhāti kāmān. ఈ కామాన్ . మనము కోరుకుంటున్నాము మరియు కృష్ణుడు సరఫరా చేస్తున్నారు. ఆయన సరఫరా చేయకుండా మీరు దాన్ని పొందలేరు. ఉదాహరణకు మన భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నాయకులు ఇలా అనుకున్నారు: ఇప్పుడు మనము స్వాతంత్ర్యం పొందాము, మనము ట్రాక్టర్లను పెంచుదాము ఇతర వ్యవసాయ ఉపకరణాలను మరియు మనము తగినంత ఆహారం పొందుతాము." ఇప్పుడు ప్రస్తుత క్షణం, రెండు సంవత్సరాల నుండి, నీటి కొరత ఉంది. వర్షపాతం లేదు. కాబట్టి ఈ ట్రాక్టర్లు ఇప్పుడు ఏడుస్తున్నాయి. మీరు చూడండి? ఇది నిరుపయోగం. కేవలం కృష్ణుడి అనుగ్రహము లేకపోతే, కేవలం ట్రాక్టర్లు అని పిలిచే వాటితో, పనిముట్లతో, మీరు ఉత్పత్తి చేయలేరు. ఆయన నీటిని సరఫరా చేయాలి, దాని వలన... ఇటీవలే వార్తలు, ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, వారు కార్యదర్శి దగ్గరకు వెళ్లారు , వారు ఆహారాన్ని డిమాండ్ చేశారు, ఫలితంగా వారు షూట్ చేయబడ్డారు, కాల్చివేయబడ్డారు. అవును, చాలా మంది చనిపోయారు. కాబట్టి వాస్తవానికి, మనము ఈ ఏర్పాటు ఉన్నా ఒకరు పని చేయాలి, కానీ ఆ పని సులభం. మీరు కృష్ణ చైతన్యముతో ఉంటే... ఏమైనప్పటికీ, కృష్ణుడు ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నాడు. అది సత్యము. ప్రతి ధర్మము అంగీకరిస్తుంది. ఉదాహరణకు బైబిల్లో ఈ విధముగా చెప్పబడినది, "ప్రభు, మాకు మా రోజు వారి రొట్టెను ఇవ్వండి." అది సత్యము. భగవంతుడు ఇస్తాడు. మీరు ఆ... మీరు రొట్టెను తయారు చేయలేరు. మీరు చేయగలరు, మీరు బేకరీలో రొట్టెని తయారు చేయగలరు, కానీ... ఎవరు మీకు గోధుమలను సరఫరా చేస్తారు? అది కృష్ణుడిచే సరఫరా చేయబడినది Eko bahūnāṁ yo vidadhāti kāmān.

కాబట్టి మనము కృష్ణుడిని మర్చిపోయి అనవసరమైన సమస్యలను సృష్టించాము. ఇది భౌతిక ప్రకృతి. Bhave 'smin kliśyamānānām. అందువలన మీరు చాలా కష్టపడి పనిచేయాలి. Kliśyanti. భగవద్గీత, manaḥ-ṣaṣṭhānī prakṛti-sthāni karṣati. మరొక శ్లోకము ఉంది. కర్షతి, మీరు చాలా కష్టపడి పోరాడుతూ ఉన్నారు, కానీ అంతిమముగా ఇంద్రియ తృప్తి. అంతిమముగా. ఈ భౌతిక ప్రపంచంలో ఇంద్రియ తృప్తి, ఎందుకంటే కామ, కామ అంటే ఇంద్రియ తృప్తి. కామ, కేవలం వ్యతిరేక పదం ప్రేమ. కామ... కామ అంటే కామం, ప్రేమ అంటే కృష్ణుని ప్రేమించడము. కాబట్టి అది కావలసినది. కానీ ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో వారు చాలా కష్టపడి పని చేస్తున్నారు. వారు చాలా కర్మాగారాలు, ఇనుము కర్మాగారాలు, ఇనుమును కరిగిస్తున్నారు, భారీ యంత్రాలను కనుగొన్నారు, దీనిని ఉగ్ర కర్మ అంటారు, ఆసురిక కర్మ అని పిలుస్తారు. ఏమైనప్పటికీ, మీరు కొంత రొట్టెను కొన్ని పండ్లను లేదా కొన్ని పువ్వులను తింటారు. మీరు గొప్ప, గొప్ప కర్మగారములను ఎందుకు కనుగొన్నారు? అది అవిద్య, అజ్ఞానము, అవిద్య. ఉదాహరణకు వంద సంవత్సరాల క్రితం ఏ కర్మాగారము లేదు. కాబట్టి ప్రపంచంలోని ప్రజలు అందరు ఆకలితో ఉన్నారా? EH? ఎవరూ ఆకలితో లేరు. మన వేదముల సాహిత్యంలో కర్మాగారం గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. లేదు ప్రస్తావన లేదు. వారు ఎంతో సంపన్నమైనవారు. వృందావనములో కూడా. వృందావనములో, కంసుడు నంద మహారాజును ఆహ్వానించిన వెంటనే, వెంటనే వారు పంచడానికి పాలతో తయారీ చేసిన పదార్దములను బండ్లతో తీసుకు వెళ్ళారు. మీరు సాహిత్యంలో కనుగొంటారు, వారు చక్కని దుస్తులు ధరించి, బాగా ఆహారం తీనేవారు, తగినంత ఆహారం, తగినంత పాలు, తగినంత ఆవులు వారి దగ్గర ఉండేవి. కానీ వారు గ్రామం, గ్రామ వ్యక్తులు. వృందావనము ఒక గ్రామం. కొరత లేదు. ఎటువంటి బాధ లేదు, ఎల్లప్పుడూ ఆనందముగా, నృత్యం చేస్తూ, కీర్తనలు చేస్తూ, మరియు తింటూ ఉండేవారు కాబట్టి మనము ఈ సమస్యలను సృష్టించాము. కేవలము మీరు సృష్టించారు. ఇప్పుడు, మీరు చాలా గుర్రపు రహిత వాహనాలను సృష్టించారు, ఇప్పుడు సమస్య పెట్రోలు ఎక్కడ నుండి పొందాలి? మీ దేశంలో ఇది ఒక సమస్యగా మారింది. బ్రహ్మానంద నిన్న నాతో మాట్లాడుతున్నాడు. చాలా సమస్యలు ఉన్నాయి. కేవలం అనవసరంగా మనము చాలా కృత్రిమముగా అవసరాలను సృష్టించాము. కామ -కర్మభిః. దీనిని కామ అంటారు.