TE/Prabhupada 0944 - కృష్ణుడి అమరిక యొక్క ప్రయోజనమును మనము తీసుకోవాలి
730427 - Lecture SB 01.08.35 - Los Angeles
కృష్ణుడి అమరిక యొక్క ప్రయోజనమును మనము తీసుకోవాలి మన అవసరము, ఇప్పటివరకు మన శరీర అవసరాలకు సంబంధించినంత వరకు - తినడం, నిద్రపోవడము, మైథున సుఖము మరియు రక్షించుకోవడము - అది వారి జీవితమును బట్టి ప్రతి ఒక్కరికీ ఏర్పాటు చేయబడుతుంది. ఇది ఏర్పాటు చేయబడింది. కాబట్టి తక్కువ స్థాయి జీవ జాతులలో వారు ప్రతిదీ ఉంటుంది అని అర్థం చేసుకోలేరు, ఏర్పాటు చేయబడినది, వారికి తెలిసినా కూడా ఒక పక్షి వలె, అయితే... ఉదయాన్నే ఒక పక్షి నిద్ర లేస్తుంది, అక్కడ కొంత ఆహారం ఉంది. దానికి తెలుసు. అయినప్పటికీ అది ఆహారం కనుగొనేందుకు తీరిక లేకుండా ఉంటుంది. పని కర్తవ్యము, ఒక వృక్షం నుండి మరోక దాని మీదకు ఎగురుతూ, అది... అది అపారమైన పండ్లు చూస్తుంది, అన్ని చిన్నవి లేదా పెద్దవి, చాలా పండ్లు ఉన్నాయి అవి తినవచ్చు . అదేవిధముగా , అన్ని జీవులకు, ఆహార, పానీయం కోసం ఏర్పాటు ఉంది. తినడానికి, నిద్రకు, మైథున సుఖము మరియు రక్షించుకోవడము కొరకు, అమరిక ఉంది. ఆఫ్రికాలో కూడా పండ్లు ఉత్పత్తి చేసే కొన్ని చెట్లు ఉన్నాయి; ఆ పండ్లు ఇనుము బుల్లెట్ కన్నా గట్టిగా ఉంటాయి. కానీ ఈ పండ్లను గొరిల్లాలు ఉపయోగిస్తాయి. అవి కొన్ని కాయలను సేకరిస్తాయి, ఉదాహరణకు మనము కొంత వక్కను నమలడం వలె, అవి ఆ వక్కను నమలడం ఆనందిస్తాయి. కానీ అది చాలా గట్టిగా ఉంటుంది. నేను ఏదో పుస్తకంలో చదివాను, బహుశా మీకు కూడా తెలుసు, గొరిల్లాలు నివసించే అడవి భాగములో, భగవంతుడు వాటికి ఫలమిస్తాడు: "అవును, మీ ఆహారం ఇక్కడ ఉంది."
కాబట్టి ప్రతిదీ ఏర్పాటు చేయబడింది. కొరత లేదు. మనము కొరత సృష్టించాము, అవిద్య, అజ్ఞానం కారణంగా. లేకపోతే, అక్కడ కొరత లేదు. పూర్ణమిదం. కాబట్టి (Īśopaniṣad) పూర్ణమ్ అని చెప్తుంది, ప్రతిదీ పూర్తిగా వుంది. ఉదాహరణకు మనకు నీరు కావాలి, మనకు నీరు ఎంతో కావాలి. భగవంతుడు ఈ మహా సముద్రాలను ఎలా సృష్టించాడో చూడండి. మీరు తీసుకోవచ్చు... మనం వాడే నీరు, ఇది సముద్రం నుండి వస్తుంది. నిలువ ఉంది. ఇది కేవలం ఆ నిలువ నుండి పంపిణీ చేయబడుతుంది. ప్రకృతి ఏర్పాటు ద్వారా, భగవంతుడు, భగవంతుని అమరిక, అది సూర్యరశ్మి ద్వారా ఆవిరి అవుతుంది. ఇది ఆవిరైపోతుంది, అది వాయువులు, మేఘము అవుతుంది. నీరు అక్కడ ఉంటుంది. ఇతర ఏర్పాటు ద్వారా ఈ నీరు భూమి అంతా పంపిణీ చేయ బడుతుంది నిరంతరం మీకు సరఫరా చేయడానికి కొండ పైభాగంలో విసిరి వేయబడుతుంది. నది క్రిందకు వస్తోంది. మొత్తం, సంవత్సరము మొత్తం నీటి సరఫరా ఉంటుంది. ఈ విధముగా, మీరు మొత్తం పరిస్థితి అధ్యయనము చేస్తే , భగవంతుని సృష్టిలో, మీరు ప్రతిదీ పూర్తిగా, సంపూర్ణముగా ఉంటుంది అని కనుగొంటారు. అది తత్వము. అంతా సంపూర్ణముగా ఉంది. ఏది అవసరం లేదు. మన ఏకైక అవసరం, మనము కృష్ణుడి ఏర్పాటు యొక్క ప్రయోజనమును తీసుకోవడము