TE/Prabhupada 0967 - కృష్ణుడిని అర్థము చేసుకోవటానికి, మనము మన ఇంద్రియాలను పవిత్రము చేసుకోవాలి



720527 - Lecture BG The Yoga System - Los Angeles


కృష్ణుడిని అర్థము చేసుకోవటానికి, మనము మన ఇంద్రియాలను పవిత్రము చేసుకోవాలి ఒక పవిత్ర భక్తుడు ప్రతి క్షణం కృష్ణుడిని చూస్తున్నాడని చెప్పబడింది. సంతః సదైవ ( Bs 5.38). సదైవ అంటే ప్రతి క్షణం. ఆయన చూస్తున్నాడు, కానీ దాని అర్థం ఆయన వేరే వ్యక్తి అని. ఆయన ఇంద్రియాలు శుద్ధపరచబడినవి. కాంతివంతమయినవి. పవిత్రీకరించబడినవి. అందువలన ఆయన చూస్తున్నాడు. ఒకరి కన్నులు పవిత్రీకరించబడక పోయినట్లయితే పరిశుద్ధపరచబడక పోయినట్లయితే, ఆయన చూడలేడు . చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక యంత్రం లాగే. ఒక పిల్లవాడు చూస్తున్నాడు, కానీ ఆయన సరిగా చూడలేదు. ఆయన లోహము యొక్క ఒక ముద్ద చూస్తాడు. కానీ ఒక ఇంజనీర్, ఆయన చూసినపుడు, ఆయన వెంటనే అర్థం చేసుకుంటాడు ఈ యంత్రం అటువంటి అటు వంటి వాటి ద్వారా తయారు చేయబడుతుంది, అది దీని కోసం పని చేస్తుంది, మంచి యంత్రం, చెడ్డ యంత్రం, చక్కనిది. ఆయన వివిధ విధములుగా చూడగలడు. ఎందుకంటే ఆయన చూడడానికి కళ్ళు కలిగి ఉన్నారు అదేవిధముగా, కృష్ణుడిని అర్థం చేసుకోవాలంటే, మనము మన ఇంద్రియాలను పవిత్రము చేయాలి. అది నారద పంచరాత్రంచే నిర్వచించబడింది. సర్వోపాధి-వినిర్ముక్త ( CC Madhya 19.130) అన్ని రకాల హోదాల నుండి విముక్తి పొందడం. ఉదాహరణకు కృష్ణ చైతన్యమును మనము చూస్తున్నట్లుగా, కృష్ణ చైతన్యమును ఒక లక్ష్యములో అంగీకరించడం. మరొకరు, సాధారణ మనిషి ... ఉదాహరణకు ఒకరు క్రిస్టియన్ అని అనుకుందాం. అతను కృష్ణ చైతన్యమును హిందువుల ఉద్యమంగా చూస్తాడు. కానీ నిజానికి అది కాదు. అందువల్ల, అతను ఒక అమెరికన్ కావాలనే హోదా నుండి బయట పడాలి. సర్వోపాధి-వినిర్ముక్త. ఒకరు హోదా నుండి బయట పడాలి. ఈ శరీరం ఒక హోదా. వాస్తవానికి అమెరికన్ శరీరం భారతీయ శరీరం మధ్య వ్యత్యాసం లేదు. అదే శారీరక నిర్మాణం. రక్తం ఉంది, మాంసం ఉంది, ఎముక ఉంది. మీరు శరీరం లోపల చూస్తే, తేడా లేదు. కానీ ఇప్పటికీ, మనము పేరు గలిగి ఉన్నాము "నేను అమెరికన్, నీవు భారతీయుడవు, నీవు నల్లగా ఉన్నావు, నేను తెల్లగా ఉన్నాను ..." ఇవి అన్ని హోదాలు. తప్పుడువి.

అందువల్ల ఒకరు హోదాల నుండి బయట పడాలి. అది నిర్వచించబడినది, మనము హోదా నుంచి విముక్తి పొందినప్పుడు. హోదా నుండి విముక్తి పొందాలి. సర్వోపాధి-వినిర్ముక్త . వాస్తవమునకు, హోదాకు విలువ లేదు. వ్యక్తి ముఖ్యం. హోదా కాదు. కాబట్టి కృష్ణుడిని చూడటము అంటే, మొదటి కర్తవ్యము ఈ హోదాల నుండి స్వేచ్ఛ పొందటం. Sarvopādhi-vinirmuktam tat-paratvena nirmalam ( CC Madhya 19.170) ఇక్కడ మత్-పరః అంటారు, నారద చెప్పారు తత్-పరః అని. తత్-పరః అంటే కృష్ణ-తత్వం తెలుసుకోవాలని , మత్-పరః అంటే... కృష్ణుడు చెప్పారు మీరు మత్-పరా అవ్యాలని చెప్తాడు. తీవ్రంగా నాలో నిమగ్నమవ్వటము. భక్తుడు చెప్పారు కృష్ణుడిలో తీవ్రంగా నిమగ్నము అవ్వండి అది ఆలోచన, కానీ నిజానికి లక్ష్యం అదే ఉంది. అందువల్ల ఒకరు హోదాల నుండి బయట పడాలి మరియు కృష్ణుడిలో తీవ్రంగా నిమగ్నము అవ్వాలి. Sarvopādhi-vinirmuktam, mat-paratvena... అప్పుడు ఆయన నిర్మలంగా ఉంటాడు. నిర్మల అంటే ఏ భౌతిక కాలుష్యం లేకుండా పవిత్రము కావడం. నేను శరీరం భావన పరంగా ఆలోచిస్తున్నాను, అది భౌతికము, ఎందుకంటే శరీరం భౌతికము. నేను ఎంత కాలం ఆలోచిస్తూ ఉంటానో , "నేను అమెరికన్, నేను భారతీయుడను, నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను, నేను ఇది, నేను అది అనుకుంటున్నాను," అవన్నీ హోదాలు. అది నిర్మలం కాదు. పరిశుద్ధమైన పరిస్థితి పరిశుద్ధమైన పరిస్థితి నేను జీవాత్మ అని తెలుసుకున్నప్పుడు ఉంటుంది, కృష్ణుడు మహోన్నతమైన జీవాత్మ, నేను కృష్ణుడిలో భాగం అంశం. మనము లక్షణములో ఒకటి. మనము వ్యక్తులుగా వేరుగా ఉండవచ్చు. కృష్ణుడు గొప్ప వ్యక్తి. నేను చిన్న వ్యక్తి. ఈ భౌతిక ప్రపంచంలో కూడా, ఒక వ్యక్తి చాలా శక్తివంతమైనవాడు. మరొక వ్యక్తి తక్కువ శక్తివంతమైనవాడు. కానీ వారిద్దరూ వ్యక్తులు. వారు జంతువులు కాదు. అదేవిధముగా, కృష్ణుడు, భగవంతుడు, నాతో గుణాత్మకంగా ఒకటిగా ఉంటాడు. పరిమాణాత్మకంగా ఆయన చాలా చాలా శక్తివంతమైనవాడు